ఎవరి ఆస్తులు వేలం వేయాలి..?


– హెరిటేజ్‌ షేరు ధర   అమాంతం ఎందుకు పెరిగింది
– ౖహె దరాబాద్‌లో కట్టిన ఇళ్లు బాబు కష్టార్జితమా
– మీడియాను పిలిచి చూపించే ధైర్యం ఉందా
– రహస్య గృహ ప్రవేశం ఎందుకు చేశారు
– అక్రమాస్తులు కాకుంటే ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పలేదు 


తన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తననో మేధావిగా ప్రచారం చేసుకుంటాడు. అనుభవం గురించి మాట్లాడి దార్శనికుడిలా ప్రచారం పొందాలని ఆరాటపడతాడు. కానీ చేతల్లోకి వచ్చేసరికి మాత్రం ఏమీ తెలియని అజ్ఞానిలా ప్రవర్తిస్తాడు. ఇదంతా ఎవరి గురించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశానంటాడు, మూడు సార్లు ముఖ్యమంత్రినని చెప్పుకుంటాడు.. నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని డప్పేసుకుంటాడు. కానీ ఏం మాట్లాడాలో తెలీదు. నాలుగేళ్లుగా అధికారంలో కొనసాగుతూ ప్రజలకు చేసిందేం లేకపోయినా.. అసత్య ప్రచారంతో జనాన్ని మోసం చేస్తున్నారు. అగ్రి గోల్డ్‌ బాధితుల కష్టాలు తీర్చకపోగా.. వారి పక్షాన పోరాడుతున్న వైయస్‌ జగన్‌ కష్టాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క  అగ్రిగోల్డ్‌ ఆస్తులు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ... ఢిల్లీ వెళ్లి అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో రహస్య చర్చలు జరుపుతూ ఆ కళంకాన్ని పోగొట్టుకునేందుకు జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులంతా న్యాయం చేయమని పోరాడుతుంటే.. ఆయన మాత్రం అందులోకి జగన్‌ను ఎలా లాగుదామా.. సమస్యను ఎలా పక్కదారి పట్టించాలా అనేలా వ్యవహరిస్తున్నారు. జగన్‌ ఆస్తులు వేలం వేస్తే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవచ్చు అనే మాటలు అన్న చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడు తనాన్ని, కోర్టుల మీద విశ్వాసం లేని వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తున్నాయి.. వైయస్‌ జగన్‌ కోర్టులకు హాజరవుతూనే ఉన్నారు.. దాదాపు చాలా కేసులు కక్ష పూరితంగా పెట్టినవేనని నిరూపణ కూడా అయ్యింది. ఆయా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం తనపై వస్తున్న ఏ ఒక్క ఆరోపణలకూ సమాధానం చెప్పరు... కోర్టులకెక్కి నిర్దోషినని ప్రూవ్‌ చేసుకోరు సరికదా తనపై ఎవరన్నా కేసులు పెడితే.. విచారణకు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ స్టేలు తెచ్చుకుంటారు. జగన్‌ ఆస్తుల నుంచి గురించి మాట్లాడిన చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమాంతం పెరిగిన హెరిటేజ్‌ షేర్ల గురించి సమాధానం చెప్పరు సరికదా.. నోట్ల రద్దు ప్రకటించిన కొద్ది రోజుల మందే హెరిటేజ్‌ షేర్లు ఫ్యూచర్‌ గ్రూపునకు అమ్ముకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా ఆయన వెనక్కి తగ్గలేదు.. సమాధానం కూడా చెప్పుకోలేదు. మజ్జిగ పథకం పేరుతో జిల్లాకి కోటి రూపాయల వంతున రూ. 13 కోట్లు ధారాదత్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాతే పాత ఇంటిని పడగొట్టి హైదరాబాద్‌లో ఇంద్ర భవనం నిర్మించుకున్న చంద్రబాబు.. తన డాబురికం ఎక్కడ బయటపడుతుందోనని రహస్యంగా గృహ ప్రవేశం చేసిన విషయం అందరికీ గుర్తే. చేతికి వాచీ లేదు.., వేలికి ఉంగరం లేదు.., జేబులో చిల్లి గవ్వ చిల్లర లేదని చెప్పుకునే చంద్రబాబు వెయ్యి కోట్లు ఖర్చు చేసి అంత భారీ ఇంటిని ఎలా కట్టాడని ప్రశ్నించినా... మీడియాను ఆహ్వానించి ఆరోపణల్లో నిజం లేదని తేల్చేసే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. గతంలోనూ ఓ ఇంగ్లిషు పత్రికలో వచ్చిన ఓ పెయిడ్‌ కథనం ఆధారంగా వార్తలు రాసిన పచ్చ మీడియా, లక్ష కోట్లు ఆరోపణలు చేస్తున్న టీడీపీకి జగన్‌ ధీటైన సవాల్‌ విసిరారు. తన కు అక్రమాస్తులున్నట్టు నిరూపిస్తే అందులో పది శాతం వాటా  ఇచ్చి మొత్తం మీరే తీసుకోవచ్చని.. వారి ఆరోపణలు నిజమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా స్పష్టం చేశారు. అయితే దానిపై స్పందించిన చంద్రబాబు తాను నిరూపించలేనని చేతులెత్తేశారు. ఇదీ ఆయన క్రెడిబిలిటీ. ఎదుటి వారి మీద బురద జల్లి కడుక్కోమని చెప్పడమే తప్ప.. నిరూపించే సత్తా లేని నాయకుడు చంద్రబాబు. 
Back to Top