తాజా అబద్దాలోయ్.. తాజా అబద్దాలు..!


అబద్దాలు చెప్పటంలో
చంద్రబాబు ప్రభుత్వంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. మంత్రి వర్గంలో ఆయనకు కుడి
భుజంగా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామక్రష్ణుడు ఈ విషయంలో అందరికన్నా ముందుకు
దూసుకొని పోతున్నారు. అసెంబ్లీలో అందరినీ తికమక 
పెట్టేందుకు ప్రయత్నించే యనమల .. అటు ఆర్థిక వ్యవహారాల్లోనూ ఇదే బాటన
సాగుతున్నారు.

ప్రభుత్వం చేస్తున్న
విచ్చలవిడి ఖర్చుల గురించి అందరికీ తెలిసిందే. చంద్రబాబు విదేశీ పర్యటనలకు వందల
కోట్ల రూపాయిలు ఖర్చు అవుతోంది. పనిలో పనిగా చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల
కూడా వెళ్లి వస్తున్నారు. సొంత లావాదేవీలు చక్కబెట్టుకొనేందుకే ఈ విదేశీ పర్యటనలు
అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీని గురించి మాట్లాడకుండా ఆర్థికమంత్రి యనమల ..
ఖజానా లోటులో ఉంది అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

మొన్నటికి మొన్న
వ్యాపారులతో మీటింగ్ పెట్టి ఆర్థికపరిస్థితి బాగోలేదని, అంతా పన్నులు ఎడా పెడా
చెల్లించాలంటూ కోతలుకోశారు. వాస్తవానికి గడచిన ఆరు నెలల్లో పన్నులు గణనీయంగా వసూలు
అయ్యాయి. మొత్తంగా రూ. 19, 370 కోట్లు పిండేశారు. గతంతో పోలిస్తే ఇది, 3,500
కోట్లు ఎక్కువ. అయినా సరే పన్నులు వసూలు కావటం లేదన్న అబద్దాలు ఎందుకు...

కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల
వాటా రావటం లేదని మరోవైపు సంకేతాలు  ఇస్తున్నారు
కానీ, కేంద్ర పన్నుల్ల వాటా కానీ, గ్రాంట్ల లో వాటా కానీ గతంతో పోలిస్తే దాదాపు 50
శాతం పెరిగిందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక లోటు భర్తీకి 14 వ ఆర్థిక
సంఘం చేసిన సిఫార్సుల మేరకు 6 నెలల్లో సగం డబ్బు రానే వచ్చేసింది. అయినా సరే
కేంద్రం మీద బురద జల్లేస్తున్నారు.

సంక్షేమ పథకాలకు డబ్బులు
లేవంటూ సంకేతాలు పంపిస్తున్నారు. అసలు ఖజానా లో ఉన్న డబ్బు ఎంత, ఆదాయం ఎంత
వచ్చింది, ఖర్చు ఎంత అవుతోంది అన్న వివరాలు బయట పెట్టడం లేదు. బహిరంగంగా ఈ వివరాలు
బయటకు చెప్పటం లేదు. అటువంటప్పుడు ఈ అబద్దాలు చెప్పటం ఎంత వరకు సరైనది.

Back to Top