విద్యార్థులకు బాబు వల

చంద్రబాబులా మాట్లాడేవాళ్లనే నోరా
తాటిమట్టా అని తిడతారు ఊళ్లలో.
తిట్టిన నోటితో పొగడటం, పొగిడిన నోటితో తిట్టడం
బాబు నాలిక్కే చెల్లింది. ఇంతటి నాలుక మడత యవ్వారం ఉన్న నాయకుణ్ణి
ఇంకెక్కడా చూడలేం. నిన్నచెప్పింది ఇవ్వాళ, నేడు చెప్పింది రేపు మార్చి మాట్టాడగల మహానుభావుడెవరంటే ఒక్క చంద్రబాబే.

 

హోదా అంటే జైలుకే
అని

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం
అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నాడు.
హోదా గురించి గొంతు చించుకుని మరీ ప్రజల్లోకి వెళ్లాడు. హోదా వల్ల యువత భవిత బాగుంటుందని అరటిపండు వలిచినట్టు అందరికీ అర్థం అయ్యేలా
చెప్పాడు. ఊరూరా తిరిగి, విద్యార్థులందరినీ
కలిసి హోదా మీ హక్కు, మీ భవిష్యత్తుకు అదే దిక్కు అని నిజాన్ని
తెలియజెప్పాడు. అప్పుడు చంద్రబాబుకు వళ్లంతా కారం రాసినట్టైంది.
అసలే కుర్రకారు. హోదా కావాల్సిందే, బాబు దాన్ని తేవాల్సిందే అని నినదిస్తే నోరు మూయండి అని అన్నాడు. ఆట్టే హోదా గురించి మాట్టాడితే జైల్లో తోస్తా అని బెదిరించాడు. యువభేరీలకు వెళ్లే విద్యార్థులను వేధించాడు. కాలేజీల్లో
అంటెడెన్సులు ఉండవని, కాలేజీ యాజమాన్యాలతో ఒత్తిడి చేయించాడు.

ఇప్పుడు బాబు నాలక్కు నరం మళ్లీ
తెగింది. హోదా
కోసం ఆహోరాత్రాలు శ్రమిస్తుంది తానే అని యువతను, విద్యార్థులను
నమ్మిస్తేగానీ దిక్కుండదని చంద్రబాబుకు అర్థం అయ్యింది. జైల్లో
పెడతా అన్న నోటితోనే వర్సిటీల్లో మీటింగ్ పెడతా అని అంటున్నాడు. హోదా వల్ల పరిశ్రమలు వస్తాయని ఎక్కడ రాసుందో చెప్పండి అని గద్దించిన పెద్దమనిషి,
హోదా కోసం చర్చిద్దాం రమ్మని యూనివర్సిటీలకొస్తానంటున్నాడు. ఇంత సిగ్గుమాలినతనం, నోరుజారుడుతనం ఎక్కడైనా ఉంటుందా.
అందుకేనేమో మొన్న పోసాని అన్నాడు చంద్రబాబు ఒక వగలాడి, మాయలాడి అని.

 

విద్యార్థుల
సమస్యలు పట్టించుకోకుండా

ఒక్క హోదా అని ఏముంది విద్యార్థులకు, యువతకు సంబంధించిన ఏ సమస్యనూ
చంద్రబాబు పట్టించుకోలేదు. ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేయలేకపోయాడు.
మా చదువులు కాపాడండని కన్నీరు పెట్టుకున్న వారిని కర్కశంగా బైటకు గెంటించాడు.
యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి బలైన దళిత విద్యార్థినికి న్యాయం చేయలేకపోయాడు.
నిరుద్యోగులకు ఉపాధి చూపలేకపోయాడు. చివరకు వారికి
ఇస్తానన్న భృతిని 4 ఏళ్లుగా తొక్కిపెట్టి, ఎన్నికల సమయం దగ్గరకొచ్చేసరికి ఇంటికొక్కరికి, తలకి వెయ్యి
రూపాయిలే అని కొర్రీల లెక్కలేయడం మొదలెట్టాడు. అందితే జుట్టు,
అందకపోతేకాళ్లు అన్న తరహాలో చంద్రబాబు వ్యవహారాన్ని చూసి విద్యార్థులు
అసహ్యించుకుంటున్నారు. ఎన్నికల ముందు సైతం చంద్రబాబు తన ఎల్లో
మీడియా ఛానెల్ తో కలిసి విద్యార్థులను బుట్టలో వేయాలనుకున్నాడు. కానీ ప్రతిచోటా చంద్రబాబుకు చుక్కెదురైంది. అందుకే రుణమాఫీ,
బంగారం విడిపించడం, నిరుద్యోగ భృతిలాంటి దొంగ హామీలను
పట్టుకుని గట్టెక్కేసాడు. నేడు మళ్లీ అదే విద్యార్థులతో సమావేశాలు
చేయాలంటూ చంద్రబాబు చెప్పడం చూస్తే అధికారం కోసం బాబు ఎంతగా దిగజారగలడో అర్థం అవుతుంది.
ఇక వర్సిటీ మీటింగుల్లో చంద్రబాబును కడిగేయడానికి విద్యార్థిలోకానికి
కూడా ఓ అవకాశం దొరికినట్టైంది అనుకుంటున్నారు బాబు స్టేట్ మెంట్ విన్న నెటిజన్లు.

 

 

 

 

 

Back to Top