జనం కోసం.. జలం కోసం.. జన నేత దీక్ష

()  ప్రజల ప్రయోజనాలే పరమావధిగా..

() కనీస అవసరాల కోసం

() కర్నూలు వేదికగా వైఎస్ జగన్ దీక్ష

హైదరాబాద్) "మనుషులు ఎక్కడ ఉన్నా ఒకటే. నదికి ఈవల ప్రాంతంలో నివసిస్తున్నా, ఆవల
ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల అవసరాలు ఒకటే. దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజల కనీస
అవసరాలు గుర్తించాలి. ప్రజల అవసరాల కోసమే ఈ దీక్ష"  అని ప్రకటించారు
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు 
వైఎస్ జగన్. కర్నూలు లో మేనెల 16 నుంచి 18 దాకా తలపెట్టిన నిరాహార దీక్ష
ఉద్దేశ్యాలను ఆయనే స్వయంగా రెండు ముక్కల్లో చెప్పారు. ఇది జనం కోసం.. జనం గొంతు
తడిపే జలం కోసం.. చేస్తున్న దీక్ష.

వాస్తవాలు ఇవి

ఆంధ్రప్రదేశ్ రెండు గా విడిపోయాక ఎగువన ఉన్న తెలంగాణ తమ ప్రాంత ప్రయోజనాల మీద
ద్రష్టి పెట్టింది. ఎగువ ప్రాంతం కావటంతో నీళ్లను ఎక్కువగా దక్కించుకొనేందుకు
పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. మరో వైపు డిండి
ద్వారా నీటిని తోడుకొనేందుకు రంగం సిద్ధం చేసుకొంది. దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు,
కర్నాటక, మహారాష్ట్ర, ఆ పై తెలంగాణ రాష్ట్రాలు నీటిని తోడుకొన్నాక మాత్రమే నీరు
వచ్చే పరిస్థితి. దీంతో నీరు రావటం కనా కష్టం అవుతోంది. పైగా పట్టి సీమ పుణ్యమా
అని ఎగువ రాష్ట్రాలకు అధికంగా నీటిని నిలుపుకొనే హక్కును ఇచ్చినట్లయింది. దీంతో
శ్రీశైలం కు వచ్చే నీటి ప్రవాహం అంతకంతకూ తగ్గిపోతోంది. దీంతో రాయలసీమ, నెల్లూరు
జిల్లాలకు నీరందటం కష్టంగా మారింది. శ్రీశైలం నుంచి దిగువకు మరీ తక్కువ నీరు
వదులుతుండటంతో నాగార్జున సాగర్ కు చాలా తక్కువ నీరు చేరుతోంది. ఫలితంగా గుంటూరు,
ప్రకాశం.. అటు తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీటి సరఫరా క్షీణించిపోయింది.
ఒక వేళ పాలమూరు.. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి పూర్తయితే ఈ  జిల్లాలకు
నీటి కష్టాలు అనేక రెట్లు పెరుగుతాయి.

చంద్రబాబు నిర్వాకం

ఈ కష్టాల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా మేల్కొనాలి. కానీ ఓటుకి
కోట్లు కేసులో పూర్తిగా దొరికిపోయిన చంద్రబాబు టీ ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు
మాట అనటం లేదు. ఎక్కడ మాట అంటే కేసును తిరగతోడి జైలుకి పంపుతారేమో అన్న భయంతో
మాట్లాడటం లేదు. పైగా మ్యాటర్ ను పక్కదారి పట్టించేందుకు పట్టీసీమ అంటూ పనికి
మాలిన పథకాన్ని తీసుకొచ్చి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. దీంతో ఒక్క చుక్క
నీరు రాయలసీమ కు ఇప్పుడు కాదు కదా అనేక శతాబ్దాల తర్వాత కూడా రానే రాదు. కేవలం
ఓటుకి కోట్లు కేసు నుంచి గట్టెక్కడానికి రాష్ట్రం ప్రయోజనాల్ని చంద్రబాబు టీ ఆర్
ఎస్ ప్రభుత్వానికి అమ్మేస్తున్నారు.

జన నేత వైఎస్ జగన్ పోరాటం

రాష్ట్ర ప్రజలకు రానున్న జల గండం గురించి బాధ్యత గల ప్రతిపక్షంగా
వైఎస్సార్సీపీ మేలుకొంది. పాలమూరు..రంగారెడ్డి వంటి పథకాల్ని నిలిపివేయించాలని
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. అంతే కాదు, దీని
మీద బహిరంగంగా విన్నవించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ప్రజల తరపున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మే 16 నుంచి 18 దాకా నిరాహార దీక్షకు
దిగాలని నిర్ణయించుకొన్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి అంతా దీనికి మద్దతు
ఇవ్వాలని ఆయన విజ్నప్తి చేశారు. ఇందులో తన వాదన తప్పు ఉంటే దిద్దుకొంటానని, లేదంటే
తమ ప్రాంతానికి వచ్చి తమ బతుకులు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ఆయన కోరారు. రైతుల
అవసరాల్ని గుర్తించాలని ఆయన విన్నవించారు. ప్రజల తరపున..ప్రజల అవసరాల కోసం ..
ప్రజల పార్టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఇది. 

Back to Top