అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగని వైనం..!


() గవర్నర్ ప్రసంగలో క్లోజర్ మోషన్ తెస్తారా

() క్లోజర్ మోషన్ అనేది అంత తేలిగ్గా వాడుకొంటారా

() అసెంబ్లీ చరిత్రలోమొదటిసారి గవర్నర్ తీర్మానంలో ఉపయోగిస్తారా

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం జరిగిన పరిణామాలు చూస్తుంటే
చాలామందికి ఆశ్చర్యం కలుగుతోంది. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే
తీర్మానం మీద చర్చ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చరిత్రలో
ఎప్పుడూ లేని విధంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ
సందర్బంగా క్లోజర్ మోషన్ తెచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రతిపక్ష సభ్యుల్ని
సస్పెండ్ చేయించి బయటకు పంపించారు. ఇటువంటి పోకడల మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం
అవుతున్నాయి.

గవర్నర్ ప్రసంగం ఉద్దేశ్యం

శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగించటం ఆనవాయితీ. అంటే టైమ్
టూ టైమ్ ప్రభుత్వం చేస్తున్న పనులు, చేపడుతున్న కార్యక్రమాల్ని కార్యనిర్వాహక
వ్యవస్థ ద్వారా శాసన నిర్వాహక వ్యవస్థ కు తెలియ చెప్పటం జరగుతుంది. దీని మీద
ప్రతిపక్షాలు, అధికార పక్ష సభ్యులు మాట్లాడటం ద్వారా విస్త్రతంగా ప్రభుత్వ
కార్యకలాపాల మీద చర్చించుకొనే అవకాశం అన్నమాట. సాధారణంగా సమావేశాల ప్రారంభంలోనే
దీన్ని చేపట్టడం ద్వారా విభిన్న అంశాల మీద ప్రస్తావన కనిపిస్తుంది. అదే తరహాలో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేక
విషయాల్ని ప్రస్తావించారు.

పారిపోయేందుకు క్లోజర్ మోషన్ తెచ్చిన వైనం

రాజధాని భూముల దందా గురించి వైఎస్ జగన్ నిలదీసినప్పుడు జవాబు చెప్పటానికి
మార్గం కనిపించ లేదు. దీని మీద చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు విస్తారంగా
ప్రయత్నించారు. ఈ దశలో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామక్రిష్ణుడు లేచి క్లోజర్
మోషన్ తీసుకొని వచ్చారు. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు అధికార పక్షం
బలవంతంగా ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి దీన్ని వాడుకొంటారు. అటువంటిది గవర్నర్
ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు దీన్ని
వాడుకొన్నారు. మరో పక్షం అయిన బీజేపీ పక్షం నుంచి మాట్లాడే అవకాశం కూడా
ఇవ్వకుండానే చర్చను ముగించేశారు.

ఆ వెంటనే సస్పెన్షన్ చేసి పంపిస్తారా..

దీని మీద నిరసన తెలపటం బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ హక్కు. అందుకే
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతుంటే స్పీకర్ స్థానం మీద ఒత్తిడి తెచ్చి
ప్రభుత్వం తరపు నుంచి సస్పెన్షన్ తీర్మానం తీసుకొని వచ్చారు. స్పీకర్ సూచన
చేయకపోయినా సరే, సస్పెన్షన్ తీర్మానం తెస్తామని పదే పదే మంత్రి యనమల చెప్పటం
దీన్నే సూచిస్తోంది. మొత్తం మీద మొండిగా వ్యవహరించాం అని చట్ట సభల ద్వారా
ప్రభుత్వం చాటుకొన్నట్లయింది

 

 

Back to Top