రావెల సుశీల్ కు ఆదర్శం ఎవరంటే..!


() ఏపీలో చర్చనీయాంశంగా
మారిన రావెల సుశీల్ ఎపిసోడ్

() అసెంబ్లీలో నీతులు
వల్లిస్తూ ప్రతిపక్షాల మీద బురద జల్లే రావెల కిశోర్

() తండ్రీ కొడుకులు ఇద్దరూ
అనుసరిస్తున్న ఆదర్శం ఎవరిది

హైదరాబాద్) మంత్రి రావెల
కిశోర్ బాబు.. ఈ పేరు వినగానే అందరికీ అసెంబ్లీలో నోరు పెట్టుకొని అరిచే వ్యక్తి
మెదలుతారు. అసెంబ్లీ కార్యకలాపాల్లోకి అడ్డంగా చొరబడి, ప్రతిపక్ష నాయకుల్ని,
విపక్ష ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ చెలరేగిపోతుంటారని రావెల గురించి
చెప్పుకొంటారు. నీతి వాక్యాలు వల్లిస్తూ గొప్పలు చెప్పుకొనేందుకు ప్రయత్నించే
రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్ చేసిన పనులు చర్చనీయాంశంగా మారాయి. పీకల దాకా
మద్యం తాగేసి, రోడ్డు మీద వెళుతున్న మహిళల్ని చెర పట్టేందుకు ప్రయత్నిస్తే ,
స్థానికులు బయటకు లాగి చితక్కొట్టి వదిలిపెట్టారు. ఇంత జరిగినా మంత్రి కిశోర్ బాబు
కానీ, ఆయన కుమారుడు సుశీల్ కానీ బయటకు వచ్చి హుందాగా జరిగింది తప్పన్న మాట చెప్పటం
లేదు.

          వాస్తవానికి కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న
పరిణామాల్ని చూస్తే శాంతి భద్రతల పరిస్థితి మీద అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా
మహిళా తహశీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టించి, ఇసుకలో ఈడ్పించి కొట్టిస్తే ఎటువంటి
చర్యలు లేవు. పట్ట పగలు విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిని కొట్టించిన టీడీపీ
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు శెభాష్ అని మెచ్చుకొన్నారు. పైగా సీఎం
క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని చింతమనేని ని పక్కన కూర్చో బెట్టుకొని సదరు
బాధితురాల్ని బెదిరించి సెటిల్ మెంట్ చేయించారు. దీంతో టీడీపీ శ్రేణులకు
చంద్రబాబు  బలమైన సందేశం పంపించారు.
మహిళల్ని వేధించినప్పటికీ ఎటువంటి చర్యలు ఉండవు, అవసరమైతే మెచ్చుకొని సెటిల్ మెంట్
చేయటానికి కూడా వెనుకాడబోం అన్న మెసేజ్ ఇచ్చేశారు.

          ఇప్పుడు మంత్రి రావెల కిశోర్ బాబు పేరు రాజధాని ప్రాంతంలో
మార్మోగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల్ని ఆయన భోంచేశారు. భార్య పేరిట
భూములు కొనేసి, కొంటే తప్పేముంది అంటూ దబాయిస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు
ఆయన్ని బాగా వెనుకేసుకొని వస్తున్నారు. దీంతో కొడుకు సుశీల్ కు చంద్రబాబు
మనస్తత్వం బాగా అర్థం అయింది. అందుకే మహిళల్ని వేధించినా తమ మీద చర్యలు ఏమీ
ఉండవని, అవసరమైతే బాబు గారు క్యాంపు ఆఫీసుకి పిలిపించి సెటిల్ మెంట్  చేస్తారన్న ధైర్యంతో చెలరేగిపోయాడని జోకులు
పేలుతున్నాయి. అందుకే తండ్రి అవినీతి లో, కొడుకు మహిళల్ని వేధించటంలో
చంద్రబాబు  ని ఆదర్శంగా తీసుకొని
చెలరేగుతున్నారన్న మాట వినిపించింది. 

Back to Top