చంద్రబాబుకి చురకలు అంటించిన వైఎస్ జగన్

హైదరాబాద్) ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు అసెంబ్లీ లో చురకలు అంటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో
చెప్పమని అంటూ తప్పుడు అర్థాలు చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ల్యాండ్
పూలింగ్ కు సంబంధించిన విషయాలు క్లియర్ గా ఉన్నాయని చెప్పబోయారు. అప్పుడు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే రాజధాని భూములకు పక్కనే
ట్రేడింగ్ జరుపుకొని పేదల భూముల్ని ప్రభుత్వం లాక్కోవటం అని స్పష్టం చేశారు.
మీనింగ్ తెలిసినా తెలియనట్లుగా నటించవద్దని స్పష్టం చేశారు.

          తర్వాత కూడా ప్రసంగాన్ని కొనసాగించిన చంద్రబాబు ఏ విధమైన
విచారణకు అంగీకరించబోమని చెప్పారు. ఒక వేళ విచారణ జరిపితే దాని కారణంగా ఇతర
రాష్ట్రాల్లో చెడ్డ పేరు వస్తుందని వాదించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా వై ఎస్
జగన్ మాట్లాడారు. సూటిగా విచారణ అడుగుతున్నామని, విచారణకు అంగీకరిస్తారా లేదా అని
డిమాండ్ చేశారు. దీనిపై కూడా చంద్రబాబు అదే మాట చెప్పారు. 

Back to Top