యాభై రోజులుగా భరిస్తూనే ఉన్నాం

  • ప్రధాని మోడీ నోట్ల రద్దు ప్రకటనకు 50 రోజులు
  • తొలగని కరెన్సీ కష్టాలు
  • నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్యుల పడిగాపులు
  • బడాబాబుల ఇళ్లలో కట్టల కొద్దీ కొత్త నోట్లు
  • కేంద్రం నిర్ణయంతో తీవ్ర ఆర్థిక సంక్షోభం
  • నోట్ల పాట్లు ఇంకెన్నాళ్లో..?
హైదరాబాద్‌:  ‘‘ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాం. దేశం కోసం ఇబ్బందులున్నా 50 రో జులు భరించండి’’  నవంబర్‌ 8వ తేదీన రూ.1000, 500 నోట్ల రద్దు ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలివి. పెద్ద నోట్ల రద్దుతో నల్లధన బాబులంతా మలమలమాడిపోతారని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు కష్టాలే మిగిలాయి. మోదీ ప్రకటన చేసి నేటికీ సరిగ్గా 50 రోజులు. మరి ఈ రోజుతో కరెన్సీ కష్టాలు తీరుతాయా..? అంటే స్పష్టమైన సమాధానం లేదు. నోట్ల రద్దుపై ప్రభుత్వం ఇప్పటికి పలుసార్లు మాట మార్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ప్రపంచ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైంది.  మోదీ నిర్ణయంతో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రధాని  ప్రజలను కోరారు. గడువు ముగిసిన ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది.  గంటల తరబడి బ్యాం కులు, ఏటీఎంల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పటికీ బ్యాంకుల ఎదుట బారులు దర్శనమిస్తూనే ఉన్నాయి.  డిసెంబర్‌ 30 తరువాత సామాన్యుల ఇబ్బందులు తీరు తాయి.. నల్లకుభేరులకు కష్టాలు మొదలవుతాయన్న ప్రధాని పాత ప్రకటనల నేపథ్యంలో.. మరో రెండు రోజుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు వీధిన పడ్డారు. పాత నోట్ల మార్చుకునేందుకు, కొత్త నోట్ల పొందేందుకు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి, రోజుల కొద్ది బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సామాన్యుల కనీస అవసరాలు తీరడం లేదు. ఇలా ఇంకెనాళ్లు తిరిగేదంటూ వయోధి కులు, మహిళలు ప్రశ్నిస్తున్నారు. పెద్దనోట్లు రద్దుచేసి నేటికి 50 రోజులు గడుస్తున్న బ్యాంకుల్లో నగదు ఇవ్వకపోవడంతో రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల ఎదుట క్యూలో నిల బడలేక నానా అవస్థలు పడుతున్నారు. జనవరి నుం చైనా తమ కష్టాలు తీరాలంటూ కోరుకుంటున్నారు. ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో ఉద్యోగాలకు సెలవు పె డుతూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రైవేటు ఉద్యోగులు అంటున్నారు.

మరో రెండు నెలలు పరిస్థితి ఇలాగే..
నవంబర్‌ 9 నాటికి మొత్తం రద్దైన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. డిసెంబర్‌ 30 నాటికి బ్యాంకులకు చేరే మొత్తం రూ. 13 లక్షల కోట్లుగా అంచనా. ప్రస్తుతం వేగంతో కరెన్సీ ముద్రణ కొనసాగిస్తే... మార్చి, ఏప్రిల్‌ 2017 వరకూ ప్రస్తుత పరిస్థితి తప్పదనేది నిపుణుల అభిప్రాయం.  ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రెండు నెలలు అవసరమని ఎస్‌బీఐ చీఫ్‌ అరుంధతి భట్టాచార్య తేల్చి చెప్పారు.

ఆంక్షలు, నిబంధనలతో గందరగోళం
నవంబర్‌ 8న ప్రధాని ప్రకటన అనంతరం కేంద్రం, ఆర్‌బీఐలు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలతో తీవ్ర గందరగోళం సష్టించాయి. పలుమార్లు ఈ నిబంధనలు మార్చారు. నవంబర్‌ 10న బ్యాంకులు, నవంబర్‌ 11న ఏటీఎంలు తెరుచుకున్నా... అప్పటి క్యూలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.వారానికి రూ.24 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఆ తరువాత ఖాతాదారులు విత్‌డ్రా పరిమితిని రూ.24 వేల నుంచి రూ.50వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నగదు కొరత కారణంగా ఖాతాదారుల విత్‌డ్రాలకు సంబంధించి రూ.2 వేలు, రూ.4వేల నుంచి రూ.5 వేలు వరకే ఇవ్వగలుగుతున్నారు. ఆర్బీఐ నుంచి అరకొర నిధులు రాష్ట్రానికి వస్తుండడంతో నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులందరికీ పూర్తి స్థాయి సేవలందించలేక బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. ఒక వైపు ఆర్బీఐ మాత్రం ప్రజలకు సరిపడా నగదు బ్యాంకులకు అందిస్తున్నామంటూ చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. ఏటీఎం కేంద్రాలు తెరుచుకోవడం లేదు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసిన అరకొర ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అయితే అక్కడ నిమిషాల వ్యవధిలో క్యాష్‌ ఖాళీ అవుతోంది. ఏటీఎం కేంద్రాలకు వస్తున్న ఖాతాదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే బ్యాంకులకు వచ్చే ప్రజల రద్దీ తగ్గే అవకాశం ఉంది.  నోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడి ఇంతవరకూ 100 మందికి పైగా మరణించినట్లు అంచనా.మొదట్లో నోట్ల రద్దును నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులపై పోరుగా ప్రధాని అభివర్ణించగా... అనంతరం నగదు రహిత భారత్‌ కోసమంటూ స్వరం మారింది. దేశంలో  దాదాపు 90 కోట్ల మందికి ఇంటర్నెట్‌తో అనుసంధానం లేదు. మరి ఒక్కసారిగా డిజిటల్‌ చెల్లింపులు ఏలా సాధ్యం అన్నదానికి సమాధానం లేదు.

నోట్ల రద్దుపై మాట మార్చిన చంద్రబాబు
ప్రధాని మోడీకి పెద్ద నోట్లు రద్దు చేయమని నేనే చెప్పా... ఇలా చేస్తే అవినీతిని అరికట్టొచ్చంటూ లేఖ నేనే రాశా అని చెప్పుకొన్న ఏపీ సీఎం చంద్రబాబు..ఇప్పుడు అదే పెద్ద నోట్ల దెబ్బకు తల పట్టుకున్నాడు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రుల్లో మొదటగా ఏపీ సీఎం చంద్రబాబే ఉన్నారు.  పెద్దనోట్లు రద్దయిన 40 రోజుల తరువాత కరెన్సీ కష్టాలు అలాగే కొనసాగుతుండటంతో చంద్రబాబు మాట మార్చారు. పెద్ద నోట్లు రద్దు అనే అంశం తమ ప్రభుత్వ నిర్ణయం కాదని అయితే అది అలా జరిగిపోయిందని చంద్రబాబు చెప్పారు. ప్రజలను పెద్ద నోటు దెబ్బ నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.  నోట్ల రద్ద తర్వాత క్యాష్‌లెస్‌ ఎకానమీ కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే . ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు చంద్రబాబు. ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దు టీడీపీ సాధించిన నైతిక విజయంగా ట్వీట్‌ చేశారు బాబు. ఆ తరువాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ప్లెటు మార్చారు. ఏ బ్యాంక్, ఏటీఎం చూసినా క్యాష్‌ లేదన్న బోర్డులే దర్శనమిస్తున్నాయని బాబు అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రోజుకు రెండు గంటలు శ్రమిస్తున్నా ఫలితం మాత్రం దక్కడంలేదని బాబు మొసలి కన్నీరు కార్చారు.  పెద్ద నోట్ల రద్దు పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారైందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెద్దనోటు రద్దుతో ఎదురైన సంక్షోభాన్ని 1984లో జరిగిన ఆగష్టు సంక్షోభంతో పోల్చారు చంద్రబాబు. నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు నాదెండ్ల భాస్కర్‌ రావు వేసిన స్కెచ్‌తో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, దాన్నే 31 రోజుల్లో సరిదిద్దగలిగామని గుర్తు చేశారు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ సంక్షోభాన్ని గట్టెక్కించలేకపోతున్నామని చంద్రబాబు చేతులెత్తేశారు..ప్రధానమంత్రి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం చాలా వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉందని స్వయంగా తెలుగుదేశం ఎంపీలే చెబుతున్నారు. 

బాబుకు ముందే తెలుసా
పెద్ద నోట్ల రద్దు అనే అంశం ఎంత కీలకమైన నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి నిర్ణయం ఏపీ సీఎం చంద్రబాబుకు ముందే తెలియడంతో ఆయన, తన అనుచరులు ముందే పరిస్థితిని చక్కదిద్దుకున్నారు.  దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి పట్టించుకోని ఈ అంశాన్ని చంద్రబాబు పదే పదే ప్రస్తావించడాన్ని బట్టి చూస్తుంటేం ఆయన చొరవతోనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఆయన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు రాక మానవు. నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు చంద్రబాబు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ షేర్లను ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమ్మేశారు. అలాగే తన వద్ద ఉన్న నల్లధనాన్ని విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. బ్లాక్‌ను వైట్‌గా మార్చుకున్నారు. తమిళనాడ రాష్ట్రంలో ఐటీ దాడుల్లో పట్టుబడిన టీటీడీ సభ్యుడు శేఖర్‌రెడ్డి, ఆ రాష్ట్ర సీఎస్‌ రామ్మోహన్‌రావులతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజాగా మెడికల్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా(ఎంసీఐ) మాజీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు, తిరుపతికి చెందిన వైద్యుడు గుణశేఖర్‌యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు చేశారు. నోట్ల మార్పిడి ప్రారంభమైన దగ్గర నుంచి బ్యాంకు అధికారుల అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఓ వైపు సామాన్యులు ఒక్క నోటు కోసం గంటల కొద్ది బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే.. కొదరు బ్యాంకు అధికారులు మాత్రం కట్టల కొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు. బాబు నిత్యం ఆర్‌బీఐ అధికారులతో మాట్లాడుతూ తన అనుయాయుల బ్లాక్‌మనీని వైట్‌గా మార్పిస్తున్నారు.  పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్‌  9 నుంచి డిసెంబర్‌  19 వరకు ఆర్‌ బీఐ రూ.5.92లక్షల కోట్ల కొత్త నోట్లను బ్యాంకింగ్‌  వ్యవస్థలోకి విడుదల చేయగలిగింది. డిసెంబర్‌  10వ తేదీ వరకు రూ.12.4లక్షల కోట్ల నగదు బ్యాంకుల్లో జమ అయ్యాయి. ప్రస్తుతం నగదు డిమాండ్‌ కు సరఫరాకు తేడా ఉండడంతో ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. 

ప్రజా ఉద్యమానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధం
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతోంది. నోట్ల రద్దు ఇబ్బందులపై డిసెంబర్‌ 20న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. నోట్ల రద్దు తదనంతరం పరిణామాలను గవర్నర్‌ దృష్టికి తెచ్చిన వైయస్‌ జగన్‌ కరెన్సీ కష్టాలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మోడీ విధించిన గడువు ముగిసిన తరువాత కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ నేతలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వైయస్‌ జగన్‌ మీడియాతో అన్నారు.  ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయో? ప్రజలు ఆందోళన బాట పట్టక తప్పడం లేదు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
 
Back to Top