హోదా కోసం ఎందాకైనా..!

15ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నాడు. కొన్నాళ్లకు హోదా ఏమైనా సంజీవనా అన్నాడు. తర్వాత హోదాను కాదని ప్యాకేజీని మగబిడ్డతో పోల్చాడు. ఆనక హోదాకు మించి ప్యాకేజీ లో నిధులు వస్తాయని బాకా ఊదాడు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తున్నాడు. చంద్రబాబు విధానం జిత్తులమారి నక్కలాంటిదే. రోజుకో అబద్ధం, పూటకో నాటకంతో మూడున్నరేళ్ల పాలనలో ప్రత్యేక హోదాని అటకెక్కించేశాడు. రాష్ట్రప్రజల ఆశలన్నీ బూడిదలో పోశాడు. ఆంధ్రరాష్ట్రానికి వరప్రదాయిని లాంటి ప్రత్యేక హోదాకోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ రాజధానిలో నిరసన తెలపడం నుంచి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం దాకా, ఆమరణ నిరాహార దీక్ష నుంచి యువభేరితో ప్రజల ఆకాంక్షను ప్రతిధ్వనింపచేయడం దాకా అడుగడుగునా హోదాయే ఊపిరిగా సాగుతున్నాడు  వైయస్ జగన్.. 

ప్రత్యేక హోదా – ఆధ్రుల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యువభేరిని మోగిస్తున్నారు . రాష్ట్రవిభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని నాటి సర్కార్ నిర్ణయించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం ఉన్న కారణంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. హోదా ఇచ్చిన రాష్ట్రాలకు గ్రాంటులు 90%, రుణాలు 10% ఫార్మలాతో హోదా కలిగిన రాష్ట్రం అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుంది. రాయితీల కారణంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగి, ఉపాధి అవకాశాలు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది. కానీ, కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్న టిడిపి ఇంత అమూల్యమైన హోదాను సాధించుకోవాడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. 

ఢంకా భజాయించి చెప్పండి హోదా కావాలని…
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అది ఐదేళ్లు కాదు పదేళ్లు కాదు 15ఏళ్లు కావాలని ఊరూ వాడా ప్రచారం చేసాడు చంద్రబాబు. అధికారం చేపట్టాక అసలు హోదా మాటే ఎత్తని ముఖ్యమంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అంటూ కొత్త రాగం అందుకుంది టిడిపి. ఇది రాష్ట్రానికి తీరని అన్యాయమే అని చంద్రబాబు ద్వందవైఖరిని ఖండించారు విపక్ష నేత. ప్రజాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే యువభేరిని మోగించారు. గత మూడు సంవత్సరాల్లో ఇప్పటికి 9 సార్లు యువభేరి కార్యక్రమం నిర్వహించారు యువనేత. ప్రతి సభలోనూ అనూహ్యమైన స్పందన. ప్రతి చోటా జన నీరాజనం. రాష్ట్రానికి హోదా ఆవశ్యకతను తెలియజేసి, ప్రజలను జాగృతం చేస్తున్న ప్రియతమ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ యువత అడుగడుగునా తమ హృదయాలతో మద్దతు తెలిపింది. 
 
పదో యువభేరి పిలుస్తోంది
2015 సెప్టెంబర్ లో తిరుపతిలో జరిగింది తొలి యువ భేరి. విద్యార్థులు, కళాకారులు, మేథావులు, ఉద్యోగులు, యువత ఇలా అన్ని వర్గాలూ యువభేరిలో పాలుపంచుకున్నాయి. అఖండమైన ప్రజాసమూహం జగన్నినాదమై యువభేరిని మ్రోగించిందారోజు. అది మొదలు విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, విజయనగరం, గుంటూర్లలో ఇప్పటి వరకూ 9 యువభేరీలు జరిగాయి. ప్రతి సభా ఓ యువ జన కెరటమే. ప్రతి చోటా ప్ర్యతేక హోదా నినాదమే. హోదాను సాధించేందుకు ఎంత దూరమైనా వెళతానని యువనేత ప్రకటిస్తే, వెన్నంటే మేముంటామంటూ కోట్లాదిమంది జనులు వైయస్సార్ సిపికి మద్దతు పలికారు. ఈనెల 10న అనంతపురంలో పదొవ యువభేరి మోగనుంది. ఇది హోదాకోసం మోగే నగారా…హోదాకై నినదించే యువతకు జగనన్నే పహారా…ప్రజలకోసం ప్రజానేత చేసే ఉద్యమానికి, ప్రజలే రథ సారధులు…ప్రజలే దిశానిర్దేశకులు. 

Back to Top