టీడీపీ కార్పొరేటర్ల నిర్వాకం

విజయవాడ) సెక్సు రాకెట్ కాల్ మనీ వ్యవహారంలో ముదిరిపోయిన విజయవాడ తెలుగుదేశం
నాయకులు తమ బుద్ధిని అన్ని చోట్ల ప్రదర్శిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు టూర్
వెళ్లిన సందర్భంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయారు.
విజయవాడలో అయితే పోలీసుల్ని బెదిరించి ఆడపిల్లల్ని హడలు కొట్టేవారు. కానీ
దొరికిపోయింది పూనే లో కాబట్టి కాళ్లా వేళ్లా పడి బయట పడ్డారు.

       విశ్వసనీయ సమాచారం ప్రకారం
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లను విజ్నానయాత్రకు
పంపించారు. అంటే ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేషన్ల లో ఎటువంటి ప్రగతి శీల పనులు
జరుగుతున్నాయి అనేది తెలుసుకొని ఇక్కడకు వచ్చి వాటిని అమలు చేస్తారని చెప్పారు.
ఇందుకు అక్షరాలా 30 లక్షల రూపాయిలు కేటాయించారు. పోనీ డబ్బు పోతే పోయింది నాలుగు
మంచి విషయాలు నేర్చుకొని వస్తే బాగానే ఉండేది.

       కానీ కొందరు టీడీపీ కార్పొరేటర్లు
రైలులో ప్రయాణిస్తూ ఫుల్లుగా మద్యం సేవించారు. అడ్డు వచ్చిన రైల్వే సిబ్బందిని
బెదిరించారు. అదే రైలులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా
ప్రవర్తించారు. దీంతో వారంతా తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనే లో రైల్వే
పోలీసుల్ని అదిలించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు కానీ ఫలించలేదు. దీంతో
వాళ్లను బతిమాలుకొని ప్రజా ప్రతినిధులం అని చెప్పుకొని పెద్ద నాయకులతో ఫోన్లు
చేయించుకొని బయటపడ్డారు.

       కాల్ మనీ సెక్సు రాకెట్
కుంభకోణంలో ముదిరిపోయిన తెలుగుదేశం నాయకులు అదే పంథాను అన్ని చోట్ల కొనసాగిస్తే
కుదరదు కదా..! అడ్డంగా దొరికిపోయారు. దీన్ని కప్పి
పుచ్చుకొనేందుకు టీడీపీ నేతలు ప్రయ్నత్నిస్తున్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top