వైఎస్ జగన్ టాప్ టెన్ కామెంట్లు

ఓరుగల్లు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గర్జించారు.
ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు కురిపించారు. ఓటు అడిగే హక్కు టీఆర్ ఎస్, టీడీపీ,
బీజేపీ, కాంగ్రెస్ లకు లేవని సోదాహరణంగా వివరించారు. ఆయన ప్రసంగంలోని టాప్ టెన్
కామెంట్స్..

1.     ఒక నేతకు పదవి ఇప్పించటం
కోసం ఈ ఎన్నికలు వచ్చి పడ్డాయి. అంతకు మించి కారణం కనిపించటం లేదు.

2.     రాష్ట్రానికి ఏమైనా
ప్రయోజనాలు సాధించటం కోసం ఉప ఎన్నికలు అంటే ఊరుకోవచ్చుకానీ, పదవి ఇప్పించుకొనేందుకు
ఉప ఎన్నికలా

3.     టీడీపీ కి అసలు ఓటు అడిగే
హక్కు లేదు. తెలుగుదేశం పునాదులన్నీ మోసం దగా అబద్దాల మీద ఉన్నాయి.

4.     రాజన్న పథకాలు తమవిగా
కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటుంది మరైతే, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు
అమలు చేయలేక పోయింది.

5.     బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన
హామీలు అమలు చేయలేదు కాబట్టి ఓటు అడిగే హక్కు లేదు.

6.     పత్తి కి ఇప్పుడు క్వింటాల్
కు రూ. 3వేలు కూడా ధర దొరకటం లేదు. అదే రాజన్న పాలనలో రూ. 6వేల దాకా ధర లభించేది.
అది రాజన్నరైతులకు కల్పించిన భరోసా.

7.     భారత దేశం అంతా 41 లక్షల
ఇళ్లు బలహీన వర్గాలకు కట్టిస్తే.. ఒక్క వైఎస్సార్ గారు మన రాష్ట్రంలో 48లక్షల
ఇళ్లు కట్టించారు. ఇది చాలదా రాజన్నపాలన ఎలాంటిదో చెప్పటానికి

8.     నిరుపేదల కోసం 20 లక్షల
ఎకరాల మేర భూముల్ని పంచిన ఘనత రాజన్నదే..

9.      మీరు గుండల మీద చేయి వేసుకొని చెప్పండి.
అంతకన్నా మంచి పాలన ఏదైనా ఉందా అని అడుగుతున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని
విధంగా పాలన చేశారు. మనందరి గుండెల్లో నిలిచే ఉన్నారు.

10.                       
 వైఎస్సార్సీపీ కి
మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది. వైఎస్సార్సీపీ కి ఓటేయండి. రాజన్న పాలన
తెచ్చుకొందాం. 

Back to Top