సంకల్పానికి మొదటి అడుగు

జగనన్నరావాలి… జగనన్న కావాలీ అంటూ లక్షల గొంతులు ఒక్కటై ప్రతిధ్వనించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మొదలు కాగానే ప్రజల నుంచి వచ్చిన స్పందన అపూర్వం. ఆయన అడుగులో అడుగు కలుపుతూ, జగనన్న బాటలో అశేష ప్రజావాహిని కదిలింది. పాదయాత్రకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందని అన్నారు. 

‘చంద్రబాబులా నాకు కాసులంటే కక్కుర్తి లేదు, ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తి లేదు’ అన్నారు యువనేత. ఇది ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాధినేతకు విసిరిన సవాల్. అధికార పక్షం ఎన్నో విధాలుగా కక్షగట్టినా నిర్భయంగా ఎలా ఉన్నాడో నిజాయితీగా ఓ నాయకుడు చెప్పిన సందర్భం. ‘నాలో ఉన్న కసి ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలి. రైతుకు వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేయాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం అందిచగలగాలి. ప్రతి పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదువుకోగలగాలి. పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోగలగాలి. మద్యపానాన్ని నిర్మూలించగలగాలి. మంచి పనులతో మా నాన్నలా నేనూ ప్రతి మనిషి గుండెల్లో కలకాలం నిలిచిపోవాలి…ఇదే నా కసి’ అని చెప్పారు వైయస్ జగన్. 

వెతికి చూసినా చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టో కనిపించడం లేదన్నారు ప్రతిపక్షనేత. అది కనిపిస్తే చంద్రబాబు కాలర్ పట్టుకుని మరీ ప్రజలు హామీల గురించి అడుగుతారని మేనిఫెస్టోని మాయం చేసారన్నారు వైయస్ జగన్. చంద్రబాబులా మోసం చేయడం తనకు చేతకాదన్నారు. ప్రజల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారౌతుందని చెప్పారు. నవరత్నాలతో పాటు ప్రజలకు కావాల్సినవేమిటో పాదయాత్రలో అడిగి తెలుసుకుని వాటిని మేనిఫెస్టోలో చేరుస్తామని మాటచ్చారు. ఇది ప్రజలు తమకోసం తాము సిద్ధం చేసుకునే మేనిఫెస్టో అని చెప్పారు. ఒక్క చోట ఉప ఎన్నిక పెట్టి వందల కోట్లు ఖర్చు చేసిన బాబు ఫిరాయింపుదార్లందరి స్థానాల్లో ఒకేసారి ఎన్నికలు పెట్టి గెలిచి చూపించాలని సవాల్ చేసారు విపక్ష నేత. అప్పుడు తను దాచుకున్న వేల కోట్ల నల్లధనం బయటకు తీయాల్సి వస్తుందని… అలా చేస్తే మోడీ లాగి తంతారని భయపడే చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలు పెట్టడం లేదన్నారు. విభజనలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి. తొమ్మిదేళ్ల అనుభవం ఉంది, రాజధానిని నేనైతేనే కట్టగలను ఓట్లేయమని అడిగిన చంద్రబాబు, ఇంత వరకూ రాజధానిలో శాశ్వతంగా ఒక్క ఇటుకైనా వేసారా అని ప్రశ్నించారు వైయస్ జగన్. నాలుగేళ్లుగా నాలుగు సినిమాలు చూసి అందులోని సెట్టింగుల తరహాలో రాజధాని కడతానని కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. ఏదేశానికెళితే ఆ దేశ రాజధాని లా అమరావతిని మారుస్తానని చెబుతుంటే బాబు వాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. 180 రోజుల ప్రజాసంకల్ప యాత్రలో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు ప్రజలతో మమేకమై ప్రజలతోనే సమాధానం  చెప్పిస్తానని అన్నారు వైయస్ జగన్. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా తీసుకున్న సంకల్పానికి తొలి అడుగు పడిందంటూ ప్రజలంతా హర్షధ్వానాలు చేయడం తొలిరోజు యాత్రకు శుభపరిణామం. 

Back to Top