న్యాయ దేవ‌తా..మ‌న్నించు..!

() భార‌త దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన ఘ‌ట‌న‌
() ప‌చ్చ పార్టీ పైత్యానికి ప్ర‌ద‌ర్శ‌న‌
() కోర్టుల్ని విచారించే రాజ‌కీయ నాయ‌కులు
హైద‌రాబాద్‌) భార‌త ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లోనే అరుదైన పోక‌డ‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెర దీస్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీని వేధించ‌ట‌మే ఏకైక అజెండాతో అసెంబ్లీలో సాగిస్తున్న దుర‌హంకార వైఖ‌రికి ఇది ప‌రాకాష్ట‌. ఇందుకోసం న్యాయ‌స్థానాల్ని హేళ‌న చేయ‌టం ఆయ‌న‌కే చెల్లింది. హైకోర్టు ఏమి చేయాలో, ఏమి చేయ‌కూడ‌దో తెలుగుదేశం నాయ‌కులు కూర్చొని విచార‌ణ చేసి తీర్పు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌ట‌మే సోమ‌వారం నాటి స‌భ‌లో వైచిత్రి.

పాత్ర‌లు వేరైనా సూత్ర‌ధారి చంద్ర‌బాబే
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో ర‌గ‌లిపోతున్నారు. ఎమ్మెల్యే రోజాను శాస‌న‌స‌భ‌లో అడుగు పెట్ట‌నీయ‌కూడ‌ద‌న్న క‌క్ష‌తో హైకోర్టు తీర్పుని ప‌క్క‌న పెట్టేశారు. మ‌హిళా ఎమ్మెల్యేను అసెంబ్లీ ఎదుట నుంచోపెట్టేశారు. అధికారం, మంది బ‌లం ఉన్నాయ‌న్న అహంకారంతో అడుగులు వేస్తున్నారు. అందుకే రోజాను శాస‌న‌స‌భ‌నుంచి ఏక‌గ్రీవంగా స‌స్పెండ్ చేశామ‌ని స్పీకర్ తో చెప్పించారు. కానీ, అక్క‌డ ప్ర‌తిపక్షం దీన్ని మూకుమ్మ‌డిగా వ్య‌తిరేకించింది. అంటే అది ఏక‌ప‌క్షంగా తీసుకొన్న నిర్ణ‌య‌మే త‌ప్ప ఏక‌గ్రీవం కానే కాదు.

ఇప్పుడు కూడా స‌భ‌పేరుతో డ్రామా
సోమవారం నాడు ఎమ్మెల్యే రోజా విష‌యంలో ఏం చేయాలి అంటూ స్పీక‌ర్ గారు ప్ర‌శ్నించటం ఖాయం. అంటే అదేదో స‌భ నిర్ణ‌యించాల్సిన అంశం మాదిరిగా దీనికి రంగు, రుచి, వాస‌న అద్దే ప్ర‌య‌త్నం అన్న‌మాట‌. అయితే ఏకైక ప్ర‌తిప‌క్షం వైఎస్సార్సీపీ స‌భ‌కు దూరంగా నిలుస్తోంది కాబ‌ట్టి ఉన్న‌ది అధికార తెలుగుదేశం, దాని బాట‌లో న‌డిచే బీజేపీ. అందుచేత స్పీక‌ర్ గారు ఈ ప్ర‌శ్న అడ‌గ‌గానే ఘ‌న‌త వ‌హించిన పచ్చ‌నేత‌లంతా లేచి, ఎమ్మెల్యే రోజా మీద తిట్లు తిట్టి, ప‌నిలో పనిగా ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గన్ ను, విప‌క్ష ఎమ్మెల్యేలను పోటీ ప‌డి తిట్టేసి, ఆమె మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరటం జ‌రుగుతుంది. దీని మీద బాధాత‌ప్త హృద‌యంతో స్పీక‌ర్ గారు ఆమోదించిన‌ట్లు, ఎప్ప‌టిలాగే ఇదిస‌భ మొత్తం తీసుకొన్న నిర్ణ‌యంగా ప్ర‌కటించ‌టం అన్న‌ది చంద్ర‌బాబు నాయుడు అనుస‌రించ‌బోయే స్క్రిప్ట్. అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప‌, లేదంటే.. ఇటువంటి ప‌రిణామాలే చోటు చేసుకొంటాయ‌న్న మాట బ‌లంగానే వినిపిస్తోంది. 

హైకోర్టు మీద విచార‌ణ‌
అసెంబ్లీ కి మాయ‌ని మ‌చ్చ‌లా మిగిలిపోయే మ‌రో స‌న్నివేశం. హైకోర్టు చేయాల్సిన లేక చేసిన ప‌ని గురించి అసెంబ్లీలో ప‌చ్చ త‌మ్ముళ్లు విచార‌ణ చేస్తార‌న్న మాట‌. మ‌హిళా ఎమ్మార్వో వ‌న‌జాక్షిని కొట్టించిన చింత‌మ‌నేని, కొడుకు చేత లేడీటీచ‌ర్ కొంగు లాగించిన మంత్రి రావెల కిశోర్‌, కొడుకు చేత కాలేజీ పిల్ల‌ల్ని చంపించిన బోండా ఉమ వంటి వారంతా క‌లిసి న్యాయ దేవ‌త మీద తీర్పు రాయ‌బోయే సంఘ‌ట‌న‌. ఇందుకోసం ఇప్ప‌టికే టీడీపీ నేత‌లంతా స్క్రిప్ట్ డైలాగ్ లు రాసుకొని తెచ్చుకొని ఉంటారు. ఏది చేసినా చంద్ర‌బాబు చాలా చాలా మంచి నాయ‌కుడు అని పొగిడేందుకు, న్యాయ‌వ్య‌వ‌స్థ మీద త‌ప్పంతా రుద్దేందుకు సిద్ధ‌ప‌డిన ఘ‌ట‌న ఇది. అందుకే ఇటువంటి వైప‌రీత్యాల‌కు దూరంగా ఉండాల‌ని వైఎస్సార్సీపీ నిర్ణ‌యించింది. న్యాయ‌దేవ‌తా..మ‌న్నించు


తాజా వీడియోలు

Back to Top