రాజ‌ధాని రైతుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ భ‌రోసా

గత మూడేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న లక్షల కోట్ల రూపాయల అవినీతి పై ఎవరు ప్రశ్నించినా వారిని అభివృద్ధి నిరోధకులుగా,ఉన్మాదులుగా బురద చల్లడాన్నే తమ అస్త్రంగా చేసుకున్న టీడీపీ మరొకసారి ఇదే ప్రయత్నాలను ప్రారంభించింది. రాజధానిలోని రైతులు తమ భూములు ఇవ్వమని గగ్గోలుపెడుతున్నప్పటికీ వారి ఆవేదనను ఏమాత్రం ఖాతరుచేయకుండా మరొకసారి భూములివ్వని రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

అద్భుతమైన రాజధానిని కట్టుకునేందుకు 5000 ఎకరాల భూమి సరిపోతుంద‌ని  శివరామ కృష్ణన్ కమిటీ తమ నివేదికలో చెప్పినప్పటికీ పట్టించుకోకుండా కమిటీ రిపోర్టును చంద్ర‌బాబు చెత్త‌బుట్ట‌లో వేశారు. తనకు, తన బినామీలకు మాత్రమే రాజధాని ద్వారా లబ్ది చేకూరేలా ప్లాన్ చేసి అమ‌రావ‌తి ప్రాంతంలో రైతుల వేల ఎక‌రాల భూమిని లాక్కున్నారు.  పేద రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేని ప్రభుత్వం 15,000 ఎకరాల ప్రభుత్వ,అటవీ భూములు సేకరించిన తరువాత కూడా అవి చాలవన్నట్టు పేద రైతులకు చెందిన 33000 ఎకరాల భూమిని బ‌ల‌వంతంగా లాక్కుంది. రాజధాని ఎక్కడ రాబోతుందన్న ప్రకటన రాకముందు తన అనుకూల మీడియా ద్వారా నూజివీడు,నాగార్జున యూనివర్సిటీ,  తెనాలి ప్రాంతాల్లో రాజధాని రాబోతోందని ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆ ప్రాంతాల వైపు టీడీపీ డైవర్ట్ చేసింది.

       తన బినామీలైన నారాయణ, ప్ర‌త్తిపాటి, ధూళిపాళ్ల, పయ్యావుల, సుజనా చౌదరి, మురళీ మోహన్ ఇతర వ్యాపార వేత్తలకు మాత్రం రాజధాని ఎక్కడ రాబోతుందన్న సమాచారమిచ్చి వారిచేత అమరావతి ,రాజధాని ప్రాంతంలో  అమాయక పేద రైతులకు చెందిన వేల ఎకరాల భూమిని చంద్రబాబు కొనుగోలు చేయించారు. రాజధానిని ప్రకటించిన వెంటనే రైతులభూములను మాత్రమే ల్యాండ్ పూలింగ్ ద్వారా లాక్కొని తన బినామీల భూములను మాత్రం ల్యాండ్ పూలింగ్, సీఆర్‌డీఏ పరిధి నుండి తప్పించారు. ఈ మొత్తం వ్యవహారంలో పేద రైతులు భూములను కోల్పోగా, నారాయణ, సుజనా చౌదరి, మురళీ మోహన్ లాంటి బాబు బినామీలు మాత్రం రాజధాని ద్వారా వేలకోట్లకు పడగలెత్తారు. 

ఈ దోపిడీని తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా క్షేత్రంలో అనేక పోరాటాలు చేస్తూ పేద రైతుల పక్షాన నిలుస్తోంది.  ప్రభుత్వం అక్రమంగా బనాయించే కేసులను ఏ మాత్రంలేక్క చేయకుండా మంగళగిరి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి డి రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపిస్తున్నారు . మంగళవారం నాడు రాజధాని ప్రాంతమైన ఉండవల్లి గ్రామంలో భూములివ్వని రైతులతో సీఆర్‌డీఏ  అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో మరొకసారి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రైతుల పక్షాన నిలిచారు. సమావేశానికి సంబంధించిన వివరాలను, రైతుల అభ్యర్థ‌న‌ను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలంటూ అధికారులను పట్టుబట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థ‌నను పట్టించుకోని సీఆర్‌డీఏ అధికారులు అందుకు అంగీకరించలేదు. ప‌థ‌కం ప్రకారం రైతులపై ,వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే పై  అధికారులు పోలీసులను ఉసిగొల్పి వారిని రెచ్చగొట్టారు. సాయంత్రానికి సమీప తాడేపల్లి  పోలీస్ స్టేషన్లో బలవంతపు భూసేకరణకు అంగీకరించని రైతుల పై,ఎమ్మెల్యే ఆర్కే పై అక్రమ కేసులను బనాయించారు.

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజధాని ప్రాంతాలైన నిడమర్రు,పెనుమాక,ఉండవల్లి ఇతర గ్రామాల్లో ఇప్పటికే పలుమార్లు పర్యటనలు చేసి అక్కడి రైతులకు అండగా నిలిచారు, అసెంబ్లీలో అనేకసార్లు రాజధాని రైతుల వాణిని వినిపించారు, ప్రధానమంత్రికి సైతం రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా కలిసి వివరించారు. ప్రతిపక్షం ప్రజలకోసమే పోరాడుతుందని, ప్రజల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటూ రాజధాని రైతులకు భరోసాను కలుగజేశారు.
Back to Top