యనమల ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి

()య‌న‌మ‌ల ఆర్థిక శాఖ మంత్రి కాదు..! అడ్డ‌గోలు మంత్రి
()మిడిమిడి జ్ఞానంతో అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు
()ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి
()వైఎస్సార్సీపీ ఫిర్యాదులపై  విచారణ చేపట్టాలి


హైదరాబాద్ః రెండేళ్ల కాలంలో ఏ ఒక్క శాస‌న‌స‌భ స‌మావేశంలోనూ టీడీపీ న్యాయబద్దంగా వ్య‌వ‌హరించిన పాపాన పోలేద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. కోర్టు ఉత్త‌ర్వుల‌కు వ్య‌తిరేకంగా అధికార ప్ర‌భుత్వం అవలంభిస్తున్న తీరు ప్ర‌జాస్వామ్యానికే మాయని మచ్చ అని దుయ్య‌బ‌ట్టారు. అధికార శాస‌న‌స‌భ్యులు స‌భ‌లో మ‌హిళ‌ల‌ను కీంచ‌ప‌రుస్తూ దారుణంగా మాట్లాడినా, వారిపై ఎటువంటి చ‌ర్య‌లు కానీ, విచార‌ణ‌లు కానీ ఉండ‌వ‌ని... అదే ప్రతిపక్ష సభ్యులు నోరు విప్పితే టీడీపీ వారికి బూతులు మాట్లాడిన‌ట్లు విన‌బ‌డుతుందని ఫైరయ్యారు. ప‌చ్చకామెర్ల వారికి లోకమంతా ప‌చ్చ‌గా క‌నిపిస్తుంద‌న్న చందంగా టీడీపీ తీరు ఉంద‌ని ఎద్దేవా చేశారు.

రాజ‌కీయ బిక్ష పెట్టిన వారికే వెన్నుపోటు
 శాస‌న‌స‌భ‌లో ప్రతిపక్ష నేతను, సభ్యులను మాట్లాడనీయకుండా అడుగ‌డుగునా అడ్డుపడుతున్న ఆంధ్రాబ్రూట‌ర్ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.  రాజ‌కీయ బిక్ష పెట్టిన స‌ర్గీయ ఎన్‌.టి.రామ‌రావుకే యనమల మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు.  చంద్ర‌బాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి గ‌ద్దె గించిన‌ప్పుడు ...శాస‌న‌స‌భ‌లో రెండు చేతులు జోడించి క‌న్నీళ్లు పెట్టుకొని అధ్య‌క్ష మైకు... అధ్య‌క్ష మైకు... అధ్య‌క్ష మైకు అని అప్ప‌టి స్పీక‌ర్ య‌న‌మ‌ల‌ను ఎంతో ప్రాధేయ‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. య‌న‌మ‌ల నేడు ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌ట్ల ప్ర‌ద‌ర్శిస్తున్న తీరును అంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌న్నారు. త‌న‌కు తాను రాజ్యాంగ నిపుణిడ‌ని చెప్పుకుంటూ  మిడిమిడి జ్ఞానంతో అసెంబ్లీలో అడ్డ‌గోలుగా మాట్లాడుతున్న య‌న‌మ‌ల.... ఆర్థిక శాఖ మంత్రిగా కాకుండా అడ్డ‌గోలు మంత్రిగా  పేరు తెచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యులు ఏది మాట్లాడినా టీడీపీ వక్రీకరిస్తోందని దుయ్యబట్టారు.  ముఖ్య‌మంత్రి ఏకంగా  ప్రతిపక్ష సభ్యులను అంతు తేలుస్తానంటాడు. కొందరు మంత్రులేమో నీవు  మ‌గాడివా, సైకోవి, రాక్షసుడివి,ఖ‌బ‌డ్దార్‌, చంపేసి స‌మాధి క‌ట్టేస్తా అన్న మాట‌ల‌ు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న కాదా అని ప్ర‌శ్నించారు. 

20సార్లు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోరా..
 ప్రతిపక్ష నాయకుడిని, మ‌హిళ శాస‌న‌స‌భ్య‌ులను, ఇత‌ర శాస‌న‌స‌భ్యుల‌ను కించ‌ప‌రిచిన అధికారపార్టీ నేతలపై ....ప్రివిలేజ్ కమిటీకి ఇప్పటికీ వైఎస్సార్సీపీ  20సార్లు ఫిర్యాదు చేసింద‌ని, అందులో ఏ ఒక్క ఫిర్యాదు ఇప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌కు రాలేద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి మండిప‌డ్డారు. అధికార ప్ర‌భుత్వ‌మే ఇలాంటి ధోర‌ణిని అవ‌లంబిస్తుంటే భ‌వ‌ష్య‌త్ త‌రాల‌కు ఎటువంటి మెసేజ్ ఇస్తారని ప్రశ్నించారు. స‌భ‌లో అధికార ప‌క్షానికి ఓ న్యాయం, ప్ర‌తిప‌క్షానికి మ‌రో న్యాయ‌మా అని నిలదీశారు.  శాస‌న‌స‌భ‌కు ఇస్తున్న గౌర‌వం ఇదేనా..? మ‌నం ముషార‌ఫ్‌ పాలనలో ఉన్నామా లేక ఏ తాలిబాన్  పాల‌న‌లో ఉన్నామా అనిపిస్తుంద‌ని నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వానికి ఏమాత్రం చిత్త‌శుద్ధి ఉన్నా వైఎస్సార్‌సీపీ ఇచ్చిన 20 ఫిర్యాదుల‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. 

య‌న‌మ‌ల ముక్కు నేల‌కు రాసి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి
టీడీపీ వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ల‌దించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీ‌నివాస‌ులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  రోజా కేసు విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఉంద‌ని సుప్రీంకోర్టు హైకోర్టుకు పంపిస్తే... దానిపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు రోజా సస్పెన్షన్ ను కొట్టివేస్తూ స్టే ఇచ్చిందన్నారు. ఒక శాస‌న‌స‌భ్యురాలిని సంవ‌త్స‌రం పాటు స‌స్పెండ్ చేసే అధికారం స్పీక‌ర్‌కు లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసినా ఆ తీర్పు త‌ప్పు అని చెప్ప‌డం ఒక్క టీడీపీకే చెల్లింద‌న్నారు. టీడీపీకి భార‌త రాజ్యాంగం, కోర్టు, కోర్టు తీర్పులు, రాష్ట్ర ప్ర‌జ‌లపై గౌర‌వమే లేద‌ని ఎద్దేవా చేశారు. 

ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేసే ప్ర‌తి ప‌నిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంద‌ని చెప్పారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైఎస్సార్సీపీ ధ‌ర్నాలు, రాస్తారోకోలు చేస్తూ టీడీపీ వైఖ‌రిని ఎండ‌గ‌డుతుంద‌ని, అందుకే ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌ని టీడీపీ కుట్ర ప‌న్నుతుంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడే స‌మ‌యంలో య‌న‌మ‌ల హేళ‌న చేస్తు మాట్లాడుతున్నార‌ని, స‌భ‌లో హుందాగా ఉండే ప‌ద్ధ‌తి య‌న‌మ‌లకు తెలియ‌ద‌న్నారు. ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డితే వారి క‌ష్ట‌, న‌ష్టాలు తెలిసుండేవ‌ని, దొడ్డి దారిన వ‌చ్చిన వారికి ప్ర‌జ‌ల క‌ష్టాలు ఏ మేర‌కు అర్థ‌మ‌వుతాయ‌ని ఎద్దేవా చేశారు.  ఇప్ప‌టికైనా య‌న‌మ‌ల చేసిన త‌ప్పుకు  లెంప‌లు వేసుకొని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలన్నారు.  కోర్టుకు వెళ్లి ముక్కు నేల‌కు రాసి, వైఎస్ జగన్ కు  క్ష‌మాప‌ణ చెప్పి, ఆర్కే రోజాకు స్వాగ‌తం ప‌ల‌కాల‌ని సూచించారు.   
Back to Top