విజయం మనదే

– అధినేత ఆజ్ఞలు శిరసావహించిన కార్యకర్తలు
– పోలీసులు దాడులకూ వెరవని ఉద్యమం
– శాంతి ర్యాలీని సంయమనంతో నిర్వహించి జేజేలు అందుకున్న వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు
– శాంతిభద్రతలకు విఘాతం అన్న ప్రభుత్వానికి చెంపపెట్టు 

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేసిన శాంతిర్యాలీ విజయవంతమైంది. ప్రతిజిల్లాలోనూ కార్యకర్తలు, పార్టీ నాయకులు శాంతి ర్యాలీలో పాల్గొని ప్రత్యేక హోదా కావాలని నినదించారు. విద్యార్థులను కేసులు, అరెస్టుల పేరుతో భయపెట్టాలని చూసినా యువత ఎక్కడా వెనక్కు తగ్గలేదు. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని ర్యాలీ జరగకుండా చూడాలని చూసినా కార్యకర్తలు సంయమనం పాటించారు. ప్రోటోకాల్‌ పాటించకుండా, ప్రతిపక్ష నాయకుడు, ఎంపీలు ఉన్నారన్న కనీస గౌరవం లేకుండా చేసిన అరాచకాన్ని చూసి కూడా ఆత్మవిశ్వాసంతో ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కార్యక్రమాన్ని పూర్తి శభాష్‌ అనిపించుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం ఆరోపించినా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా శాంతి ర్యాలీని శాంతియుతంగా నిర్వహించారు. పోలీసులు గూండాల్లాగా మారి లాఠీలతో దాడి చేసినా యువత ఎక్కడా అసహనం ప్రదర్శించలేదు. అన్ని బాధలను, దెబ్బలను ఓర్పుతో భరించారు తప్ప ఎక్కడా ప్రతిఘటించలేదు. అక్కడే సగం విజయవంతం అయ్యారు. అందుకే సర్కారుకు ఏం చేయాలో తోచలేదు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా ఎక్కడా చలించలేదు. సహనం కోల్పోలేదు. నాయకుడు అందించిన స్ఫూర్తితో ముందుకు కదిలారు. నేనూ మీతో నడవడానికి వైజాగ్‌ వస్తున్నా అనే మాటతోనే వెయ్యి ఏనుగుల బలం కూడదీసుకని.. పట్టరాని సంతోషంతో ముందుకు కదిలారు. 

కూరగాయల ధర పెరిగిందని ధర్నా..హోదా మాత్రం వద్దట
ప్రతిపక్షంలో ఉండగా కూరగాయల ధర పెరిగినా, రోడ్లు మరమ్మతులు చేయకపోయినా, ఒక పూట నల్లాల్లో వాటర్‌ రాకపోయినా ధర్నా చేసిన చంద్రబాబుకు ఇప్పుడు మాత్రం రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ప్రత్యేక హోదా పెద్ద విషయంగా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా పదేళ్లుకాదు పదిహేనేళ్లు కావాలని గగ్గోలు పెట్టిన చంద్రబాబు తీరా గెలిచాక ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది అనే స్థాయికి దిగజారిపోయాడు. మాట్లాడితే సినీయరిటీ పేరు చెప్పుకునే బాబుకు విపక్ష నేతతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా పోయింది. అమ్మ తాను పెట్టదు.. అడుక్కోనివ్వదూ అన్నట్టుగా తయారైంది ఏపీలో వ్యవహారం. చంద్రబాబు తానెలాగూ అడగలేడు. కేంద్రాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాన్ని గొంతెత్తనీయడు. కలిసి పోరాడదాం రమ్మంటే రాడు. కేసులకు భయపడి కేంద్రంతో లాలూచీ పడి ప్రత్యేక హోదా వద్దనే అధికారం ఆయనెకెవరిచ్చారు..?. ప్రత్యేక హోదా బాబు సొంత నిర్ణయం కాదు. ఐదున్నర కోట్ల మంది ఆకాంక్ష.. భవిష్యత్తు. అలాంటిది ఒక్క వ్యక్తి సొంత లాభం కోసం ఏపీ భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని నిన్నటి శాంతిర్యాలీతో చంద్రబాబుకు తెలిసొచ్చింది. 

కళ్లు మూసుకుపోయిన పచ్చమీడియా 
ర్యాలీ కోసం విశాఖకు చేరుకున్న వైయస్‌ జగన్‌ను అరెస్టు చేసే వరకు పచ్చ మీడియాకు ఏం జరగుతుందో పట్టనేలేదు. ఈ ఏడాదే ఉన్నట్టుండి ‘దేశ’భక్తి పుట్టుకొచ్చింది. ఎప్పుడూ ఒక గంట పాటు గవర్నర్, సీఎం, ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాలు చూపించి చేతులు దులుపుకునే పచ్చ మీడియా పూనకం వచ్చినట్టుగా ఉదయం నుంచీ రిపబ్లిక్‌డే ఉత్సవాలు తప్ప మరేం చూపించలేదు. ఆఖరుకు జల్లికట్టు వంటి ఒక్కరోజులో జరిగే ఆటకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా సొంత రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి ఇవ్వకపోవడం దౌర్భాగ్యం.  వైయస్‌ జగన్‌ను అరెస్టు చేయకపోయుంటే.. అది కూడా అసలు చూపించేదే కాదు. ఆయన విశాఖ వెళ్తున్నాడు కాబట్టి ఆ మాత్రమన్నా ఫోకస్‌ పెట్టింది. లేకుంటే ప్రత్యేక హోదా వారికి అసవరమే లేదు. పైగా ప్రతిపక్ష నాయకుడితో ప్రవర్తించాల్సిన తీరుతో కాకుండా పోలీసులు గూండాల్లా వ్యవహరించినా వారికి కనింపించలేదు కానీ వైయస్‌ జగన్‌ అనని మాటలను కూడ అన్నట్టుగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలనే దరిద్రపు రాజకీయాలు చేయడం  దారుణాతి దారుణం. 
Back to Top