అవుట్ డేటెడ్ సీఎమ్ ఎవరో అర్థం అవుతోంది కదా..!

() పుట్టుకతోనే ఎస్సీలుగా
పుట్టాలనుకొంటారా

() కోడలే మగపిల్లాడ్ని
కంటానంటే అత్త వద్దంటుందా

() అయ్యప్ప దీక్షలు మద్యం
మానేందుకే వేసుకొంటున్నారు

() పాపాలు చేసినవాళ్లే
ఎక్కువ గుళ్లకు వెళుతున్నారు

హైదరాబాద్) వయస్సు మీద పడే
కొద్దీ చంద్రబాబు మనస్సులోని మాటలు అప్పుడప్పుడూ బయట పడుతున్నాయి. తాజాగా
కలెక్టర్ల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. 2,3 గంటల పాటు
ఏకధాటిగా ప్రసంగించి తలకు బొప్పి కట్టించిన చంద్రబాబు మత విశ్వాసాల్ని దెబ్బ తీసే
విధంగా మాట్లాడటం గమనార్హం.

గతంలోనూ వివాదాస్పద
వ్యాఖ్యలు

          చంద్రబాబు గతంలోనూ అహంకార పూరిత వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
పుట్టుకతోనే ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ అనుకోరంటూ ఆయన దళితుల్ని తీవ్రంగా అవమాన
పరిచారు. మనస్సులోని కుల దురహంకారాన్ని ఆయన బయట పెట్టుకొన్నారు. తర్వాత కాలంలో
ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. కోడలే మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా
అని నోరు పారేసుకొన్నారు. మహిళల్ని కించపరిచే విధంగా మనస్సులోని మాటను బయట పెట్టుకొన్నారు.

దేవాలయాల మీద వ్యాఖ్యలు

హిందువులు పవిత్రంగా
భావించే దేవాలయాల మీద చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడలో
కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడుతూ రక రకాలుగా మాట్లాడేశారు.  పాపాలు చేసిన వారే గుడులకు వెళతారని
వ్యాఖ్యానించారు. అటువంటి వారే ఎక్కువగా డబ్బులు హుండీల్లో వేస్తున్నారని
చెప్పారు. అందుకే రెండేళ్లలో ఎక్కువ గా డబ్బులు సమకూరుతున్నాయని చెప్పుకొచ్చారు.
పైగా ప్రజలకు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడే దేవుడు గుర్తుకు వస్తారని సొంత కవిత్వం
చెప్పారు.

          అయ్యప్ప దీక్షల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం
మానేసేందుకు దీక్షలు చేస్తున్నారని, అందుకే ఆ సీజన్ లో మద్యం అమ్మకాలు
తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద హిందు మతం మీద, దేవాలయాల వ్యవస్థ
మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Back to Top