భాగస్వామ్య సదస్సులో కేంద్రం భాగమెంత..?

– పూటగడవని మాటలతో గడిచిపోతున్న సదస్సు
– పది లక్షల కోట్ల పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలంటూ ప్రసంగాలు
– విశాఖ వేదికగా మరో అబద్ధాల ప్రసంగాలతో టోకరా 
– జైట్లీ ఎదుటే కేంద్రం పరువు తీసిన చంద్రబాబు 

మరో కట్టుకథకు శంకుస్థాపన జరిగింది. గతేడాది విశాఖ వేదికగా నిర్మించిన అబద్ధాల మేడలు కూలి శకలాలు కూడా దొరక్కుండా కనుమరుగయ్యాయి. ఇప్పుడు అదే విశాఖలోనే మరో నిలువెత్తు దోపిడీకి కార్యాచరణ జరుగుతోంది. అబద్ధాల మేకప్‌ వేసుకున్న మేధావులంతా చేరి వంచనకు పథక రచన చేస్తున్నారు. భాగస్వామ్య సదస్సు పేరుతో మరో బలవంతపు పెళ్లికి చంద్రబాబు ముహూర్తం సిద్ధం చేశారు. అరుణ్‌ జైట్లీ, వెంకయ్య మంత్రాలు చదివేసి వెళ్లారు. ఖరీదైన షామియానాలు, బ్యాండు మేళాలు, దేశీ విదేశీ వంటకాల వైభోగాలు.. ఔరా అనిపించే సెట్టింగ్‌లు వెరసి నభూతో అనిపించేలా మొదలైన భాగస్వామ్య సెట్టింగ్‌ జనాలకు మాత్రం స్వెట్టింగ్‌ తెప్పిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కోట్లు కుమ్మరించడానికి వేల కంపెనీలు పోటీలు పడి మరీ వస్తున్నాయన్న కలరింగ్‌ తప్ప మహిళలకు టాయ్‌లెట్లకు కూడా వెళ్లే అవకాశం లేని దౌర్భాగ్యం. ఇదీ స్థూలంగా భాగస్వామ్య సదస్సు పేరుతో  చంద్రబాబు చేస్తున్న వంచన. నిధులు ఇవ్వకుండా తప్పించుకోడానికి ఆయనకు బీజేపీ మద్దతు.. వారిద్దరూ రాష్ట్రాన్ని మార్చబోతున్నారని మధ్యలో వెంకయ్య బూర.. వీళ్లందరూ లేకుంటే ఏపీ ఏమైపోయేదోనని పచ్చ మీడియా కంపు కూతలు. 

ఆ 4.5 లక్షల పెట్టుబడులు ఏవీ..
గతేడాది ఇదే నెలలో అదే విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సులో ఏపీకి 4.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బాబు సహా పచ్చమీడియా ఊదరగొట్టేసింది. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనీవ్వను.. నా ధ్యాసంతా అమరావతి నిర్మాణం ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడం అన్నట్టుగా ఫోజులు కొట్టాడు. 2050 నాటికి కలను సాకారం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే బాబు సంకల్ప బలం ముందు లక్ష్యం చిన్నబోయింది. సంవత్సరం కూడా గడవకముందే ఏపీని దేశంలోనే అవినీతిలో అగ్రగామిగా నిలిపాడు. గత ఏడాది విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో 328 ఎంవోయూలు కుదుర్చుకుని, రూ.4 లక్షల 62వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో 157 ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటి కారణంగా వేలాది మందికి ఉపాధి లభించిందని పేర్కొన్నారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో.. ఎవరెవరికి ఉద్యోగాలొచ్చాయో ప్రతి పౌరుడి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న. నిద్రలేకుండా చేస్తున్న ఈ ప్రశ్నకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పదు. ఎందుకంటే అదంతా అభూత కల్పనే.  

జైట్లీదీ బాబు రాసిచ్చిన ప్రసంగమే
కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా బాబు రాసిచ్చిన ప్రసంగమే చదివేసి బాబును ఖుషీ చేశాడు. రాష్ట్ర విభజన సమయంలో కొంత నష్టం జరిగినప్పటికీ రెండున్నరేళ్లలో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతోందన్నారు. వెనకబడి ఉందంటే కేంద్రం ఆదుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిపోతుంది కదా. మన వెంకయ్య ఏమన్నా తక్కువ తిన్నాడా. అసలే బాకా ఊదడంలో ఆయన్ను మించిన వారుండరు. ప్రపంచమంతా పెట్టుబడుల కోసం ఇండియా వైపు చూస్తుంటే ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోందని బాబును మునగ చెట్టుపై కూర్చోబెట్టాడు. 

నాడు 2020 ఇప్పుడు 2050
చంద్రబాబు గెలిచినప్పుడే ఎంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకుంటున్నాడో నిర్ణయించుకుంటాడు. దానికి తగ్గట్టుగా ఆయన డెడ్‌ లైన్లు సిద్ధం చేస్తుంటాడు. గతంలో విజన్‌ 2020 అని హడావుడి చేసిన బాబు ఈసారి 2050 రాగం పాడుతున్నాడు. ఆయన గెలిచిన రోజు నుంచీ కనీసం 30 సంవత్సరాలకు తగ్గకుండా డెడ్‌లైన్‌ పెట్టుకుంటాడు. కాకపోతే ఈసారి డెడ్‌లైన్‌ వస్తదో.. డెడ్‌ వస్తదో చూడాలి. ఆయన మరో 30 ఏళ్లు బతకడమంటే దాదాపు అసంభవం. ఆయన వయస్సు ఇప్పుడే 65 దాటింది. అసలు బాబు ఏమన్నారో చూద్దాం..

వచ్చే ఏడాదికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.  ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా రాజధాని ‘అమరావతి’ని నిర్మించనున్నట్లు తెలిపారు. గతేడాది సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాలతో పాటు మిగిలినవి కూడా కలుపుకుంటే మొత్తం 927 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ. 5,30,715 కోట్లు కాగా, 10,05,506 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. గతేడాది జరిగిన దానికే ఇప్పటికీ దిక్కులేదు. చూద్దాం ఈ మోసపు పుట్టల నుంచి అవినీతి పాములు బయటకు రావడానికి ఎంతోకాలం పట్టదు. 

పాల్గొన్న ప్రముఖులంతా స్వదేశీయులే
ఒకపక్క ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులంతా పెట్టుబడులు పెట్టడానికి పరుగులు తీస్తున్నారు... వాళ్లకు సీట్లు కూడా దొరక్క ఖర్చీఫ్‌లు వేసుకుంటున్నారు అని... పచ్చ మీడియా, సదస్సు మొదలు కాకమునుపే ఊదరగొట్టేసింది. తీరా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను చూస్తే నిత్యం బాబు చుట్టూ తిరిగే ముఖాలే. జీఎంఆర్‌ గ్రూపు చైర్మన్‌ జి.ఎం.రావు, సుజ్లాన్‌ ఎనర్జీ చైర్మన్‌ తుల్సి తంతి, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ శోభన కామినేని, సీఐఐ ప్రెసిడెంట్‌ నౌషధ్‌ ఫోరబ్స్, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్‌పి టక్కర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్‌ అరోఖ్యారాజ్‌తో పాటు 50 దేశాలకు చెందిన అధికారులు, 2,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. చూడండి మరి ఇదొక్కటి చాలదా.. బాబు హడావుడి గురించి చెప్పడానికి. 

కేంద్రం సహకారం ఉంటుందా...
కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల ఎదుట చంద్రబాబు కేంద్రాన్ని కించపరిచేలా మాట్లాడారు. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఎదుట జీడీపీ ప్రస్తావన తీసుకొచ్చారు. కేంద్రం 7 శాతం జీడీపీ సాధిస్తే ఆంధ్రపదేశ్‌ మాత్రం 10.28 శాతంతో దూసుకుపోతోందని డబ్బా కొట్టాడు. ఆర్థిక శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న అరుణ్‌జైట్లీ ముందు కేంద్రాన్ని, తన శాఖను తక్కువ చేసి మాట్లాడటం అరుణ్‌ జైట్లీకి ఏమాత్రం రుచించలేదు. దీని పర్యవసానం రాబోయే రోజుల్లో ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  ఎందుకంటే బాబు ప్రవర్తన, ఆయన మీదున్న కేసులు చూపించి కేంద్రం ఇప్పటికే ఆడుకుంటుంది
Back to Top