"వైయస్ఆర్ కుటుంబం"

  • సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌2 వరకు 
  • 91210 91210 కి మిస్డ్‌ కాల్‌ ఇస్తే సభ్యత్వం
  • 10 మంది సభ్యులతో కూడిన బూత్‌ కమిటీ ఏర్పాటు
  • ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న కమిటీ సభ్యులు 
  • యుద్ధప్రాతిపదికన ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
  • ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజలకు వివరించనున్న కమిటీ 
  • నవరత్నాలపైనా ప్రజలకు అవగాహన 
జననేత వైయస్‌ జగన్‌ కుటుంబ పెద్దగా... వైయస్‌ఆర్‌ అభిమానులు, వైయస్‌ఆర్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే జట్టుగా ఏర్పడి సమస్యలను చర్చించుకుని ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఏర్పడిందే వైయస్‌ఆర్‌ కుటుంబం. అర్హత ఉన్నా పింఛన్, రేషన్‌ కార్డు, ఇల్లు, ఇవ్వకపోవడం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్‌ సరిగా లేకపోవడం వంటి సమస్యలను ప్రధానంగా చర్చించి పరిష్కారానికి కృషిచేయడం జరుగుతుంది. జన్మభూమి కమిటీ ల నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి వైయస్‌ఆర్‌ కుటుంబం చక్కని వేదిక.  ప్రజలెవరూ తమ సమస్యలపై నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగకుండా అక్కడికక్కడే యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిందే  వైయస్‌ఆర్‌ కుటుంబం.  వైయస్‌ఆర్‌ కుటుంబంలో  చేరేందుకు సభ్యులుగా చేరడానికి 91210 91210 నెంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. వెంటనే మీ నెంబర్‌కు వైయస్‌ జగన్‌ నుంచి వాయిస్‌ కాల్‌ వస్తుంది. ఆ తర్వాత మీకు పార్టీ కార్యాలయం నుంచి మరోసారి కాల్‌ వస్తుంది. అప్పుడు మీ సమస్యలను చెబితే ఒక టోకెన్‌ నెంబర్‌ ఇస్తారు. సమస్య పరిష్కారం కాగానే మళ్లీ ఆ నెంబర్‌కు కాల్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2 దాకా ‘వైయస్సార్‌ కుటుంబం’ కార్యక్రమం నిర్వహిస్తారు. 

వైయస్సార్‌ జిల్లా పులివెందులలోని వైయస్‌ఆర్‌ ఆడిటోరియంలో వైయస్‌ఆర్‌ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన ‘వైయస్సార్‌ కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ‘వైయస్సార్‌ కుటుంబం’లో సభ్యులుగా చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమా నులు ఇంటింటికీ వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై శనివారం నుంచి ప్రారంభమైన శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బూత్‌ కన్వీనర్లకు ఈ నెల 11వ తేదీ దాకా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ దాకా రాష్ట్రం లోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. 

ప్రతి గ్రామానికీ సచివాలయం 
‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార వికేంద్రీకరణతో జరిగే విప్లవాత్మక పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌  (సచివాలయం) ఏర్పాటు చేస్తాం. ఈ సెక్రటేరియట్‌లో ఆ గ్రామానికి చెందిన వివిధ సామాజిక వర్గాల వారికి పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. మిస్డ్‌ కాల్‌ ద్వారా తమ సమస్యలు తెలియజేసుకున్న వారి సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారం కోసం ప్రజలెవరూ ఎమ్మెల్యే చుట్టూ, మంత్రుల చుట్టూ తిరక్కుండా అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాటు చేస్తాం’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

బూత్‌ కమిటీలు ఏం చేస్తాయంటే...
వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి ఏ పేపర్లు తీసుకుని పోవాలి? ప్రజలకు ఏం చెప్పాలి? అనే విషయాలను 11వ తేదీ వరకు జరిగే శిక్షణలో వివరించి చెబుతారు. ఈ నెల 11వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు 20 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. గ్రామంలో బూత్‌ కమిటీలో 10 మంది ఉంటే ఒక్కొక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలవాలి. ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడు ప్రతి ఇంట్లో కనీసం 20 నిమిషాలు కూర్చొని వారితో మాట్లాడి బాబు మూడున్నరేళ్ల పాలనకు సంబంధించి తయారు చేసిన 100 ప్రశ్నలకు వారితోనే మార్కులు వేయించాలి. వైయస్సార్‌ హయాంలో జరిగిన మేలును గుర్తు చేయాలి. నవరత్నాల గురించి వివరించాలి. చంద్రబాబునాయుడు మోసాలను, వైయస్సార్‌ హయాంలో జరిగిన అభివద్ధి.. సంక్షేమ పథకాలు, ఆయన స్వర్ణయుగం పాలన గురించి వివరించాలి.  

వైయ‌స్ఆర్ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా
ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు ఆనాడు వైయ‌స్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రాష్ర్టంలో చేప‌ట్టిన అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను బూత్ క‌మిటీ సభ్యులు ఇంటింటికీ తీసుకెళ‌తారు. ఆనాడు మ‌హానేత హ‌యాంలో 
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, రేషన్‌ కార్డు వచ్చేది. గ్రామాల్లో ఇళ్లు లేని వారే లేకుండా చేసేలా ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చిన విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ , అనారోగ్యం వల్ల పేదవారు అప్పుల పాలు కాకుండా ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు స్వర్ణయుగాన్ని త‌ల‌పించాయ‌ని ప్ర‌తి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త గ‌ర్వంగా చెప్పుకునేలా ప‌రిపాలించారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఏమిటి? ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నాడు. ఇల్లు కట్టిస్తామన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే ఇంటికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మూడున్నర సంవత్సరాల్లో ఇంటికి రూపాయైనా వచ్చిందా? ఇంటికి రూ.2 వేలు చొప్పున ఇప్పటికి 40 నెలలకు గాను ఒక్కో కుటుంబానికి రూ.80 వేలు నిరుద్యోగ భృతి బాకీ పడ్డాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే, రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మూడున్నర సంవత్సరాలైంది బంగారం మీ ఇంటికి వచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చిన రుణమాఫీ సొమ్ము వడ్డీకి కూడా సరిపోవడం లేదు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఏ వాగ్దానం కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. ఇలా చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశాడు. త‌దిత‌ర అంశాల‌పై వైయ‌స్ఆర్,  చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌ను పోల్చి చూపిస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. 
Back to Top