అండ‌గా ఉంటాం.. అధైర్య ప‌డొద్దు

వైఎస్సార్ జిల్లాః ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తున్నామ‌ని చెప్పుకోవ‌డం మిన‌హా ఆచ‌ర‌ణ‌లో చూప‌డం లేద‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు. సిద్ధారెడ్డిగారిప‌ల్లెలో మోహ‌న్‌రెడ్డి అనే రైతు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే రూ. ల‌క్ష‌న్న‌ర మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మోహన్ రెడ్డికి అప్పులు ఇచ్చిన వాళ్ల‌కు రూ. 50వేలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని అధికారుల వ‌ద్దే ఉంచుకున్నారు.  ప్రభుత్వ పరిహారం కుటుంబ పోషణకు ఆసరాగా ఉండాలి. కానీ చిలిగ‌వ్వ కూడా ఇవ్వ‌కుండా చేతులు దులుపుకుంటున్నారు. ఇదేం న్యాయం అని  వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద‌ల‌కు అండ‌గా నిల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తేనే ప్ర‌జ‌ల గుండెల్లో పాల‌కుల‌కు సుస్థిర స్థానం ద‌క్కుతుంద‌న్నారు. మోహ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి  వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. 

వైఎస్ జ‌గ‌న్‌: 
ఏమ్మా... ఏం జరిగింది త‌ల్లీ?
క‌ళావ‌తి: 
 సార్‌... నా భ‌ర్త పేరు లోమ‌డ మోహ‌న్‌రెడ్డి. మూడు ఎక‌రాల భూమి ఉంది. నిమ్మ‌చెట్లు, వేరుశ‌న‌గ వేశాం. 10 బోర్లు వేసినా నీళ్లు ప‌డ‌లేదు. రూ. 10 ల‌క్ష‌ల దాకా అప్పు అయ్యింది. అప్పు తీర్చే మార్గం లేక మా ఆయ‌న పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మాకు ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఒక కుమార్తె(గీత‌) ఉంది. 
వైఎస్ జ‌గ‌న్‌: 
ఎక్క‌డెక్క‌డ అప్పులున్నాయ‌మ్మా?
క‌ళావ‌తి:  
సోసైటీ (స‌హ‌కార శాఖ బ్యాంకు)లో రూ. ల‌క్ష ఉంది. గ్రామీణ బ్యాంకులో రూ. 80వేలు ఉంది. 
వైఎస్ జ‌గ‌న్‌:  
రుణ‌మాఫీ కాలేదా?
క‌ళావ‌తి:  
లేదు సార్‌.
వైఎస్ జ‌గ‌న్‌:  
గోల్డ్‌లోన్‌, డ్వాక్రా రుణం ఏమైనా ఉందా?  మాఫీ అయ్యిందా..?
క‌ళావ‌తి: 
 రూ. 80వేలు గోల్డ్ లోన్ ఉంది. రూ. 30 వేలు డ్వాక్రా రుణం ఉంది. ఏదీ మాఫీ కాలేదు సార్‌
వైఎస్ జ‌గ‌న్‌:
అధికారులు రాలేదమ్మా... ఏం చెప్పారు వాళ్లు..?
క‌ళావ‌తి: 
వ‌చ్చారు సార్‌. రూ. ల‌క్ష‌న్న‌ర ఇస్తామ‌న్నారు. దాంట్లోనే రూ. 50వేలు అప్పులోళ్ల‌కు ఒక్కొక్క‌రికి రూ. 5వేల చొప్పున ఇచ్చారు. ఇంకా
రూ. ల‌క్ష మాకుమార్తె చ‌దువుల‌కు ఇస్తామ‌ని చెప్పారు. నా చేతికి ఏమీ ఇవ్వ‌లేదు
వైఎస్ జ‌గ‌న్‌: 
ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌ని చెబుతున్నారు... ఇవ్వ‌లేదా..?
క‌ళావ‌తి:  
లేదు సార్‌. రూ. ల‌క్ష‌న్న‌ర మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్పారు. అది కూడ మా చేతికి ఇవ్వ‌లేదు.
వైఎస్ జ‌గ‌న్‌: 
అధైర్య ప‌డొద్దు త‌ల్లీ. పార్టీ త‌రుపున మీ కుటుంబాన్ని ఆదుకుంటాం. మీ కుమార్తెకు చ‌దువు చెప్పిస్తాం. అండ‌గా ఉంటాం. ధైర్యంగా ఉండండి.
గీత‌(రైతు కుమార్తె): 
సార్‌... నేను 10వ త‌ర‌గ‌తి చ‌దువుకున్నా. ట్రిపుల్ ఐటీలో సీటు ఇప్పించండి సార్‌. బాగా చ‌దువుకుంటా.
వైఎస్ జ‌గ‌న్‌:
ట్రిపుల్ ఐటీకి మెరిట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేస్తారు. నాన్న‌(వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి) ఉన్న‌ప్పుడు ఉన్న‌న్ని సీట్లు ఇప్పుడు లేవు. ట్రిపుల్ ఐటీ సీట్ల‌ను త‌గ్గించారు. బాగా చ‌దువుకోవాల‌మ్మా. మంచి కాలేజీలో చేర్పిస్తాం.
Back to Top