వైఎస్ జగన్ పవర్ ఫుల్ డిమాండ్స్...!


ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడుకి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీ వ్యవహారంలో
చంద్రబాబు అనుసరిస్తున్న వ్యవహార శైలిని ఆయన తూర్పార బట్టారు. ఈ లేఖ ద్వారా ఆయన ఈ
డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.

1.      
కాల్ మనీ బాగోతం అంతా
ముఖ్యమంత్రి చంద్రబాబు అండ చూసుకొని సాగించిన రాక్షస కాండ కాబట్టి, ఆయనే బాధ్యత
వహించాలి.

2.      
 ఈ రాక్షస కాండలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ,
ఎమ్మెల్యే .. మంత్రి అయినా చట్టం ముందు నిలపాలి. ఘోరాతి ఘోరమైన నేరాలకు పాల్పడిన
టీడీపీ నేతల్ని పక్కకు తప్పించే క్రమంలో మిగతా పార్టీల మీద దొంగ కేసులు పెట్టాలనే
ఆలోచనలు మానుకోవాలి.

3.      
బాధితులకు భరోసా, రక్షణ
కల్పించటంతో పాటుగా భయభ్రాంతులకు గురిచేసే కౌటిల్యాన్నికట్టిపెట్టండి.

4.      
కాల్ మనీ బాగోతంలో
పోగొట్టుకొన్న ప్రతీ పైసాను బాధితులకు తిరిగి ఇప్పించాలి.

5.      
కాల్ మనీ రాకెట్ తో టీడీపీ
ఎమ్మెల్యేలు, మంత్రులకు ఉన్న అనుబంధాలు, ఆర్థిక సంబంధాల్ని బట్ట బయలు చేయాలి.

6.      
హైకోర్టుని ఒప్పించి,
మొత్తం వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా నేరుగా న్యాయస్థానం
ఆధ్వర్యంలో విచారణ జరిగేలా ఎంక్వయిరీ చేయించాలి.

ఈ డిమాండ్లను ప్రభుత్వం
ఎదుట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన బహిరంగ లేఖ ద్వారా వ్యక్త పరిచారు. 

Back to Top