బాబుకువిజయసాయిరెడ్డిసవాల్



ఒకప్పుడు హైటెక్ సిటీ పేరుతో అనుయాయులకు అప్పనంగా హైదరాబాద్ ను దోచిపెట్టారు చంద్రబాబు. నేడు రాజధాని పేరు చెప్పి వేల ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులలో కమీషన్ల వరద పారిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి అయినకాడికి దండుకుంటున్నారు. పట్టిసీమ పేరుతో ఉట్టిసీమ కట్టి వందల కోట్లు స్వాహా చేసారు. కాగ్ బైట పెట్టిన నిజాలను కూడా నోరెత్త కుండా నొక్కిపెట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన లక్ష కోట్లకు పైగా నిధులను లెక్కలు చెప్పకుండా మింగేసారు. ప్రత్యేక హోదాను స్వార్థ ప్రయోజనాలకు పణంగా పెట్టేశారు. రాష్ట్రాన్ని భూ బకాసురుల్లా భోంచేసారు. ఇసుకను దోచేసారు. గనులను తవ్వేసారు. ఖనిజాలను కొల్లగొట్టేసారు. భూములను కబ్జాలు చేసేసారు. 
ఇన్ని చేసినా చంద్రబాబును ఎవ్వరూ ఏమీ అనకూడదట. ప్రతిపక్షం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని గురించి ఫిర్యాదు చేయకూడదట...అసలు ప్రతిపక్ష పార్టీ ఎమ్.పిలు కేంద్ర మంత్రులను, ప్రధానిని కలవడం ఓ కుట్ర ట. నిజానికి పట్టిసీమలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ అని తొలుత అన్నది బాబుగారి మిత్ర పక్షమే...దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు...మోదీని విజయసాయి రెడ్డి కలిస్తే 
  చంద్రబాబుకు ఇక్కడ వణుకొచ్చేస్తోంది...ఆ ఉక్రోషంతోనే బాబు విజయసాయి రెడ్డి పదే పదే ప్రధానిని, కేంద్ర మంత్రులనీ కలుస్తున్నారంటూ తెగ ఉడుక్కుంటున్నారు. ఎన్నిసార్లు వెళ్లినా తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్.పికి కలిసే అవకాశం ఇవ్వడమేంటి అని మెలికలు తిరిగిపోతున్నాడు. ఇది బిజెపి, వైఎస్సార్సీపీ కలిసి నాపై పన్నే కుట్ర అని చేతులు నలిపేసుకుంటున్నాడు...

చంద్రబాబు అడ్డగోలు వాదనలకు ఎమ్.పి విజయసాయి రెడ్డి సైతం తీక్షణమైన సమాధానమే ఇచ్చారు. ఓ ఎమ్.పి ప్రధానిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబును జైలుకు పంపేత వరకూ నిద్రపోనని శపథం చేసారు. బాబుని కోర్టు బోను ఎక్కించేదాకా ప్రధానిని కలుస్తూనే ఉంటానన్నారు. అందుకు బాబుకు భయమెందుకేస్తోందని ప్రశ్నించారు. అవినీతి లేకపోతే ఎంక్వైరీకి బాబు ఎందుకు భయపడుతున్నట్టని ఎద్దేవా చేసారు. కేంద్రం నాలుగేళ్ల లో ఇచ్చిన సొమ్ము అంతా ఏమైందో చెప్పాలని, ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి నిజం కాదా అని మండిపడ్డారు..వారం రోజుల్లోగా చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని నిరూపించుకోకపోతే ఆయన తాను అవినీతి పరుడని ఒప్పుకున్నట్టే అని సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి. 

ధైర్యానికి మచ్చుతునక

గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసుకోమని చెప్పారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్సార్ మరణం తర్వాత అక్రమ కేసులతో అరెస్టు చేసినా ధైర్యంగా నిలబడి పోరాడారు వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి. నీతిలో నిప్పును, తుప్పట్టని ఇనప ముక్కను అని చెప్పుకునే బాబు మాత్రం దర్యాప్తు సంస్థల పేరు చెబితే దడదడ లాడుతున్నాడు. నామీద ఎంక్వైరీ ఎలా వేస్తారు, ఎందుకు వేస్తారు, వేస్తే మా వాళ్లు ఊరుకోరు అంటూ నీళ్లు నములుతున్నాడు. విలువలు అనే మాటకు వలువలు లేకుండా చేసిన చంద్రబాబు త్వరలో తన అవినీతి చర్యలకు చట్టానికి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది అని మరిచిపోకూడదు.

 


 

Back to Top