అధినేత తీరుతో తమ్ముళ్ల అవాక్కు

  • – చేసిందంతా చేసి ఎమ్మెల్యేలపై బాబు చిందులు
  • – బెదిరింపులు చూసి అవాక్కయిన పచ్చ నేతలు
  • – ఆయన చేసినదానికి మేమెలా బాధ్యులమని అయోమయం
  • – సంక్షే పథకాలు ఆపింది, హామీలు అమల్లో విఫలమైంది బాబే
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరు సరిగాలేదు.. మార్చుకోవాలి. మీ వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది’’. 21 నియోజకవర్గాల్లో సమన్వకర్తలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించాను, ప్రజలు మన మీద అసంతృప్తితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మీరే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటామనే ఆశలు పెట్టుకోవద్దు.. టికెట్‌ మీకే వస్తుందని చెప్పలేను... పార్టీ సభ్యత్వ నమోదు గడువును మరో పదిరోజులు పెంచుతున్నాం. ప్రతి నియోజకవర్గంలోని 15 శాతం మంది.. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో కనీసం పదిశాతం మంది పార్టీ సభ్యత్వం తీసుకోవాలి’’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలంలోని సీఎం కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం, పార్టీ సమన్వయ కమిటీ భేటీలో ఆయన చేసిన దిశానిర్దేశం. దీన్ని బట్టి ఏమనుకోవాలి. చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారనేగా. మరి స్టేజిలెక్కి ఆయన చెప్పే మాటలు మాత్రం పూర్తి విరుద్ధం. ప్రజలంతా ఆయన్ను మరో పదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారట.. ఆయన పాలన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందట. భజన బృందాలేమైనా తక్కువ తిన్నాయా అంటే అదీ లేదు. చంద్రబాబు అదిగో పులి అంటే.. భజన బృందాలు ఇదిగో తోక అంటున్నాయి. అసలక్కడ ఉంది పులో తెలీదు.. పందో తెలియదు. అసలు వీళ్లకు అవసరం కూడా లేదు. గంగిరెద్దుల్లా తలూపడం తప్ప. 

రెండున్నరేళ్లలో ఏం చేశారు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికే రెండున్నరేళ్లకు పైగా గడిచిపోయింది. ఇప్పటికి చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటి కూడా జరిగింది లేదు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు కూడా కత్తెర పడ్డాయి. ఎన్నికల హామీలుగా పేర్కొన్న రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ అంతంతే. వైయస్‌ జగన్‌ మాట్లాడితే తప్ప రుణమాఫీ సంగతి గుర్తుకు రాదు. ఆయన ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తే తప్ప రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రకటన చేయరు. రైతు యాత్రలు చేస్తే తప్ప విడల వారీగా రుణాల మాఫీ జరగదు. డ్వాక్రా మహిళల సంగతి సరేసరి. అప్పుడు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి.. మొన్ననేమో పదివేలు వరకు మాఫీ అన్నాడు. నిన్ననేమో మాఫీ కూడా జరిగిపోయిందన్నాడు. ఇదంతా చూసిన అక్కచెల్లెమ్మలు తెలిసినోళ్లకల్లా ఫోన్‌లకు రీచార్జ్‌లు చేయించుకుని మరీ ఆరా తీస్తిరి మీకేమైనా మాఫీ అయ్యిందా అని. ప్చ్‌.. ఎవరూ కాలేదని చెబుతుంటిరి. ఇప్పుడు మరో హామీ సెల్‌ఫోన్లు ఇస్తాడంట. అందులోనే బిల్లులు చెల్లించాలంట. 149 లకే ఇంటర్నెట్‌ ఇస్తాడంట. సిగ్నల్‌ లేకుండా ఫోన్‌లు ఎక్కడ పెట్టుకోవాలి. ఇంగ్లిషు రాకుండా.. దగ్గర్లో బ్కాంకులు బ్యాంకు అకౌంట్‌లు లేకుండా బిల్లులు ఎలా కట్టాలి. బతకడానికి పనులు లేకుండా తిండి తినేదెలా. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడాయె. ఒక్కరికి వచ్చిన పాపాన పోలేదు. ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్‌ చూసుకుంటే కడుపు నిండుతదా చెప్పడే. నిరుద్యోగ భృతి లేదు.. ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు... ఉన్న ఉద్యోగాలకే రక్షణ లేకుండా పోయింది. గవర్నమెంట్‌ అధికారులను క్షణం తీరిక లేకుండా దేశమంతా తిప్పుతున్నాడు. కలెక్టర్‌ నుంచి అంగన్‌వాడీల వరకు ఎవరికీ తీరిక లేదు. వీడియో కాన్ఫరెన్సులని చెప్పి రక్తం తాగేస్తున్నాడు. 

భూకేటాయింపులు తప్ప చేసిందేం లేదు
బాబు రెండున్నరేళ్లలో అయిన వాళ్లకు భూ కేటాయింపులు తప్ప మరే ఇతర పనులు పెట్టుకోలేదు. ప్రభుత్వ భూములను సొంత అత్త సొమ్ములా కార్పొరేటర్లకు ఇష్టారీతిన పంచిపెడుతున్నాడు. అవి చాలవన్నట్లు రైతుల భూములను కూడా ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో లక్షల ఎకరాలు వందల ఏళ్లకు లీజుల పేరుతో పోగేసుకుంటున్నాడు. బాబు హయాంలో భూ దందా తీరు చూస్తే మరో రెండేళ్ల మనం నిల్చోడానికి కూడా జాగా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. 
– అమరావతి రాజధాని పేరుతో లక్ష కోట్లు విలువ చేసే 1700 ఎకరాలు సింగపూర్‌ కంపెనీకి కేటాయించారు. ఇవే కాకుండా మరో లక్ష ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరణకు వ్యూహం.
– విశాఖ పట్నంలోని దసపల్లా హిల్స్‌ లోని దాదాపు 1500 విలువైన 60 ఎకరాలను లోకేష్‌ బినామీలకు ధారాదత్తం చేశారు. 
– అదే విశాఖ పట్నంలోని ఎయిర్‌పోర్టు సమీపంలో ఫిలింనగర్‌ సొసైటీకి చెందిన 60 కోట్లు విలువ చేసే 17 ఎకరాల భూమి మంత్రి గంటా అనుచరుల అప్పగింత
– చెన్నైలో 1083 కోట్లు విలువ చేసే సదావర్తి భూములు 
– విజయవాడలోని 14 ఎకరాలను సిద్దార్ధ కాలేజీ యాజమాన్యానికి 33 ఏళ్ల పాటు 1.50 లక్షలకు లీజుకు అప్పగింత 
– బందర్‌పోర్టు పేరిట లక్షా 5 వేల ఎకరాలను సేకరించేందుకు కుట్ర. 2014 ఎన్నికల ప్రచారంలో మాత్రం 5 వేల ఎకరాలు సరిపోతాయని ఆయనే చెప్పడం విశేషం. 
– ఇవి కాకుండా నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఏపీఐఐసీకి దాదాపు 500 ఎకరాల వరకు భూములు సేకరించి పలు కంపెనీలకు ధారాదత్తం చేయాలని నిర్ణయం. వీటికితోడు ఆయా కంపెనీలకు లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఇప్పించేందుకు వ్యూహం. 

సొంత సోకులకు వేల కోట్లు
జనం సొమ్ముతో జల్సాలు చేయడంలో బాబు ఎక్కడా తీసిపోరు. ఆయనకు హైదరాబాద్‌లో ఒక ఇళ్లు. వాస్తు బాగలేదని పడకొట్టించి మరో బిల్డింగ్‌ నిర్మానానికి శ్రీకారం. వాస్తు సమస్యలతో హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయానికి మార్పులు. అక్కడా కుదరలేదని అమరావతికి పయనం. దీంతోపాటు పార్క్‌ హయత్‌ హోటల్లో రోజుకు 1.25 లక్షలతో రెంటు చెల్లించి కాపురం. అమరావతిలో లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో ఇళ్లు. దానికి మౌలిక వసతులు సమాకూర్చేందుకు 25 కోట్లు. సీఎంకు అన్ని హంగులతో కూడిన ప్రత్యేకమైన బస్సు. వెలగపూడిలోని సీఎం క్యాబిన్‌కు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ భద్రత వలయం. వీటన్నిటితోపాటు చంద్రబాబు ఎక్కడికన్నా విదేశీ పర్యటన చేయాలంటే ప్రత్యేక విమానం. ఇప్పటికే చంద్రబాబు ప్రయాణాల కోసం మాత్రమే చేసిన ఖర్చు సంవత్సరానికి వెయ్యి కోట్లు దాటిందని జాతీయ మీడియాలో భారీగా కథనాలు ప్రసారమయ్యాయి. చంద్రబాబు దేశంలోనే రిచెస్ట్‌ సీఎంగా పేర్కొంటూ వార్తలు వెల్లడించాయి. అన్నిటికీ మించి ఏపీ అవినీతిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గట్టిగా షాకిచ్చాయి. 

నిజంగా రాష్ట్రం పేదరికంలో ఉందా?
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రం పేదరికంలో ఉందని బీద అరుపులు అరుస్తూ కొన్నాళ్లు టైంపాస్‌ చేశారు. ఆయన సోకులకు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చులకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్న బాబు వాటిల్లో సగం ఖర్చు చేసినా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసుండొచ్చు.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ందరికీ నిరుద్యోగ భృతి కూడా చెల్లించవచ్చని నిపుణులు అభిప్రాయం. సొంత సోకులు, పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద ఏనాడు పెట్టని చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది. 

అంతా చేసి మాపై నిందలా...? 
సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత బయటకొచ్చిన మంత్రులు, సమన్వయ కమిటీ సభ్యులు తెల్లమొకం వేశారు. ఇదెక్కడి అన్యాయం. అంతా ఆయన చెప్చిందే కదా చేస్తున్నాం. గాలి పీల్చాలన్నా, నీరు తాగాలన్నా ఆయన అనుమతి తీసుకునేగా తాగుతున్నాం. జల్సాలు చేసింది.. సంక్షేమ పథకాలు ఆపింది.. జనం దగ్గర భూములు లాక్కుంది ఆయన. అలాంటప్పుడు జనాల్లో వ్యతిరేకత రాక పూల దండలేసి సత్కారం చేస్తారు. అదేదో మనం చేసినట్టు మనల్ని బాధ్యుల్ని చేస్తాడేంటి అని నాయకులు గొణుక్కుంటూ అక్కడ్నుంచి చెక్కేశారు. టీడీపీలో జరిగే ప్రతి సంఘటనకు కర్త, ఖర్మ, క్రియ అన్నింటికీ కారణం చంద్రబాబే. అలాంటిది జనాలు మంచి జరిగినా చెడు జరిగినా కీర్తించాల్సింది బాబునే. మంచి జరిగినప్పుడు అంతా నా వల్లేనని.. చెడు జరిగినప్పుడు ఎమ్మెల్యేలు చేసినట్టా అర్థంకాక టీడీపీ నాయకులు తలలు బాదుకుంటున్నారు. 
 
Back to Top