ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న వైఎస్ జగన్

జగనన్న చొరవతో రైతన్న పొలంబాట..!
ప్రత్యేకహోదాపై అలుపెరగని పోరు..

వైఎస్సార్సీపీ ఆందోళనలతో భూసేకరణపై వెనక్కి తగ్గిన సర్కార్..!
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి  పేరెత్తితేనే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి.అనుక్షణం ప్రజాసమస్యలపై పోరాడుతుండడంతో చంద్రబాబుకు కంటిమీద కునుకు కరువైంది.  అధికారం ఉంది కదా అని ఏం చేసినా చెల్లుతుందన్న ధోరణితో.... రైతులపై దౌర్జన్యకాండ ప్రదర్శించిన పచ్చనేతల మెడలు వంచారు వైఎస్ జగన్.  బలవంతంగా , భయభ్రాంతులకు గురిచేస్తూ రైతుల భూములను లాక్కుంటుండడంతో  వైఎస్సార్సీపీ అన్నదాతలకు అండగా నిలిచింది.  మంగళగిరి సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి భూసేకరణపై వెనక్కి తగ్గింది.

జగనన్న చొరవతో రైతన్న పొలం బాట..!
భూసేకరణ నిలిచిపోవడంతో రైతులు మళ్లీ పొలంబాట పట్టారు. ప్రభుత్వంపై పోరాడి తమకు భూములు తమకు దక్కేలా చేసిన వైఎస్ జగన్ కు రైతన్నలు అభినందనలు తెలుపుతున్నారు. మళ్లీ మారాజన్న దిగివచ్చినట్లు ఉందని సంతోషిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పలువురు నేతలు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి సాగుపనుల్లో పాల్గొని ఊతమిచ్చారు. వైఎస్సార్సీపీ  అండతో రైతులు సాగు సంరంభానికి సిద్ధపడ్డారు. 

ప్రత్యేకహోదాపై జగన్ అలుపెరగని పోరు..చంద్రబాబు బేజారు..!
ప్రభుత్వం చేయలేని పనులను ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ చేసి చూపిస్తున్నారు. భూసేకరణ మాదిరే చంద్రబాబుకు జగన్ మరో డెడ్ లైన్ విధించారు. ప్రత్యేక హోదా సాధనం కోసం ముందుండి పోరాడుతున్న వైఎస్సార్సీపీ అధినేత మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర, దేశరాజధానిల్లో స్పెషల్ స్టేటస్ పై సమరభేరి మోగించిన జగన్ ...రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చి ప్రత్యేకహోదా ప్రాముఖ్యతను చాటిచెప్పాడు. మరోసారి అసెంబ్లీ వేదికగా ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను వివరించి ...ప్రభుత్వంపొ ఒత్తిడి తెచ్చి తీర్మానానికి ఆమోదముద్ర వేయించారు. ఆతీర్మానానికి బలం చేకూరడం కోసం  ఈనెల 15 వరకు చంద్రబాబుకు టైమిచ్చారు. ఆలోగా హోదా రాకపోతే గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో పచ్చప్రభుత్వం అంతర్మధనంలో పడిపోయింది. 
Back to Top