అన్నదాతకుభరోసా

 అన్నట్టే చేస్తున్నాడు. ఆయన అన్నమాటే నిలబెట్టుకుంటున్నాడు. అడుగడుగునా తన మేనిఫెస్టోలో ప్రజల అవసరాలను చేర్చుకుంటూ పోతున్నాడు. రైతునే రాజుగా చూడాలనుకున్నఆ మహానేత వారసుడు అలా కాక ఇంకెలా ఆలోచిస్తాడు..? అందరికీ అన్నంపెట్టే రైతు అప్పుల భారంలో కొట్టుమిట్టాడటం చూసిన ప్రతిపక్ష నేత పేదల ప్రభుత్వం రాగానే రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చాడు. రైతు పంట వేసే ముందు నుంచి పంట కోసి గిట్టుబాటు ధర అందే వరకూ అడుగడుగునా అండగా ఉండేలా ఎన్నో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు వైయస్ జగన్. 

రైతన్నల నేస్తం రానున్న జగనన్న ప్రభుత్వం
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రైతు దుస్థితిని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆరుగాలం శ్రమించిన రైతుకు వ్యవసాయం కంటే ఉరే సులువుగా కనిపిస్తోంది. చివరకు ప్రాణాలు తీసుకున్నా అప్పుల జంఝాటం మాత్రం వదలడం లేదు. ఒక పక్క కరువు కబళిస్తూ, మరో పక్క పంట గిట్టుబాటు కాక, ప్రభుత్వం చేసే మోసాలతో రైతన్నలు అల్లాడిపోతున్నారు. రాయలసీమ, డెల్టా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల రైతులకు నెత్తిన కుచ్చు టోపీ పెట్టిన ఘనత చంద్రబాబుకే చెందుతుంది. 
పెట్టుబడికి సాయం
 ఏటా పంటను వేయాలంటే రైతు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. కనీసం 10వేలు అప్పు పుట్టాలన్నా గగనమే అయిపోతోంది. రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయకపోవడంతో బ్యాంకుల దగ్గరకు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది రైతుకు. పొలాన్ని బీడు పెట్టలేని రైతు వడ్డీ వ్యాపారుల దగ్గర, మైక్రో ఫైనాన్సర్ల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి పంట పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ కష్టాన్ని తప్పించేందుకే ప్రతిపక్ష నేత ప్రతి రైతుకు మే నెలలో 12500లు అందిస్తామని ప్రకటించారు. 
గిట్టుబాటు ధరపై దిగులు లేకుండా
పండిచిన పంటను రవాణా ఖర్చులు పెట్టుకుని మార్కెట్టుకు తెస్తే వ్యాపారుల మోసాలు రైతు గుండెను మండిస్తున్నాయి. కూలీ కూడా గిట్టుబాటు కాలేదంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. కొందరైతే అపర స్వర్గధామం అని చంద్రబాబు కీర్తిస్తున్న అమరావతిలోనే నడిరోడ్డు మీద ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టించి పండించడమే రైతు బాధ్యత. ఆ కష్టానికి తగ్గ ఫలితం రైతుకు అందించడం ప్రభుత్వ విధి అని ధరల స్థిరీకరణ నిథికి ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు ప్రతిపక్షనేత. 
కరువు ఇక బాధించదు
కరువు కాటుకు అన్నపూర్ణ ఆంధ్రదేశంలో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 301 కరువు మండలాలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. దుర్భిక్షంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నమైనా చేయలేదు చంద్రబాబు సర్కార్. కలెక్టర్ నివేదికలు 500పైగా కరువు మండలాలు ఉన్నాయని చెబుతుంటే అసలు కరువే లేదంటూ పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసిన క్రూరత్వం చంద్రబాబుది. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించిన తర్వాత కరువు నివారణా చర్యలకు 4వేల కోట్ల స్థిరీ కరణ నిథి ఏర్పాటు చేసి, రైతులకు కరువు భారం, కన్నీటి భారం లేకుండా చేస్తామని చెప్పారు యువనేత. 
మళ్లీ నెరవేరనున్న ఉచిత విద్యుత్ కల
ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకుంటారంటూ నాడు దారుణమైన విమర్శలు చేసాడు చంద్రబాబు. వైయస్సార్ హయాంలో ఉచిత విద్యుత్ తో రైతన్నలు వ్యవసాయాన్ని పండగలా జరుపుకున్నారు. ఆ తండ్రి బాటలోనే వైయస్ జగన్ ఉచిత విద్యుత్ ను రైతులకు వరంగా అందిస్తామని చెప్పారు. అది కూడా పగిటి వేళలోనే అని తెలియజేసారు. ఇది నిజంగా రైతు క్రాంతికి ఓ శుభ పరిణామం. 
అన్నదాత కుటుంబానికి అండ వైయస్సార్ బీమా
ఒక వ్యక్తి మరణం కుటుంబాన్ని కుంగదీస్తుంది. ఓ రైతు మరణం వ్యవసాయానికి గొడ్డలిపెట్టు అవుతుంది. అందుకే ఆధారం లేకుండా పోయిన ఆ అన్నదాత కుటుంబాన్ని వెనువెంటనే ఆదుకునేలా వైయస్సార్ బీమను ప్రవేశ పెడతామన్నారు వైయస్ జగన్. అప్పులు, గిట్టుబాటు ధరల కోసం ఆత్మహత్యలు చేసుకోరాదని, త్వరలో మన ప్రభుత్వం వస్తుందని రైతునే రాజును చేస్తుందని అన్నదాతలకు అభయం ఇచ్చారు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 
ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు కానుకగా ఇస్తాం  వైయస్ జగన్
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పెండిగ్ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేశారు. కొన్ని కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టి త్వరత్వరగా అందుబాటులోకి తెచ్చారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులను కూడా అడ్డంకులను తొలగించి, అనుమతులు సంపాదించి, వెంట వెంటనే నిధులు విడుదల చేసి సగానికిపైగా పూర్తి చేసి చూపించారు. హఠాత్తుగా ఆయన ఈ లోకం విడిచి వెళ్లిపోవడంతో ప్రాజెక్టులకు జీవం తెగిపోయినట్టే అయ్యింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టులను నత్తనడక నడిపిస్తోంది. కమీషన్ల కక్కుర్తే తప్ప, ప్రజల ప్రయోజనాలను కాస్తైనా పట్టని పనికిమాలిన ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం ఇది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండిగ్ ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేస్తామనే హామీ ప్రజలకు చల్లని చిరుజల్లులాంటి శుభవార్తే. 
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత ఊరూరా రైతులతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎలా ఉన్నాయో, వారి ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఆదివారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలోని ఎర్రగుడి గ్రామంలో రైతు ఆత్మీయ సమ్మేళనం జరిపారు వైయస్  జగన్. ఆ సదస్సులో రైతులతో ముఖాముఖీ చర్చించారు. ఆ సమయంలోనే ‘రైతు భరోసా’ తో రైతును రాజును చేద్దాం వ్యవసాయాన్ని పండుగ చేద్దామని చెప్పిఆన్నదాతల గుండెల్లో ఆనందాన్ని నింపారు.
 


Back to Top