వెన్నుపోటుకు 20 ఏళ్లు..!

* ఆగ‌స్టు నెల‌లోనే చంద్ర‌బాబు కుట్ర‌
* ఎన్టీయార్ ను దించిన‌ది ఈ నెల‌లోనే
* ఎల్లో మీడియా ద్వారా జ‌రిగిన కుట్ర‌
హైద‌రాబాద్‌ :
కాంగ్రెస్ వ్య‌తిరేక నినాదం, తెలుగువారి ఆత్మ‌గౌర‌వ సిద్దాంతంతో
రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి చ‌రిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు కు
వెన్నుపోటు పొడిచి 20 ఏళ్లు పూర్త‌యింది. పిల్ల‌నిచ్చిన మామ గారిని ప‌ద‌వి
నుంచి దింపి దొడ్డిదారిన ప‌ద‌విని అధిష్టించిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. ఆ వేద‌న
తోటే ఏడాది తిర‌గ‌కుండానే ఎన్టీయార్ క‌న్ను మూయ‌డం ఒక విషాద వీచిక‌.

1994
లో తిరిగి అధికారాన్ని ద‌క్కించుకొన్న ఎన్టీ రామారావు త‌న‌దైన శైలిలో
ప‌రిపాల‌న సాగించారు. గ‌తంలో పూర్తిగా చంద్ర‌బాబు గుప్పిట్లో చిక్కుకొన్న
పార్టీని నెమ్మ‌దిగా విడిపించ‌టం మొద‌లెట్టారు. రెవిన్యూ ఆర్థిక మంత్రిగా
వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబుకి ఇది గిట్ట‌లేదు. దీంతో కొంద‌రు
ఎమ్మెల్యేల‌ను వైస్రాయ్ హోట‌ల్ లో దింపి అక్క‌డ క్యాంపు ఏర్పాటు చేశారు.
10-15 మంది కూడా లేక‌పోయిన‌ప్ప‌టికీ, అక్క‌డ బోలెడు మంది ఎమ్మెల్యేలు
ఉన్నారంటూ ప్ర‌చారం చేశారు. ఇది నిజ‌మ‌ని న‌మ్మిన ఎమ్మెల్యేలు
ఒక్కొక్క‌రుగా అక్క‌డ‌కు చేరుకొన్నారు. దీంతో నిజంగానే అనేక మంది
ఎమ్మెల్యేలు అక్క‌డ‌కు చేరిన‌ట్ల‌యింది.

ఈ సంగ‌తి
తెలుసుకొని అక్క‌డ‌కు చేరుకొన్న ఎన్టీయార్ కు తీర‌ని అవ‌మానం ఎదురైంది.
న‌డి రోడ్డు మీద ఎన్టీయార్ కాన్వాయ్ మీద చెప్పులు విసిరారు. ఎన్టీయార్
నుంచి ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని వేరు చేశారు. ఆయ‌నకు నిలువ నీడ కూడా లేకుండా
చేశారు. ఎన్టీయార్ గురించి ఎల్లో మీడియాలో తప్పుడు క‌థ‌నాలు రాయించారు.
చివ‌ర‌కు అదే మీడియాతో ఎన్టీయార్ కు తీవ్ర క్షోభ క‌ల్పించారు. 

ముఖ్య‌మంత్రిగా
ప‌దవి తీసుకొన్నాక కూడా చంద్ర‌బాబు క‌క్ష చ‌ల్లార‌లేదు. ఎక్క‌డ ఎన్టీయార్
ఫోటోలు, పేర్లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకొన్నారు. కానీ 2003 ఎన్నిక‌ల్లో
చ‌తికిల ప‌డ్డాక మాత్రం ఎన్టీయార్ పేరు తిరిగి వాడుకోవ‌టం మొద‌లెట్టారు.
ఎన్టీయార్ నుంచి ప‌ద‌విని, పార్టీని దూరం చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణ‌మైన
చంద్ర‌బాబు, ఆయ‌న మ‌ర‌ణానంతరం మాత్రం ఆయ‌న విగ్ర‌హానికే పూల‌మాల‌లు
వేస్తుంటారు.
Back to Top