మహానేత సరసన జననేత

– పాదయాత్ర మైలురాయిని అందుకున్న వైయస్‌ జగన్‌
– 110 రోజుల్లో 1484 కిలోమీటర్లు పూర్తి 
– ఆరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర పూర్తి 

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మరో మైలురాయిని అందుకున్నారు. దివంగత మహానేత, తన తండ్రి గతంలో నడిచిన 1470 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. 2004 ఎన్నికలకు ముందు మహానేత చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన తండ్రి స్ఫూర్తితో గత నవంబర్‌ 6న ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. దివంగత నేత వైయస్‌ఆర్‌ సమైక్యాంధ్రలో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయగా.. నవ్యాంధ్రలో వైయస్‌ జగన్‌ ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తున్నారు. 

జననేతలో రాజన్నను చూస్తున్న ప్రజలు 

వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేస్తానని ప్రకటించడంతో రాయలసీమ ప్రజల్లో సంతోషం వ్యక్తం అయ్యింది. దాంతోపాటు అటు పాదయాత్రను తన తండ్రి ముగించిన ఇచ్ఛాపురంలోనే ముగిస్తానని చెప్పడంతో అక్కడి ప్రజల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. గతంలో మహానేత చేసిన పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో జరగలేదు. చరిత్రను తిరగరాసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన అలాంటి పాదయాత్ర రాయలసీమలో జరగలేదనే దిగులు రాయలసీమ వాసుల్లో ఉండేది. కానీ వైయస్‌ జగన్‌ వారి ఆశలను ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా తీర్చారు. రాయలసీమ నుంచే పాదయాత్ర మొదలు పెట్టి నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. దాదాపు 950 కిమీలకు పైగానే పాదయాత్రను పూర్తి చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేయాలని నిర్ణయించిన పాదయాత్ర ఇప్పటికే ఆరు జిల్లాలో పూర్తియ్యింది. నాలుగు నెలలకు పైగా 110 రోజులు జరిగిన పాదయాత్రలో 1484 కిలోమీటర్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పర్యటన చేయాలని నిర్ణయించారు. 

Back to Top