నడుస్తూ.. నడిపిస్తూ


– పాదయాత్రలోనే అభ్యర్థుల ప్రకటన
– కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీగా చంద్రమౌళి
– పత్తికొండ నుంచి చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్యకే అవకాశం 
– పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న ఉత్సాహం 


వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్పయాత్రతో ఏపీ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి తెర తీశారు. గత నవంబర్‌ 6న చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఉరకలెత్తే ఉత్సాహంతో అప్రతిహతంగా సాగిపోతోంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. రాయలసీమ నాలుగుజిల్లాలను పూర్తి చేసుకుని నెల్లూరులో అడుగుపెట్టింది. సడలని ఆత్మవిశ్వాసం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. తండ్రి ఆశయ సాధన కోసం చేపట్టిన పాదయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో విసిగి వేసారిన ప్రజలు జననేతకు ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాయకుడిగా వైయస్‌ జగన్‌పై నమ్మకంతో ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. 
 
ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలే అండగా వైయస్‌ జగన్‌ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే విధంగా ప్రజా సంకల్పయాత్రలోనే అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త విధానానికి తెరతీశారు. స్థానిక ప్రజలకు పార్టీ నాయకులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే విధంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజగకవర్గాల్లో ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడంతో ఇదే ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

రాయలసీమలో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన

ఎన్నికలకు ఏడాది ముందుగానే రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌. వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో ఖాళీ అయిన పత్తికొండ స్థానంలో ఆయన భార్యను సమన్వయ కర్తగా నియమించిన వైయస్‌ జగన్‌.. కర్నూలు జిల్లాలో పత్తికొండలో జరిగిన పాదయాత్రలో భాగంగా ఆమెనే పత్తికొండ అసెంబ్లీ స్థానం నుంచి ౖÐð యస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే జిల్లా నుంచి కర్నూలు టౌన్‌ నుంచి మైనారిటీ నాయకుడు హఫీజ్‌ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటింపజేశారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రకొచ్చిన సమయంలో మరో అభ్యర్థిని ప్రకటించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌలిని చంద్రబాబుపై పోటీకి నిలుపుతూ స్వయంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన బోయ, వాల్మీకి కులస్తుల ఆత్మీయ సభలో మరో కీలక ప్రకటన చేశారు. వాల్మీకి, బోయ కులాలకు చెందిన వ్యక్తిని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఒక ఎంపీ స్థానం నుంచి పోటీకి నిలుపుతామని ప్రకటించి ఆయా కులాలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ రెండు కులాలను ఎస్టీల్లో చేరుస్తామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి దారుణంగా మోసం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా కులాలకు రాజకీయంగా అండగా నిలిచే విధంగా వైయస్‌ జగన్‌ చేసిన ప్రకటన బోయలు, వాల్మీకిల్లో సంతోషం నింపింది. 

ఓవైపు పాదయాత్రతో జగన్‌ దూసుకుపోతుంటే ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీని దెబ్బతీసి తద్వారా ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే చంద్రబాబు లక్ష్యం పాదయాత్రకు తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలను చూసి జావగారిపోతోంది. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎంతో సంయమనంతో వైయస్‌ జగన్‌ చేస్తున్న పాదయాత్ర జగన్నాయకుడి దృఢ సంకల్పంపై ప్రజల్లో నమ్మకం కలిగిస్తోంది. ప్రజల్లో కూడా తమకు ఎలాంటి నాయకుడైతే బాగుంటుందో ఒక స్పష్టత వస్తోంది.
Back to Top