టీఆర్ ఎస్ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం

వరంగల్: తెలుగు నాట ప్రతీ గుండె చప్పుడులో దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షులు
వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. దివంగత నేత చనిపోయినప్పుడు బాధ అనిపించిందని, కానీ,
తర్వాత ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు వదిలి వెళ్లారని ఆయన స్మరించుకొన్నారు. అందుకే
అదే ధైర్యంతో ఓటు అడుగుతున్నానని, వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కి ఓటేసి
గెలిపించాలని విన్నవించారు. ఈ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం అని జగన్
అభివర్ణించారు.

వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన హన్మకొండ లోని
హయగ్రీవాచారి స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..!

ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అన్నది అంతా
ఆలోచించుకోవాలి. సహేతుకమైన కారణంతో ఎన్నికలు అయితే ఎవరూ బాధపడరు. కానీ, కేంద్రం
నుంచి రావలసిన హామీలు రాబట్టేందుకో లేక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకో అయితే
బాగుండేది. కానీ, తనకు నచ్చిన వ్యక్తికి మంత్రిపదవి ఇచ్చి కేసీయార్ గారు మోజు
తీర్చుకొనేందుకు ఎన్నికలు వచ్చాయి. ఇదే జిల్లాలో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉంటే
వారిని ఎందుకు ఉపయోగించుకోలేదు అని అడగండి. అప్పటి దాకా డిప్యూటీ సీఎం గా ఉన్న
వ్యక్తిని పదవిలోంచి తీసేసి తన మోజు కోసం ఈ ఎన్నికలు తెచ్చిపెట్టారు.

దీన్ని బట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొరపాటున
అయినా ఓటు వేస్తే కేసీయార్ గారు అనుకొంటారు. ఇప్పటికే ప్రజల్ని ఆయన పట్టించుకోవటం
లేదు, ఓటు వేసి గెలిపిస్తే మాత్రం అస్సలు పట్టించుకోవద్దని అనుకొంటారు.

కేసీయార్ ను కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది. 18 నెలలు పరిపాలన
చేశారు. ఈ ఒక్క జిల్లాలోనే 150 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారు అని
అడగండి. ఒక్క రోజైనా పత్తి పొలాల్లోకి వెళ్లారా.. పత్తి రైతుల ఆవేదనల్ని
పట్టించుకొన్నారా అని అడగండి. అమ్ముకొనేందుకు పోతే కనీస మద్దతు ధర రూ. 4,100
అంటున్నారు. కానీ కారణాలుచూపుతూ రైతులకు రూ. 3,500 కూడా గిట్టని పరిస్థితిలో  పంట నడుస్తోంది. కానీ, దివంగత మహానేత వైఎస్సార్
పరిపాలన కాలంలో పత్తి కి క్వింటాల్ కు రూ. 6,700 ధర పలికేది. ఇప్పుడు పత్తిరైతుకి
సరైన రేటు పలక్కపోతే పట్టించుకొనే వారు లేకపోయారు.

ఎన్నికల ముందు రుణమాఫీ అన్నారు. కానీ ఇప్పుడు 4 దఫాలుగా, 5
దఫాలుగా మాఫీ చేస్తానంటున్నారు ఆరోజు మాత్రం ఈ మాట చెప్పలేదు. అదే మాట అప్పుడు
ఎందుకు జరగలేదు అనిఅడగండి. అదే బ్యాంకులు 14 శాతం అపరాధ వడ్డీ వేసే పరిస్థితి.
కేసీయార్ఇచ్చే డబ్బులు మూడో వంతు వడ్డీలకే పోయేట్లుగా ఉంది పరిస్థితి. ఈ అప్పుల
బాధ భరించలేక 150 మంది చనిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది.

కేసీయార్ ను అడగాలి.. ఎన్నికలకు ముందు ప్రతీ పేదవాడికి
రెండు బెడ్ రూమ్ లు ఉన్న ఇళ్లు కట్టిస్తామన్నారు. 18 నెలలు గడిచిపోయాయి.
ఎన్నిఇళ్లులు కట్టించారు అనినిలదీసి అడగండి. రాష్ట్రం మొత్తం మీద 396 ఇల్లు. కానీ,
దివంగత నేత వైఎస్సార్ గారి పరిపాలన గుర్తు తెచ్చుకోండి. దేశం మొత్తం మీద 48 లక్షల
ఇళ్లు కట్టిస్తే మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు అంటే సంవత్సరానికి 10 లక్షల
ఇళ్లు. కానీ, కేసీయార్ పాలనలో ఏడాదిన్నర లో 396 ఇళ్లు అంటే ఏ మూలకు సరిపోతుంది అని
అడగండి.

ఏ రోజైనా మీరు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొన్నారా అని
కేసీయార్ ను  అడగండి. రేట్లు చూస్తే షాక్
కొడుతున్నాయి. కందిపప్పు కిలో 230, మినపప్పు కిలో 170 పలుకుతున్నాయి. గత ఏడాదిలో
కందిపప్పు కిలో రూ. 90 , మినపప్పు రూ. 80 ఉండేవి.  టమాటా చూస్తే 50, 60 రూపాయిల ధర పలుకుతోంది.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదరికాన్నిపూర్తి గా
మాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అద్యయనం చేసి, ప్రయత్నం చేశారు. దీనికి 2 కారణాలు. 1.
పిల్లల చదువులు 2. కుటుంబ సభ్యులకు అనారోగ్యం. పిల్లలకు సరైన చదువులు
చెప్పించలేకనో లేక కుటుంబ సభ్యులకు సరైన చికిత్స అందించలేకనో అప్పుల పాలైపోయి
బాధలు అనుభవిస్తుంటారు. అందుకే వైఎస్సార్ దీర్ఘకాలిక వ్యూహంతో పరిష్కారాల కోసం
అన్వేషించారు .  ప్రతీ కుటుంబం ఇంజనీరింగు,
డాక్టర్ చదవాలన్న ఉద్దేశ్యంతో చదువులు చెప్పించారు.రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొట్ట
మొదటి సారిగా ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకం తీసుకొని వచ్చారు. గత సంవత్సరం 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను 2,450 కోట్లు అయితే 1,530
కోట్లు బకాయిలు పెట్టారు. ఇప్పటికీ చెల్లించలేదు. అప్పుడే కాలేజీలు మొదలై 5 నెలలు
అయిపోయింది. గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ పూర్తి కాలేదు. కోర్సు
పూర్తయిన వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదు. ప్రతీ విషయంలోనూ జరుగుతూ ఉన్నది
ఆలోచించండి.

దివంగత నేత ప్రతీ పేదవాడికి 20 లక్షల 60 వేల
ఎకరాలు..ఇప్పుడు కేసీయార్ గారు 16 వందల ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు. ప్రతీ
విషయంలోనూ పరిపాలన ఒక పద్దతి ప్రకారం ఉండాలి. రాజకీయాల్లో నిజాయతీ రావాలి. మాట
ఇస్తే మాట మీద నిలబడాలి అన్న తీరు రావాలి. రాజన్న రాజ్యం మనం తీసుకొని రావాలి. కానీ,
ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం..చేతకాని ప్రభుత్వం. ఆ విషయం గుర్తు పెట్టుకోండి.

ఇక మిగిలిన పార్టీల సంగతి చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి
అస్సలు ఓటేయకూడదు. ఆ

 పార్టీకి నిజాయతీ
లేదు. నాయకులు అవసరం అయితే దండలు వేస్తారు, లేదంటే మాత్రం బండలు వేస్తారు. కాంగ్రెస్
కు ఓటు వేస్తే మనకు విలువ, విశ్వసనీయత లేనట్లే అన్నమాట. మీరు గుర్తు చేసుకోండి.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సర్వస్వాన్ని కాంగ్రెస్ కోసం త్యాగం
చేశారు. ఎవరూ లేనప్పుడు ప్రాణాలు లెక్కచేయకుండా పాద యాత్రలు చేసి ప్రాణం పోశారు.
కానీ, ఒకటి గుర్తించుకోండి. బతికి ఉన్నంతకాలం ఆయన మంచివాడే. జగన్ కాంగ్రెస్ లో
ఉన్నంత కాలం మంచోడే.

కానీ, జగన్ కాంగ్రెస్ ను విడిచిపోయాక మాత్రం చెడ్డవాడు
అయిపోయాడు. అదే వైఎస్సార్ కుటుంబ సభ్యుల్ని జైలుకి పంపించారు. మీరు ఇప్పుడు
చూడండి.. కాంగ్రెస్ మీటింగ్ లకు సచిన్ పైలట్ లను పిలిపించుకొంటున్నారు.
తెలుగుమాట్లాడటం వస్తుందా అని అడగండి. వీళ్లు మనకు మీటింగ్ లు పెడతారు. వీళ్లకు
ఓటేయమని అడగుతున్నారు.

ఇక, టీడీపీ విషయం చూద్దాం. 18 నెలలుగా చూస్తున్నాం. మీరు
ఆడిన అబద్దాలు, మీరు చేసినమోసాలు, మీరు పొడిచిన వెన్నుపోట్లు..

తెలుగుదేశం పరిపాలన చూస్తుంటే దారుణంగా ఉంది. మీరు చెప్పిన
వాళ్లకు ఎందుకు ఓట్లేయాలని అడగండి.

బీజేపీ పార్టీని సూటిగా అడగాల్సిన అవసరం ఉంది. విభజించేటప్పుడు
ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా అని అడగాలి. విలువలు, విశ్వసనీయత
న రాజకీయాల్లోకి తెచ్చుకోవాలి అంటే అది వైఎస్సాసీపీ తోనే సాధ్యం.

మా గుండెచప్పుడులోనూ వైఎస్ ఆర్ ఉన్నారు. అప్పట్లో నాకు
నాన్న పోయారే అనిపించింది. ఆ తర్వాత చిరునవ్వు అలాగే నిలిచింది. ఎందుకంటే, ఆయన
చనిపోయిన తర్వాత ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. అదే స్ఫూర్తి, అదే దైర్యంతో
అడుగుతున్నాం. ఓట్లు అడిగే హక్కు మనను ఉంది. ప్రతీ మనిషికి, ప్రతీ కుటుంబానికి
మేలు చేసిన వ్యక్తి ఆయన మాత్రమే.

మీ చల్లని ఆశీస్సులు సూర్య ప్రకాష్ కు కావాలి. ఆయనకు ఓటేసి
గెలిపించండి.

ఈయన ఎంత మంచి వ్యక్తి అంటే ఆశ వర్కర్ల గురించి మాట్లాడండి
అని గుర్తుచేశారు. పాపం వాళ్లంతా 78 రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెలకు 500,
వెయ్యి రూపాయిలు సంపాదిస్తున్నారు. ఆ సంపాదనతో కుటుంబం ఎలా సాగుతుంది చెప్పండి
నిత్యావసర వస్తువుల ధరలు  ఎలా ఉన్నాయి. ఎలా
బతుకుతారో చెప్పండి, అదీ ఈ పాలన తీరు.

ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ది చెప్పమని మిమ్మల్ని
అడుగుతున్నా. 

తాజా ఫోటోలు

Back to Top