యా..మ‌న‌వాళ్లు బ్రీఫ్ డ్ మీ..!

హైద‌రాబాద్‌ : ఓటుకి కోట్లు ఎర‌వేసిన కుంభ‌కోణంలో బాస్ అంటే చంద్ర‌బాబే అన్న దిశ‌గా నిర్ధార‌ణ అవుతోంది.  ఈ కేసు ఛార్జ్ షీట్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేరు చేర్చినట్లు  ప్ర‌ముఖ ఆంగ్ల జాతీయ దిన‌ప‌త్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ మేర‌కు క్లెయిమ్స్ బాస్ ఈజ్ ఏపీ సీఎం  అంటూ ఆ ప‌త్రిక వార్త‌ను ప్ర‌చురించింది. ఓటుకి కోట్లు కేసు చార్జ్ షీటులో చంద్ర‌బాబు పేరును చేర్చినట్లు ఏసీబీ స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ వి సురేంద‌ర్ రావు తెలిపిన‌ట్లు ఆ వార్త‌లో వెల్లడించారు.
తెలంగాణ  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు రూ. 50 ల‌క్ష‌లు ఇస్తూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ కేసులో పాత్ర‌ధారి రేవంత్ అయిన‌ప్ప‌టికీ, సూత్ర‌ధారి చంద్ర‌బాబు అని వార్త‌లు బ‌లంగా వ‌చ్చాయి. అప్ప‌ట్లో రేవంత్ మాట్లాడుతూ..అంతా బాస్ చూసుకొంటారు అని ప‌దే ప‌దే చెప్ప‌టాన్ని బ‌ట్టి ఈ నిర్ధార‌ణ అయింది. కొన్ని రోజుల త‌ర్వాత స్టీఫెన్ స‌న్ తో చంద్ర‌బాబు మాట్లాడిన ఆడియో టేపులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు పాత్ర అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థం అయింది.
ఫోన్ కాల్స్ సంభాష‌ణ‌లు ఆధారంగా బాస్ చంద్ర‌బాబు నాయుడే అని ఏసీబీ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అందుకే చార్జిషీటులో ఆయన పేరును చేర్చినట్లు భావిస్తున్నారు. మ‌రో వారం రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.
Back to Top