అదిగో అమ‌రావ‌తి..ఇదిగో డ‌బ్బులు నొక్కేద్దాం..!

() దొంగ లెక్క‌ల్లో తెలుగుదేశం నాయ‌కులు
() నిర్మాణాలు పూర్త‌య్యాయంటూ కేంద్రానికి తప్పుడు నివేదిక‌లు
() సీరియ‌స్ అయిన కేంద్ర ప్ర‌భుత్వం
అమ‌రావ‌తి) రాజ‌ధాని పేరుతో భారీ అవినీతి కి తాజా ఉదాహ‌ర‌ణ ఇది. సింగ‌పూర్ సిత్రాల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నేరుగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. క‌ట్ట‌ని నిర్మాణాల‌కు లెక్క‌లు రాసి స‌మ‌ర్పించింది.
రాజ‌ధాని ప‌నుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం విరివిగా నిధులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రం నుంచి వంద‌ల కోట్ల రూపాయిల్ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెచ్చేసుకొంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దుబారా ఖ‌ర్చులు, విదేశీ యాత్ర‌ల‌కు ఒక వైపు నుంచి డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చ‌వుతున్నాయి. మ‌రోసారి నిధుల కోసం కేంద్రానికి లేఖ రాసింది. గ‌తంలో ఇచ్చిన డ‌బ్బుల‌కు స‌హ‌జంగానే కేంద్రం నిధులు అడిగింది. రూ. 850 కోట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌లు చూపింది. అమ‌రావ‌తి ప్రాంతంలో రాజ్ భ‌వ‌న్‌, హైకోర్టు భ‌వ‌నాలు క‌ట్టిన‌ట్లుగా యూటిలిటీ స‌ర్టిఫికేట్ల‌ను ఇచ్చేసింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వానికి అనుమానం వ‌చ్చింది. త‌న‌దైన మార్గంలో స‌మాచారం తెప్పించుకొంది. అస‌లు అమ‌రావ‌తిలో ఒక్క భ‌వ‌న నిర్మాణ‌మూ జ‌ర‌గ లేద‌ని నిర్ధారించుకొంది. దీంతో మండుకొచ్చిన కేంద్రం రాష్ట్రానికి ఘాటుగా లేఖ రాసింది. గ‌డచిన రెండేళ్ల‌లో కేంద్రం నిధుల్ని ఏ ఏ ప‌నుల‌కు ఎంతెంత ఖ‌ర్చు పెట్టిందీ లెక్క‌లు చూపించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కేంద్ర నీతి ఆయోగ్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కు లేఖ అందింది.

Back to Top