గురజాడ పద్యాన్ని వినిపించిన వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ లో చర్చ సందర్బంగా చంద్రబాబు దళితులకు చేస్తున్న ద్రోహాన్ని వైఎస్ జగన్ గణాంకాలతో సహా బయట పెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ఏవిధంగా పక్క
దోవ పట్టిస్తున్నది గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మనస్తత్వం
మీద ఒక్కసారిగా నిప్పులు కక్కారు.

100 సంవత్సరాల క్రితమే మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన పద్యాన్ని అశువుగా
వినిపించి అందరినీ ఆకట్టుకొన్నారు.

‘‘ ఎంచి చూడగా మనుజులందు రెండే కులములు

మంచి అన్నది మాల అయితే మాల నేనౌతా ’’

అంటూ మహాకవి గురజాడ పద్యాన్ని అసెంబ్లీలో చదివి వినిపించారు. అటువంటి సందర్భంలోనే
చంద్రబాబు గతంలోనే చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. పుట్టుకతోనే ఎవరూ ఎస్సీ
కులంలో పుట్టాలని అనుకోరు కదా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.
ఇటువంటి వ్యక్తులకు దళితుల మీద ఎటువంటి ప్రేమ ఉంటుందో తెలుసని చురకలు అంటించారు.

 

తాజా వీడియోలు

Back to Top