రౌడీ రాజ్యం

  • అధికారులపై కొనసాగుతున్న పచ్చపార్టీ నేతల దాడులు
  • మొన్న వనజాక్షి..నిన్న నారాయణమ్మ..నేడు ఆంజనేయులు
  • వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైనా దాడులు
  • టీడీపీ నేతల బెదిరింపులకు తలగ్గొని వారిని హతమారుస్తున్న వైనం
  • అధినేత అండతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈసారి అయినా తన తప్పులు తెలుసుకుని మంచి పాలన అందిస్తారనుకున్నారంతా. అయితే అధికారంలోకి వచ్చీ రాగానే తాము ఏమీ మారలేదని నిరూపించుకుంటున్నారు చంద్రబాబు అండ్‌ కో. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ  లక్షల కోట్లు దోచుకుంటున్నారు. ఏ ప్రజలకైతే అది చేస్తాం.. ఇది చేస్తామని ఎన్నికల ముందు  హామీలు ఇచ్చారో ఇప్పుడు  అదే ప్రజలపై పడి వారి ఆస్థులను లాక్కుంటున్నారు. సహజ వనరులను సైతం వదలకుండా స్వాహా చేస్తున్నారు. తెలుగుతమ్ముళ్ల దోపిడీని అడ్డుకుంటున్న అధికారులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. ప్రస్తుత పాలనను చూస్తుంటే రౌడీ రాజ్యాన్ని తలపిస్తోంది. 

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క రోజుకూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారి సమస్యలు పరిష్కరించలేదు. ప్రజలకు ఏమీ చేయకపోగా వారి ఆస్థులను లాక్కుంటూ వారి బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారు. చంద్రబాబు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బాబుకు తోడుగా ఇప్పుడు ఆయన శాసనసభ్యులు తయారయ్యారు. ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది అందిన కాడికి దోచుకుంటున్నారు.  

అధికార బలంతో రెచ్చిపోతున్న తమ్ముళ్లు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చూస్తా ఉంటే వీళ్లు ప్రజా ప్రతినిధులేనా అనే అనుమానం కలుగుతోంది. సభ్యసమాజం తలదించుకునేలా వాళ్లు వ్యవహరిస్తున్న తీరును చూస్తాఉంటే అసహ్యమేస్తోంది. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ ఇవ్వలేని మహిళలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. అంతేకాదు అధికార పార్టీ అండదండలతో  విజయవాడ నడిబొడ్డున కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేసిన కొంతమంది మహిళలు, స్థానికులపై టీడీపీ నాయకులు దాడులు కూడా  చేశారు. ఇళ్లల్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే  పచ్చపార్టీ నేతల ఆగడాలు చాలానే ఉన్నాయి. 

అధికారులపైనా దాడులు
ఇసుక దగ్గరి నుంచి పేదల భూముల వరకు. మట్టి నుంచి మద్యం వరకు అన్నింటినీలోనూ తెలుగు తమ్ముళ్లు జోక్యం చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. అక్రమంగా ఇసుకను వేరే రాష్ట్రాలకు తరలిస్తూ వేల కోట్లు దోచుకుంటున్న టీడీపీ నేతల బండారాన్ని బయట పెట్టిన అధికారులపై దాడులు చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ స్థలాలను, చెరువులను కబ్జా చేస్తున్నారు. అవి ప్రభుత్వ స్థలాలని అడ్డుకుంటున్న తహిశీల్దార్‌లపై భౌతిక దాడులకు దిగుతున్నారు. మొన్న అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న  అధికారిణి వనజాక్షిని, నిన్న చెరువును కబ్జా చేస్తున్నారని అడ్డుకున్న తహశీల్దార్‌ నారాయణమ్మను.. నేడు అక్రమ రికార్డులను అడ్డుకున్నందుకు తహశీల్దార్‌ ఆంజనేయులపై దాడులు చేసి వారిని భయపెట్టారు. మా జోలికి వస్తారా? ఖబద్దార్‌ అంటూహెచ్చరించారు. మమ్మల్ని అడ్డుకుంటే మీ అంతు చూస్తామంటూ భయపెట్టారు. టీడీపీ నాయకులు ఇన్ని అరాచకాలు చేస్తున్నా పోలీసులు చోద్యంచూస్తున్నారే తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

అడ్డు వస్తే హత్యలే...
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలకు అడ్డుపడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడులు చేస్తున్నారు. అంతేకాదు అడ్డు వస్తే హత్యలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి  వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో  10 హత్యలకు పైగా జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత బాబుపాలన చూస్తుంటే రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 
Back to Top