పశ్చిమాన ప్రజాసంకల్పం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తాడేపల్లి గూడెం, ఉంగుటూరు, ఉండి నియోజక వర్గాల మీదగా సాగుతోంది. వివిధ వర్గాల ప్రజలు తమ గోడును ప్రతిపక్ష నేత ఎదుట చెప్పుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించక అనారోగ్యంతో సతమతం అవుతున్న కుటుంబాలు, ఫించన్లు రాక తల్లడిల్లుతున్న వారు, ఆశావర్కర్లు, ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలంతా యువనేతను కలిసి తమ సమస్యలను వెల్లడించారు. 
అవినీతిపై ధ్వజమెత్తిన జననేత
రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై బహిరంగ సభలో ప్రసంగించారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నీరుచెట్టు పేరుతో గ్రామాలను దోచేస్తున్నతీరును ఎండగట్టారు. యంత్రాలతో పనులు చేసి కూలీలు చేసారం బిల్లులు పెట్టడం, అసలు పనులే చేయకుండా బిల్లులు పెట్టి కోట్లు స్వాహా చేయడం ఈ ప్రభుత్వం చేస్తున్న పని అంటూ దుయ్యబట్టారు. గిరిజనులకు బాబు హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా వారి తరఫునే ప్రశ్నించారు యువనేత. సబ్ ప్లాన్ కేటాయింపులు, గిరిజన ఆడపిల్లల పెళ్లికి ఇస్తామన్న 50వేల రూపాయిలు, ఇల్లు, రెండెకరాల పొలం, తండాల్లో సోలార్ ప్లాంట్లు, గిరిజన విశ్వవిద్యాలయం... హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని వారు ప్రతిపక్షనేత వద్ద వాపోయారు. మైనారిటీలు, గిరిజనులు లేని క్యాబినెట్ చంద్రబాబు హయాంలోనే చూస్తున్నామంటూ మండిపడ్డారు ప్రతిపక్షనేత. అభివృద్ధిలో రాష్ట్రాన్ని తిరోగమనం పాలుచేసిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు రౌడీఇజంలో, గూండాఇజంలో, ఇసుక మట్టిలను అక్రమంగా తరలించుకోవడంలో, మహిళలను జుట్టుపట్టి ఈడ్పించడంలో శిక్షణ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. దారిపొడవునా రైతులు, కౌలు రైతుల సమస్యలను విని చలించిపోయారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా మంచీనటి సమస్య కనిపిస్తోందన్నారు వైఎస్ జగన్. పంచాయితీలు, మున్సిపల్ వాటర్ రోగాలు తెచ్చేవిగా ఉన్నాయని, రోజూ మంచినీటిని కొనుక్కుని తాగాల్సి వస్తోందని వాపోయారు ఈ ప్రాంత మహిళలు.
యువనేత హామీలు
500 జనాభా ఉన్న తండాలు, గూడేలను పంచాయితీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్షనేత. గిరిజన తండా, గూడాలలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు అందిస్తామన్నారు.  ఐటీడీఎ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పావలవడ్డీ రుణాలు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేపడతామని మాటిచ్చారు. చేపల, రొయ్యాల చెరువుల రైతులకు యూనిట్ 1.50కే కరెంటు అందిస్తామని చెప్పారు. వీటిపై ఆధారపడి నడిచే ఐస్, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల యూనిట్ ధర 7 నుంచి 5రూపాయలకు తగ్గిస్తామని కూడా ప్రకటించారు యువనేత.  సముద్రతీర ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, నాణ్యత, మార్కెట్, దళారీ వ్యవస్థపై నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రక్షిత తాగునీటి ఏర్పాట్లు చేస్తామని , కాలువల పక్కనే ఉన్న ప్రతిఊరికీ సమ్మర్ స్టోరేజీ టాంకులు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కాలువలకు నీళ్లు రాగానే ఆ ట్యాంకులు నింపించి, ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు వైఎస్ జగన్. తాడేపల్లిగూడెం, గణపవరంలో జరిగిన బహిరంగ సభల్లో అశేష జనవాహిని యువనేతకు స్వాగతం పలికింది. జగన్ ప్రతి మాటకూ యువత గొంతు కలిపింది. ఆత్మీయ సమ్మేళనంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా యువనేత ముందుంచారు. 
ఆత్మీయతకు ఆనవాలు ప్రజాసంకల్పం
ప్రతిపక్ష నేత వస్తున్న దారంతా వేలాదిగా ఎదురుచూస్తున్న జన సందోహమే. వేల మైళ్లు నడుస్తున్న ఆ యువనేతను చూసి చలించిన అక్కచెల్లెళ్లు ఎదురొచ్చి తమ చెంగుతో ఆయన స్వేదాన్ని తుడుస్తున్నారు, మంచినీళ్లు, కాఫీ అందించి సేదతీరవయ్యా అంటూ తల్లిలా ఆదరణను చూపిస్తున్నారు, మనవడిలా దగ్గరకొచ్చి పలకరించిన యువనేతకు తమ బాధలు వివరించుకుంటున్నారు అవ్వాతాతలు. దివ్యాంగులు సైతం ఆ ప్రజానాయకుని ఒక్కసారైనా కలవాలంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వైఎస్ జగన్ వచ్చి పలకరించిన వేళ కొండత ధైర్యం వచ్చిందని ఆనందంగా చెబుతున్నారు. 

 

 
Back to Top