అక్టోబర్ 7నుంచి వైఎస్ జగన్ దీక్ష..!

చంద్రబాబు అంత అహకారం పనికిరాదు..!
గుంటూరులోనే దీక్ష..!

హైదరాబాద్ః  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తేదీని పార్టీ ఖరారు చేసింది. అక్టోబర్ 7నుంచి  దీక్ష కొనసాగుతుందని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులోనే దీక్ష కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. తాము బేషజాలకు పోదలుచుకోలేదని బొత్స అన్నారు. ప్రదేశం మార్చమన్నందున  ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలు ఎంపిక చేసి పోలీసులకు చూపిస్తామన్నారు. అనుమతి ఇవ్వకపోతే  కోర్టుకు వెళ్తామన్నారు.  

ప్రజల తరుపున పోరాడుతాం..!
గుంటూరు ఏసీ కళాశాల ఉల్ఫ్ గ్రౌండ్ లో వైఎస్ జగన్ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను చంద్రబాబు పోలీసుల సహాయంతో అడ్డుకోవడంతో వాయిదా పడింది. ఈక్రమంలోనే పార్టీ నేతలు సమావేశమై సమాలోచనలు జరిపారు. అక్టోబర్ 7నుంచి వైఎస్ జగన్ దీక్ష ప్రారంభిస్తారని  బొత్స తేదీని ప్రకటించారు.ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ దీక్ష జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా, తమ వంతు బాధ్యతగా ప్రత్యేకహోదా కోసం ప్రజల తరుపున పోరాడుతామని బొత్స అన్నారు.  

చంద్రబాబు నీవన్నీ దొంగ దీక్షలేనా..!
చనిపోతామని దరఖాస్తు పెడితే అనుమతిస్తామా అంటూ చంద్రబాబు అవహేళనగా, అహంభావంతో మాట్లాడుతున్నారని బొత్స ఫైరయ్యారు. మీరు 2010లో హైదరాబాద్ లో నిరవధిక నిరాహార దీక్ష చనిపోవడానికే చేశారా..? లేక రోజూ భోజనం చేసి ప్రజలను మోసం చేసి దీక్ష చేసినట్లు చూపించారా అని ఎద్దేవా చేశారు. పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష, శాంతియుత పోరాటాల వల్లే రాష్ట్రం అవతరించిందన్న విషయం మర్చిపోవద్దని చంద్రబాబును హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబు ప్రత్యేకహోదాకు అనుకూలమా లేక వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.
Back to Top