వైఎస్ జగన్ టాప్ టెన్ కామెంట్లు


హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో
చంద్రబాబు నిర్వాకాల్ని ఒక్కొక్కటిగా ఎండగట్టారు. దళితులు, అణగారిన వర్గాల్ని మోసం
చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కరువు, నీటిపారుదల ప్రాజెక్టులు, దళితుల
అభ్యున్నతి మీద వేర్వేరుగా మాట్లాడిన సందర్భంలో వైఎస్ జగన్ చేసిన టాప్ టెన్
కామెంట్లు..!

1.   అక్టోబర్ 4,5 తేదీల్లో
కరువు మండలాల్ని ప్రకటించి, సమగ్రమైన నివేదికలు అందిస్తే కేంద్రం నుంచి సరైన సాయం
అంది ఉండేది. కానీ, నవంబర్ నెలాఖరులో నివేదిక పంపించటంతో కేంద్రం నుంచి మూడో వంతు
నిధులు వచ్చాయి.

2.   ఐటీ పరిశ్రమను ప్రోత్సహించింది
వైఎస్సార్ అయితే చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. ఐటీని తానే కనిపెట్టా అంటారు,
సెల్ ఫోన్ తానే తెచ్చా అంటారు.

3.   180 టీఎమ్ సీ ల నీరు
క్రిష్ణా డెల్టాకు అవసరం అయితే 4 టీ ఎమ్ సీ ల నీరు ఇచ్చి ఆదుకొన్నా అని
చెబుతున్నారు. చెవిలో పువ్వు పెట్టడం కాదా ఇది

4.   పోలవరం కుడి కాలువ పనుల్ని
దివంగత మహానేత వైఎస్సార్ హయంలో 70 శాతం పూర్తి చేస్తే వాటి ద్వారా నీళ్లు
ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ అంతా తానే చేశానని చంద్రబాబు చెబుతున్నారు.

5.   పట్టిసీమ గురించి సూటిగా
అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక తాను అవుట్ డేటెడ్ సీఎం అని చంద్రబాబు చెప్పకనే
చెబుతున్నారు.

6.   మంచి అన్నది మాల అయితే మాల
నేనౌతా అని మహాకవి గురజాడ అన్నారు. అటువంటి మహనీయుల మాటలు తలచుకోవాలి.

7.   ఎస్సీ కులంలో పుట్టాలని
ఎవరూ అనుకోరు కదా అని వ్యాఖ్యానించిన వ్యక్తి ముఖ్యమంత్రి

8.   సాగునీటి ప్రాజెక్టుల్లో
ఎగువ రాష్ట్రాల్ని చంద్రబాబు ప్రశ్నించడు. ఎందుకంటే ఓటుకి కోట్లు ఇస్తూ
దొరికిపోయినందున కేసీయార్ ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకి లేదు.

9.   చక్కగా అబద్దాలు ఆడుతున్న
చంద్రబాబుని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

10.                    
పార్టీ మారిన నాయకులకు పదవులు కావాలి కానీ, ప్రజల్లోకి వెళ్లి
ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం మాత్రం లేదు.

 

Back to Top