తిరుపతి: అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని.............ఇప్పుడు మాత్రం పార్లమెంట్ వైపు చూస్తున్న సామాస్యులను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాగైతే పార్లమెంట్‌కు ఉన్న విశ్వసనీయత ఏంటని ప్రశ్నించారు. తిరుపతిలో ఆత్మార్పణ చేసుకున్న మును కోటి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుకోటి కుటుంబానికి కనీసం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే......- ఈ వాళ పోయిన ఈ ప్రాణానికి కారణం ఏంటని మనమంతా చూశాం- ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాల్సింది..... ఇవ్వకపోవడం, వచ్చే పరిస్థితి సన్నగిల్లింది- అలాంటి పరిస్థితి మధ్య రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది- పరిశ్రమలు రావని, ఉద్యోగాలు దొరకవని, రాష్ట్రం అన్ని విధాలా నష్ట పోతుందని చంద్రబాబు నాయుడుకు పట్టలేదు.- ఆయనకు చలనం రాలేదు-ఈవాల్టికి కూడా చంద్రబాబు ఒక మాట మాట్లాడతారు.- మంత్రులు, ఎమ్మెల్యేలు తలో మాట మాట్లాడతారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తలో మాట చెబుతారు.- వీళ్లు చేసిన అన్యాయం కారణంగానే ఒక ప్రాణం బలైపోయింది.- మునుకోటి ప్రాణానికి ప్రభుత్వం తరపు నుంచి స్పందన కూడా లేదు- ముందు 3 లక్షలు, తర్వాత ఒత్తిడి పెరిగేసరికి 5 లక్షలు ఇస్తామని చెబుతున్నారు.- అది కూడా ఇంకా ఇవ్వలేదు- కనీసం 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంచంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా, కేంద్రం కనువిప్పు కలిగేలా పెట్రోలు ఒంటిమీద పోసుకుని మరణించాడు.-ఇలాంటి ప్రాణాలు ఇక పోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిద్ర లేవాలి, ముందుకొచ్చి పోరాటం చేయాలి.- కేంద్రం ప్రత్యేక హోదా చంద్రబాబు తన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులను ఉపసంహరించుకోవాలి. రోడ్డు మీదకు వచ్చి..... గట్టిగా పోరాటం చేయాలి.- చంద్రబాబు నాయుడు ఇంతవరకు కేంద్రం మాదిరిగానే మభ్యపెడుతూ వచ్చారు.- కనీసం ఇప్పటికైనా మొసలి కన్నీరు కారుస్తూ ఉన్న తన విధానాన్ని మార్చుకోవాలి.- నిన్న ఢిల్లీలో ధర్నా చేశాం. ఢిల్లీ వీధుల్లో గళం వినిపించాం.- 67 మంది ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సామాన్యులు అంతా కలిసి గళం వినిపించాం.- ఈ పోరాటం ఇంకా కొనసాగిస్తాం.- దయ ఉంచి ఏ ఒక్కరూ ఇలా కోటిలా ప్రాణాలు తీసుకోవద్దు.- అందరం కలిసి కట్టుగా ఒకటవుదాం.- కేంద్రం మెడలు వంచుదాం. చంద్రబాబు మెడలు వంచయినా సరే పోరాటానికి తీసుకొద్దాం.- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటున్నారు.- 14 వ ఆర్థిక సంఘం పేరుతో అబద్ధాలు చెబుతున్నారు. అవన్నీ కట్టుకథలే.