పచ్చ పార్టీ పిచ్చి పైత్యం

‍‍–విశాఖలో పచ్చ రాబంధుల భూ కబ్జా
– ఎదుటి వారిమీద బురద జల్లడంలోనే ఆరితేరిన బాబు
– బాబు డైరెక్షన్‌లో అసత్య ప్రచారంలో రెచ్చిపోతున్న తమ్ముళ్లు 
– తాను సేఫ్‌ జోన్‌లో ఉండటానికి ఇతరులపై విమర్శలు 

సరిగ్గా మూడేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చేసిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. కాకపోతే ఒకటే తేడా అప్పుడు వారు ఆరోపణలు చేసింది వైయస్‌ జగన్‌ మీదనైతే.. అదే ఆరోపణలు నిజం చేసుకుంది మాత్రం టీడీపీ. వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైయస్‌ఆర్‌సీపీ గెలిచి అధికారంలోకి వస్తే విశాఖను అమ్మేస్తాడు. నగరంలో దౌర్జన్యాలు పెరిగిపోతాయి, రౌడీయిజం రాజ్యమేలుతుందని బాబు గోబెల్స్‌ ప్రచారం చేశాడు. అక్కడ వైయస్ విజయమ్మను ఓడించడానికి చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు అన్నీ ఇన్నీ కావు.  ఇక అక్కడ్నుంచే మొదలైంది అసలు కథ. ఏ ఆరోపణలైతే వైయస్‌ఆర్‌సీపీ మీద చేశారో.. అధికారంలోకి వచ్చాక అవన్నీ వారే చేయడం మొదలెట్టారు. విశాఖలో భూముల దోపిడీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచనం సృష్టిస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు అనే తేడా లేకుండా దొరికినకాడికి దోచేసుకుంటున్నారు. 

చంద్రబాబుకి అలవాటే...
తనపై ఏవైనా ఆరోపణలు వస్తాయనుకున్నప్పుడు.. తన అవినీతి బయట పడుతుందని గ్రహించినప్పుడు చంద్రబాబు చేసే మొదటి పని దాన్ని తెలివిగా ఎదుట వారిమీదకు మళ్లించేయడం. గుడ్డ కాల్చి మీదేసినట్టుగా.. తాను మంటల్లో కాలిపోతానని తెలిసినప్పుడు చంద్రబాబు చాలా వేగంగా పావులు కదుపుతారు. తనపై ఆరోపణలు వస్తాయని తెలిసిన వెంటనే.. వాటిని ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మరీ పక్కవాళ్ల మీదకు నెట్టేయడం బాబుకు మొదట్నుంచీ అలవాటే. ఆయన వెనకే బాబు భక్త జన మండలి ఉండనే ఉంటుంది. బాబు ఇదిగో పులి అంటే.. భక్త తమ్ముళ్లు అదిగో తోక అని ఇళ్లిల్లూ తిరిగి మరీ ప్రచారం చేస్తారు. ఇది బాబు స్ట్రాటజీ. బాబు చేసే ఆరోపణల వెనుక ఎక్కడా ఆధారాలుండవు. ఒకటే ఎజెండా తన పాపులారిటీ పెంచుకోవాలి. ఎదుటివారిని ఏదో విధంగా బద్నాం చేసి అవినీతి పరుడిగా ముద్ర వేయాలి. పోటీ లేకుండా చేసుకోవాలి. 

– కేంద్ర ప్రభుత్వం ఐడీఎస్‌– 2016 అనే స్కీం పెట్టింది. ఇన్‌కం ట్యాక్స్‌ డిక్లరేషన్‌ స్కీం దాని పేరు. ఎవరైతే బ్లాక్‌ మనీ ఎక్కువ కలిగి ఉన్నారో దాన్ని గవర్నమెంట్‌కి అప్పగిస్తే అందులో 50 శాతం మాత్రం తీసుకుని మిగతాది ఇచ్చేస్తారు. అలా సంపద వెల్లడించిన వారి వివరాలు ఎక్కడా బయటకు చెప్పరు. కానీ చంద్రబాబు మాత్రం జగన్‌ పది వేల కోట్లు అక్రమ ఆస్తులు ప్రకటించారని.. నాకు కొందరు కేంద్రంలో తెలిసిన ప్రముఖుల ద్వారా ఆ విషయం తెలిసిందని  ఏపీకొచ్చి డప్పేశాడు. మర్నాడే భక్త తమ్ముళ్లు ఊరూరూ తిరిగి.. గడగడపకూ ఎక్కి కూసేశారు. దీనిపై వైయస్‌ జగన్‌ స్పందించి వివరాలను బయట పెట్టాలని ఏకంగా ప్రధానికే లేఖ రాయడంతోపాటు బాబు అసత్య ప్రచారాన్ని నిగ్గు తేల్చాలని చెప్పడంతో బాబు సహా టీడీపీ నాయకులంతా తెల్లమొహాలు వేశారు. ఆ తర్వాత కాలంలో ఐడీఎస్‌ స్కీం కింద పది వేల కోట్లు వెల్లడించడం కూడా పబ్లిసిటీ స్టంట్‌ అని తేలిపోయింది. 

– 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖలో కూడా బాబు ఇలాగే ప్రచారం చేశాడు. జగన్‌ గెలిస్తే రౌడీరాజ్యం వస్తుందని అందర్నీ బెదిరించాడు. భూములు లాక్కుంటారని ప్రజలను భయపెట్టారు. చివరకు ఇప్పుడా పనులన్నీ చంద్రబాబు అండ్‌ కో ఇష్టారాజ్యంగా చేసేస్తున్నారు. టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మించిన భూమి కూడా అక్రమ స్థలంలోనే నిర్మించింది కావడం ఓపెన్‌ సీక్రెట్‌. 

– తాజాగా మొన్న గుంటూరులో రాహుల్‌ గాంధీ నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభకు వైయస్‌ నిధులు సమకూర్చారని ప్రచారం తలకెత్తుకున్నారు తెలుగు తమ్ముళ్లు. దాదాపు నిర్వీర్యం అయి ఉన్న కాంగ్రెస్‌ను మేల్కొల్పే అవసరం వైయస్‌ జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. పైగా వైయస్‌ఆర్‌సీపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రేపు అధికారంలోకి రాబోతున్న పార్టీ కూడ.   

తాజా వీడియోలు

Back to Top