వెన్నుపోటు ’నారా’జకీయం


చరిత్ర కొన్ని గుర్తులను శిలాక్షరాలుగా లిఖిస్తుంది. అందులో కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు, కొన్ని యుద్ధాలు, కొన్ని వెన్నుపోట్లు. ఎన్టీఆర్ అఖండమైన వెలుగును మసకబార్చి, మనో వ్యధతో ఆయన మరణానికి కారణమైన సంఘటనలకు బీజం ఈ ఆగస్టు నెలలోనే పడింది. ప్రతి చర్యకూ ఓ కారణం ఉన్నట్టే ఎన్టీఆర్ చరిత్రలో సంక్షోభానికి కారణం పేరు చంద్రబాబు నాయుడు. దొంగదెబ్బ తీయడం, నమ్మించి గొంతు కోయడం, వెన్నుపోటు పొడవడం వంటి లక్షణాలకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబును చరిత్ర గుర్తుంచుకునేలా చేసిన సందర్భమిదే. 23 ఏళ్ల క్రితం ఇదే ఆగస్టు నెలలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, అధికారం హస్తగతం చేసుకున్నాడు చంద్రబాబు.  
1995లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో శ్రీకాకుళం పర్యటనలో ఉన్నారు. అంతకు ముందే ఎన్టీఆర్ మాటను ధిక్కరించిన ఎమ్మెల్యేల్లో 8 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. 1988లో మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసినట్టుగా 35 మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సస్పెండ్ చేస్తారే పుకార్లు పుట్టించాడు చంద్రబాబు. 

1995 ఆగస్టు 20న మంత్రులు కడియం శ్రీహరి, గోడె నగేష్ లను బర్తరఫ్ చేసారు. ఈ ఇద్దరూ చంద్రబాబు అనుచరవర్గమే. దీన్నే కారణంగా చూపిస్తూ అసమ్మతిని లేవదీశాడు చంద్రబాబు. ఇదే వైశ్రాయి అంకానికి తెరతీసింది. ఒకరికి తెలియకుండా ఒకరిని వైస్రాయికి రప్పించి, ఎన్టీఆర్ వచ్చి వారిని పిలుస్తున్న విషయాన్ని కూడా వారికి తెలియనీయకుండా దాచి చరిత్ర చూడని నీచరాజకీయం చేసాడు చంద్రబాబు. బసంత్ టాకీస్ లో మినీ మహానాడు పెట్టి ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ చేతే పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎన్టీఆర్ ను తప్పిస్తూ తీర్మానాన్ని చేయించాడు. ఆ తీర్మానం చదువుతూ హరికృష్ణ ఏడుస్తుంటే చంద్రబాబు, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి ఓదార్పులు చేసారు. ఆ తర్వాత చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. 

వైస్రాయ్ హోటల్ నే కాంపు కార్యాలయంగా మార్చి, అక్కడి నుంచే ఎమ్మెల్యేలను రాజ్ భవన్ కు తీసుకువెళ్లి గవర్నర్ ముందు బల నిరూపణ చేయించుకున్నాడు. 1983 నుండి 1989 వరకూ ఎన్టీఆర్ ప్రతి కాబినెట్లోనూ మంత్రిగా కొనసాగిన యనమల రామకృష్ణుడు అప్పటి స్పీకర్. చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో ఆయనా సహకరించాడు. మినీమహానాడు తర్వాత చంద్రబాబును టిడిఎల్పి నాయకుడిగా గుర్తించి, తర్వాత గవర్నర్ వద్ద ఎమ్మెల్యేల లెక్కింపు కూడా చేసారు. అవమానకర రీతిలో ఎన్టీఆర్ ను గద్దెదింపారు.

చివరకు అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో మాట్లాడేందుకు ఎన్టీఆర్ కు అనుమతి కూడా ఇవ్వలేదు. ఎన్టీఆర్ వర్గంలో ఉన్న 34 మంది ఎమ్మెల్యేలనూ సస్పెండ్ చేసారు. తిరిగి ఎన్నికల్లో బలం పుంజుకోకుండా కుట్రలు చేసారు. మనోవ్యధతో మూడునెలలకే మరణించే పరిస్థితికి కారణమయ్యారు. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు అందరినీ ఎన్టీఆర్ కి దూరం చేసి, ఆయన నమ్మిన నాయకులనే ఎదురు తిరిగేలా చేసి, తిరుగుబాటును లేవదీసి ఎన్టీఆర్ కు రాజకీయ జీవితానికి పులిస్టాపును పెట్టేసాడు చంద్రబాబు. పిల్లనిచ్చిన మామను, రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడిని వంచించి భారతంలో శకుని కంటే మించిన దుశ్శకునిగా చరిత్రలో నిలిచిపోయాడు చంద్రబాబు.    
 
Back to Top