బాబుకు ముఖ్యమంత్రి జాబొచ్చింది..!

ఉద్యోగాలన్నీ ఊడబీకుతున్న చంద్రబాబు..!
కొలువులు దక్కవేమోనన్న బెంగలో నిరుద్యోగులు..!

గుంటూరుః నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్నికలముందో మాట, తర్వాత మాట చెబుతూ ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని జగన్ మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. చంద్రబాబుకైతే ముఖ్యమంత్రి జాబొచ్చింది. కానీ రాష్ట్రంలోని ఉద్యోగుల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న జాబులు ఊడబీకుతున్నారని జగన్ అన్నారు.  ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 

ఆలు లేదు సూలు లేదు..!
రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం  కోటి 75 లక్షల ఇళ్లు ఎదురు చూస్తున్నాయి . రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్రంలో లక్షా 42 వేల ఉద్యోగాలున్నాయన్నారు. వాటి ఊసేలేదు. డీఎస్సీ రాసి ఏడాది కావస్తున్నా వారికి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ పరీక్షల కోసం సంవత్సరాల తరబడి ఇళ్లకు దూరమై కోచింగ్ లు తీసుకుంటున్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ అప్పులు చేసి మరీ చదువుతున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వరు. కనీసం ఇయర్ క్యాలెండర్ ప్రకటించడం లేదని పచ్చప్రభుత్వంపై జగన్ ఫైరయ్యారు. రాష్ట్రంలో ఉన్న స్కూళ్లను ,హాస్టళ్లను తగ్గించేస్తూ మిగులు ఉద్యోగాలున్నాయని చంద్రబాబు మభ్యపెడుతున్నాడు. డీఎస్సీ రాసిన వారికి ఎగనామం పెట్టబోతున్నానన్న సంకేతాలిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

లెఫ్ట్ రైట్ సెంటర్ పీకేస్తున్నారు..!
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎడాపెడా తీసేస్తున్నారు. 30 వేలమంది ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల  ఉద్యోగాలు పీకేశారు. మిగతావారు తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియక బిక్కుబిక్కుమంటుూ గడుపుతున్నారు. 40 వేలమంది సంఘమిత్రులు బాబు రాకముందు రైగ్యులర్ అవుతుందనుకున్నారు. అంతకుముందు రూ.4 వేలు వచ్చేది. చంద్రబాబు వచ్చాక రూ.2 వేలు కత్తిరించి వారిని రోడ్డున పడేశారు. ఉద్యోగాలు రావేమోనన్న బెంగతో ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది ఆత్మబలిదానం చేసుకున్నారు. నెల్లూరులో లక్ష్మయ్య, రామయ్య, తిరుపతిలో  కోటి, కృష్ణాజిల్లాలో  ఉదయభాను, కర్నూలులో లోకేశ్వరరావు లు చనిపోయారు. ఐనా చంద్రబాబు బుద్ధి మారడం లేదని జగన్ దుయ్యబట్టారు.

తీరని అన్యాయం..!
70 శాతం పరిశ్రమలు, 90 శాతం సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. చదువులు అయిపోయాక ప్రతివిద్యార్థి  ఉద్యోగాల కోసం హెదరాబాద్ కు పరుగులు పెడతారు. అలాంటి మహానగరాన్ని దూరం చేయోద్దని చెప్పినా వినకుండా ఆనాటి పాలకులు, ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి తీరని అన్యాయం చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు దొరక్క, చదువుకునే పిల్లలు కూడా సతమతమవుతున్న పరిస్థితి దాపురించిందని వాపోయారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top