కబ్జారాయుళ్లు..తెలుగు తమ్ముళ్లు

  • ఎన్నికల హామీలకు తూట్లు..అవినీతికి బాటలు
  • ఎడాపెడా రాష్ట్రాన్ని దోచేస్తున్న పచ్చనేతలు
  •  పేదలు, ప్రభుత్వ భూములు స్వాహా
  • మాఫియాలతో సాగిన బాబు మూడేళ్ల పాలన
చంద్రబాబు సర్కార్ భూదందా పరాకాష్టకు చేరింది. ప్రధాన నగరాల్లో ప్రభుత్వం భారీగా భూదందాలకు పాల్పడుతోంది. కోట్లాది విలువచేసే భూములపై పచ్చరాబంధులు వాలిపోతున్నాయి. పేదలు, ప్రభుత్వ భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు. కనబడ్డ భూమినల్లా స్వాహా చేస్తూ అవినీతిని పెంచిపోషిస్తున్నారు. ఏపీని దేశంలోనే అతిపెద్ద కరప్షన్ స్టేట్ గా తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నాలే కాదు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోనూ భూ కుంభకోణాలకు తెరలేపారు. రాబోవు ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రాలేమన్న ధీమానో ఏమో గానీ ఎడాపెడా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. 

రాష్ట్రంలో తెలుగుతమ్ముళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నా చంద్రబాబు కిమ్మనడం లేదు.   చంద్రబాబు, లోకేష్ ల కనుసన్నల్లోనే ఈ భూకుంభకోణాలు జరుగుతున్నాయని, అందుకే బాబు నోరు మెదపడం లేదని ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని భూ కుంభకోణాలపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని పట్టుబడుతున్నాయి. కానీ, అవేమీ పట్టని చంద్రబాబు తూతూమంత్రంగా సీఐడీ, సిట్ ల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దోపిడీకి మార్గాలను అన్వేషిస్తూ... తమ్ముళ్లను కేసుల నుంచి తప్పించేందుకు కొత్త జీవోలు విడుదల చేస్తున్నారు. అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోవడం లేదు.  తన అనుభవాన్ని అవినీతిలో వాడుకుంటూ రాష్ట్ర ప్రజలను నిలువునా దగా చేస్తున్నారు. 

బహిరంగ సభల్లో వేదికలపై లోటు బడ్జెట్ రాష్ట్రం, కట్టుబట్టలతో వచ్చామని బీద అరుపులు అరుస్తూ...తెరవెనుక అవినీతికి బాటలు పర్చారు. ప్రజలను మభ్యపెడుతూ భూ మాఫియాను పెంచి పోషిస్తున్నారు.  అడ్డొచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. బాబు మూడేళ్లలో ముప్పైకి పైగా క్యాబినెట్ మీటింగ్ లు పెట్టారు. వాటిలో ఏనాడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై ఆలోచన చేయకపోవడం బాధాకరం. ఇసుక, మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫీయాల కోసం చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ లను వేదికగా మల్చుకోవడం ఘోరాతి ఘోరం. ప్రజాసమస్యలను గాలికొదిలి, ఎన్నికల హామీలను విస్మరించి, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు.  
Back to Top