దిక్కుమాలిన ప్రభుత్వం..!

అసైన్డ్ భూములు మీ అత్తసొత్తా...! 
శ్మశానం కూడా వదలని దుస్థితి..!
గుంటూరుః చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసే రోజు దగ్గర్లోనే ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుడనిపాలెంలో వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.  అసైన్డ్ భూములు చంద్రబాబు అబ్బసొత్తు కాదని జగన్ ఫైరయ్యారు. అధికారమదంతో పేదల భూములు లాక్కుంటున్న చంద్రబాబు వారి ఉసురు తగిలిపోవడం ఖాయమన్నారు. 

బాధిత రైతులు..
మూడు తరాల నుంచి అసైన్డ్ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. బెదిరించి భూములను లాక్కొంటున్నారు.  తమ పూర్వీకుల ఆనవాళ్లు లేకుండా శ్మశానాలు కూడా ధ్వంసం చేసి రోడ్లు వేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి దళితులను ఆహ్వానించలేదు. తాము ఎలాంటి సంతకాలు పెట్టకపోయినా భూములు లాక్కుంటున్నారు. గతంలో పంటలు తగలబెట్టినప్పుడు.... వైఎస్ జగన్ చేయించాడని ఒప్పుకోవాలంటూ తమను చిత్రహింసలు పెట్టారు.  స్టేషన్ కు తీసుకెళ్లి మూడ్రోజుల పాటు ఇబ్బందులు పెట్టారు. ఉన్న చారెడు భూమి కూడా తీసుకుంటే తామెలా బతికేదని వైఎస్ జగన్ ఎదుట రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. రుణాలు మాఫీకాక అప్పులు ఎక్కువై గేదెలు, బంగారం అమ్ముకుంటున్నామని రైతులు వాపోయారు. భూములు ఇవ్వాలని బెదిరిస్తూ శంకుస్థాపన నాటి నుండి కరెంట్ కూడా కట్ చేశారని రైతులు ఆవేదన చెందారు. 

వైఎస్ జగన్..
పంటపొలాలను తగలబెట్టేది పచ్చచొక్కాలయితే...ప్రధాన ముద్దాయిగా రైతులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇచ్చిన లీజ్ అయిపోయిందని భయపెడుతూ రెవన్యూ రికార్డ్ లు కూడా మార్చేసి ల్యాండ్ పూలింగ్ కోసం బలవంతంగా భూములివ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు.  ఇదెక్కడి న్యాయమని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  పేదరికంలో ఉండి నిజాయితీగా బతుకుతున్న ప్రజలను చూసైనా బుద్ది తెచ్చుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. పేదలకు వంద, రెండొందల గజాలు ఎక్కువ ఇవ్వాల్సింది పోయి ఉన్నవి కూడా లాక్కుంటారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన భూములను లాక్కునే అధికారం ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్కనే ఉన్న సుజనా చౌదరి, మురళీ మోహన్ లాంటి పచ్చనేతలంతా గజం రూ.9 వేల చొప్పున అమ్ముకుంటూ..పేదల భూములు మాత్రం లాక్కుంటున్నారని విమర్శించారు. 

శ్మశానం కూడా వదలని దిక్కుమాలిన ప్రభుత్వం..!
హెలిప్యాడ్ లు ,శంకుస్థాపన అంతా రైతుల భూమిలోనే చేసి వారిని కార్యక్రమానికి పిలవలేదు. ఆఖరికి శ్మశనాలు కూడా వదలని దిక్కుమాలిన ప్రభుత్వం ఇదని వైఎస్ జగన్ ఫైరయ్యారు. రుణాలు మాఫీకాక బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టుకున్నారు. అధి ఇంటికొచ్చే పరిస్థితి లేదు.  భూమివ్వని వారిపై కక్షగట్టి పొలాలకు కరెంట్ కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.  చంద్రబాబుకు ప్రజలే గట్టిగా బుద్ది చెప్తారని వైఎస్ జగన్ అన్నారు.  రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే చంద్రబాబు గుంజుకున్నభూములను తిరిగి ఇచ్చేస్తామన్నారు. అసైన్డ్ భూములు ఎవరూ లాక్కోకుండా చట్టాలను మారుస్తామన్నారు. 
Back to Top