చ‌ల్లంగా ఉండు నాయానా!

* ద‌స్త‌గిరమ్మ కోరిక‌ను నెర‌వేర్చిన వైయ‌స్ జ‌గ‌న్‌
* తులాభారం కింద ల‌డ్డూలు చెల్లించిన ద‌స్త‌గిరమ్మ‌
* నాలుగేళ్ల ఎదురు చూపులు ఫ‌లించాయంటూ వృద్ధ మ‌హిళ ఆనందం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌జ‌ల్లో ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క సంఘ‌ట‌న తెలియ‌జేస్తోంది. గ‌త నాలుగేళ్ల క్రితం అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో వైయ‌స్ జ‌గ‌న్ అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ల్ల‌డిల్లిపోయారు. వైయ‌స్ జ‌గ‌న్ త్వ‌ర‌గా జైలు నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని దేవుళ్ల‌ను మొక్కుకున్నారు. అలా మొక్కుకున్న వారిలో ఈ ద‌స్త‌గిర‌మ్మ ఒక‌రు. వైయ‌స్ఆర్ జిల్లా బొజ్జవారిపల్లెకు చెందిన దస్తగిర‌మ్మ  వైయ‌స్ జ‌గ‌న్ జైలుకు వెళ్లినప్పుడు త్వరగా బయటికి రావాలని, అలా వస్తే మాబు సుబ్‌హాని దర్గాలో తులాభారం కింద ఎంత బరువుంటే అంత లడ్డూ చెల్లిస్తానని మొక్కుకుంది. తర్వాత వైయ‌స్ జ‌గ‌న్ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చినా దస్తగిరమ్మ మొక్కు అలాగే ఉండిపోయింది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎవ‌రు గ్రామంలోకి వ‌చ్చినా వైయ‌స్ జ‌గ‌న్ పిలుచురారా అని వేడుకునేది. ‘గడపగడపకు వైయ‌స్ఆర్‌’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బొజ్జవారిపల్లె గ్రామానికి వెళ్లినప్పుడు దస్తగిరమ్మ తన మొక్కు గురించి వివరించింది. కూలి ప‌నుల‌కు వెళ్లి దాచుకున్న డబ్బునుసైతం ఎమ్మెల్యేకి చూపించింది. 

ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ఈ విష‌యాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి చేరవేశారు. దీంతో దస్తగిరమ్మ కోరిక‌ను నెర‌వేర్చాల‌ని ప్రతిపక్ష నేత నిర్ణయించుకున్నారు. ఆ మేరకు శనివారం రాత్రి ప్రొద్దుటూరు నియోజకవర్గం  బొజ్జవారిపల్లెలోని దస్తగిరమ్మ ఇంటికెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. తనపట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడ్నుంచి నేరుగా మాబు సుబ్‌హాని దర్గాకు చేరుకుని లడ్డూలతో తులాభారం తూగడం ద్వారా మొక్కు చెల్లించారు. ఎట్టకేలకు నాలుగేళ్లకు తన ఎదురుచూపులు ఫ‌లించాని ద‌స్త‌గిర‌మ్మ ఆనందం వ్య‌క్తం చేశారు. 
Back to Top