గుంటూరు గుండెల్లో జ‌గ‌నిజం



- 26 రోజులు గుంటూరు జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర 
 - జిల్లాలో 281 కి.మీ నడిచిన జగన్‌
- 12 నియోజకవర్గాల్లో సాగిన జ‌న‌నేత‌ పాదయాత్ర 
- 16 మండలాల్లోని 151 గ్రామాల్లో   ప్రజాసంకల్పయాత్ర 
-  11 బహిరంగ సభలు, ఐదు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న జగన్‌
- గుంటూరు జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో కూడా కొనసాగిన పాదయాత్ర
-  వైయ‌స్‌ జగన్‌ అడుగులో అడుగేసిన మహిళలు
- మండే ఎండలను సైతం లెక్క చేయని మహిళలు
- హోదా కోసం నినదించిన విద్యార్ధులు, నిరుద్యోగులు
- చెరువులో మట్టి, పొలాల్లో మట్టి,  నదులు, వాగుల్లో ఇసుకను దేన్ని వదలని టీడీపీ పెద్దలు అంటు జ‌నం విమ‌ర్శ‌లు 

గుంటూరు:  రాజన్న బిడ్డను గుంటూరు గుండెల్లో పెట్టుకుంది. వైఎస్‌ జగన్‌ను మనసుకు ఆత్మీయంగా హత్తుకుంది. జగన్ గుంటూరు జిల్లాలో అడుగుపెట్టి 26 రోజులు.  గుంటూరు మనసులో ఏముందో తెలుసుకోవడానికి యత్నించాడు. జనం బాధలకు, సమస్యలకు  జగన్ ప్రతినిధి అయ్యారు. 
మార్చి 12న  ప్ర‌కాశం జిల్లా నుంచి జగన్ గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టిన  రోజు. బాపట్ల నియోజకవర్గం ఈపురుపాలెం దగ్గర  జగన్‌కు ఘనస్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యే  కోన రఘుపతి ఆధ్వర్యంలో జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు.

అర్బన్‌ ప్రాంతాల్లో పాదయాత్ర
గుంటూరు జిల్లా నుంచి జగన్‌ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. అప్పటి వరకు పాదయాత్ర షెడ్యూల్‌లో గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌..గుంటూరు జిల్లా నుంచి షెడ్యూల్‌లో అర్బన్‌ ప్రాంతాలను కూడా చేర్చారు. జగన్‌ అర్బన్‌ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు విశేష సంఖ్య‌లో మహిళలు ఆయన వెంట  న‌డిచారు. ముఖ్యంగా గుంటూరు టౌన్‌లో పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ అడుగులో అడుగేయడానికి మహిళలతోపాటు, విద్యార్ధినులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానం చాటుకున్నారు.  మండే ఎండలనూ  కూడా లెక్క చేయలేదు.
హోదా ఉద్యమం తారాస్థాయికి 
గుంటూరు జిల్లాలో జగన్ అడుగుపెట్టే సమయానికే హోదా ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. వైఎస్‌ జగన్ పిలుపుతో కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. ముఖ్యంగా విద్యార్ధులు, నిరుద్యోగులు పాదయాత్రలో  పాల్గొని  నినాదాలతో హోరెత్తించారు.  మార్చి24న  నరసరావుపేటలో  జరిగిన సభకు జనం పోటెత్తారు. పల్నాడు బస్‌ స్టాండ్‌  సెంటర్  వేలాది మంది అభిమానులతో నిండిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్‌టీ కడుతుంటే...నరసరావుపేటలో మాత్రం  టీఎస్‌టీ, కేఎస్‌టీ  చెల్లించాల్సి వస్తుందని జగన్ విమర్శించారు. 
- మార్చి27న గుడిపూడిలో  బీసీల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. బీసీలపై నిజమైన ప్రేమ చూపించింది వైఎస్‌ఆరేనని  చెప్పారు. అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 
- మంగళగిరిలో చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు బడ్జెట్‌లో ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తానని చెప్పి..ఇప్పటి వరకు 183 కోట్లే ఖర్చు చేశారని జగన్ విమర్శించారు.
- ఇక...రాజధాని అమరావతి సీఆర్‌డీఏలోకి జగన్ ప్రవేశించే సమయానికి  ప్రభుత్వంపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి.  చెరువులో మట్టి, పొలాల్లో మట్టి,  నదులు, వాగుల్లో ఇసుకను దేన్ని వదలకుండా టీడీపీ ప్రభుత్వం దోచుకుంటోంద‌ని బాధితులు గోడు వెళ్ల‌బోసుకున్నారు. రాజధానిలో భూములు ఎలా లాక్కుంది..సీఎమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారాడ‌ని స్థానికులు జగన్‌కు ఫిర్యాదు చేశారు.  ఏప్రిల్11న ఉండవల్లిలో జరిగిన సభలో జగన్..చంద్రబాబు దోపిడిపై మండిపడ్డారు. 
- మార్చి12న గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ మొత్తం 26 రోజులపాటు  నడిచారు. 281 కిలో మీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను చుట్టేశారు. 16 మండలాల్లోని 151 గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. 11 బహిరంగ సభలు, ఐదు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గుంటూరులో జగన్ .ప్రజలు సమస్యలు, బాధలు తెలుసుకుంటూ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పారు. 
26 రోజులపాటు గుంటూరు జిల్లాలో నడిచిన జగన్.. ఈ నెల 14న  కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. కృష్ణా జిల్లాలో తమ అభిమాన నేతకు స్వాగతం పలకడానికి వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాయి.  

తాజా వీడియోలు

Back to Top