టీడీపీ నేతల కోసం అక్రమాల బాట

() ఆర్టీసీలో పెరుగుతున్న ప్రైవేటు బస్సుల హవా

() టీడీపీ నేతల బస్సుల కోసం దోపిడీ బాట

() కనీసం తనిఖీలు కూడా లేకుండా పచ్చ నేతల జాగ్రత్తలు

హైదరాబాద్) తెలుగుదేశం నేతల్ని పోషించుకొనేందుకు ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్ని
నెత్తిన పెట్టుకొంటోంది. పచ్చ చొక్కాల కోసం ప్రైవేటు అద్దె బస్సుల్ని
ప్రోత్సహిస్తోంది. అద్దె బ‌స్సుల్లో ప‌ని చేస్తున్న ప్రైవేటు సిబ్బందికి
టిక్కెట్లు జారీ చేసే టిమ్ యంత్రాల్ని అప్ప‌గించ‌డం ద్వారా అక్ర‌మాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది.
దీంతో ఆదాయం మీద లెక్క పత్రం లేకుండా పోతోంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 2,920 బ‌స్సుల్ని అద్దె ప్రాతిప‌దిక‌న స‌మీక‌రించుకుని
ఆయా రూట్ల‌లో ఆర్టీసీ న‌డిపిస్తోంది. వీటికి కిలోమీట‌రుకు రూ. 20 చెల్లిస్తున్నా ఆదాయం మాత్రం స‌గ‌టున
కిలోమీట‌రుకు రూ. 22 నుంచి రూ. 25 వ‌ర‌కు మాత్ర‌మే వ‌స్తోంది. కాగా, ఆర్టీసీ బ‌స్సుకు రోజుకు రూ. 10 వేల ఆదాయం వ‌స్తుండ‌గా, అద్దె బ‌స్సుల‌కు మాత్రం రూ. 7వేల‌కు మించి రావ‌డం లేదు. అదేమంటే ప్రైవేటు
బ‌స్సుల వ‌ల్ల ఆర్టీసీ సిబ్బంది వేత‌నాల్ని, బ‌స్సుల నిర్వ‌హ‌ణ భారాన్ని త‌ప్పించుకోవ‌చ్చ‌ని, త‌ద్వారా సంస్థ న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతుంద‌ని
యాజ‌మాన్యం స‌మ‌ర్థించుకుంటోంది.

అద్దె బ‌స్సుల్లో స్వ్కాడ్ బృందాలు త‌నిఖీలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్రైవేట్
సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్వ్కాడ్ బృందాలు త‌నిఖీలు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో
గుంటూరు,
 ప్ర‌కాశం, కృష్ణా, విజ‌య‌న‌గ‌రం, చిత్తూరు జిల్లాల నుంచి ఫిర్యాదులు
అందుతున్నాయి. అందుచేతనే ఆయా ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లటం లేదన్నమాట బలంగా
వినిపిస్తోంది.  అద్దె బ‌స్సుల్లో త‌నిఖీలు
చేయ‌వ‌ద్ద‌ని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలున్న‌ట్లు స‌మాచారం. 

అద్దె బ‌స్సుల్లో టిమ్ యంత్రాల్ని ప్రైవేటు సిబ్బందికి అప్ప‌గించ‌డంతో ప‌లు
చోట్ల అక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. వీటిపై చర్య‌లు తీసుకోకుంటే సంస్థ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం
ఏర్పడుతుంద‌ని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top