జ‌నం కోసం.. జ‌లం కోసం.. వైయ‌స్ జ‌గ‌న్ జ‌ల‌దీక్ష‌

() ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చే దిశ‌గా ఉద్య‌మం
() సాగు, తాగు నీటి అవ‌స‌రాలు కాపాడాల‌ని డిమాండ్‌
() పాల‌కుల క‌ళ్లు తెరిపించ‌ట‌మే ల‌క్ష్యంగా దీక్ష‌

హైద‌రాబాద్) ఎగువ ప్రాంతాల్లో పాల‌కులు స్థానిక ప‌రిస్థితుల పేరుతో పోటీపడి ప్రాజెక్టులు, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ముఖ్యంగా క్రిష్ణా న‌ది మీద ఎగువ ప్రాంతాల్లో తెలంగాణ‌, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర లు నిర్మాణాలు చేస్తున్నాయి.   ఇటీవ‌ల చేపట్టిన పాల‌మూరు..రంగారెడ్డి, డిండి సాగునీటి పథ‌కాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం వేగంగా స‌న్నాహాలు చేస్తోంది. ఈ ప‌నులు పూర్త‌యితే  దిగువ ప్రాంతాలైన రాయ‌ల‌సీమ‌, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌తో పాటు తెలంగాణ లోని న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల‌కు నీరు క‌ర‌వు అవుతుంది. సాగునీరే కాకుండా తాగునీటికి కూడా క‌ట‌క‌ట ఏర్ప‌డుతుంది.

దీన్ని గ‌మ‌నించి అడ్డుకోవాల్సిన బాధ్య‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మీద ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 7,8 జిల్లాలు ఎండిపోయే ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు వేగంగా స్పందించాలి. కానీ, ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేదు. ప్ర‌శ్నిస్తే ఎక్క‌డ కేసుని తిర‌గతోడ‌తారో అన్న భ‌యం వేధిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల్ని గాలికి వ‌దిలేసి చోద్యం చూస్తున్నారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప‌చ్చ మీడియాలో గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్ర‌దర్శిస్తున్నారు. 

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న మోసాన్ని గ్ర‌హించి బాధ్య‌త గ‌ల ప్ర‌తిప‌క్షంగా వైయ‌స్సార్సీపీ ఉద్య‌మిస్తోంది. ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌శ్నిస్తోంది. ఈ ప్రాజెక్టులు, ప‌థ‌కాల్ని నిలిపివేయాల‌ని కోరుతూ కేంద్రాన్ని అభ్య‌ర్థించింది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించింది. పాల‌కుల‌కు బాధ్య‌త‌ను గుర్తు చేసేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ జ‌ల దీక్ష కు స‌న్న‌ద్ధం అవుతున్నారు. క‌ర్నూలు వేదిక‌గా ఈ నెల 16, 17, 18 తేదీల్లో జ‌ల దీక్ష చేస్తున్నారు. ఇందుకు సంఘీభావంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఈనెల 17న మండ‌ల కేంద్రాల్లో ఆందోళ‌న‌లు చేపట్ట‌నున్నారు. 

To read this article in English: http://bit.ly/1OngL4B

Back to Top