వైయస్‌ఆర్‌ వెలిగల్లుతో గాలివీడు సస్యశామలం

–జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టును మొదలు పెట్టిన వైయస్‌ఆర్‌
–నేడు ఆ ఫలాలు ఆందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం

గాలివీడు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందు చూపుతో నేడు రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. జలయజ్ఞంలో భాగాంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టుతో రాయచోటి ప్రాంత వాసులకు త్రాగునీరు, గాలివీడు ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందుతోంది.

వైయస్‌ఆర్‌ వెలిగల్లు ప్రాజెక్టు పనులను శరవేగంగా పనులు పూర్తి అయ్యేందుకు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ప్రస్తుత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు దగ్గర ఉండి మూడు సంవత్సరాల కాలంలోనే పనులను పరివేక్షించడంతో జలాశయం నిర్ణీత సమయంలో పూర్తి అయ్యింది. 2004లో ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణం, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వద్ద ప్రత్యేకంగా కావాల్సిన నిధులను మంజూరు చేయించి 2008లో ముగిసింది. జలయజ్ఞంలో పూర్తి అయిన మొదటి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. అనంతరం జలాశయాన్ని ప్రారంభించిన అప్పటి సీఎం వైయస్‌ఆర్‌ ఈప్రాజెక్టును జాతికి అంకితం చేసి కుడికాలువలకు నీళ్లు వదిలారు.

రూ.24వేలు ఎకరాలకు సాగు నీరు ఆయకట్టు :
ప్రాజెక్టు కింద 24వేలు ఎకరాల ఆయకట్టు పరిధి ఉండడంతో కుడి , ఎడమ కాలువల ద్వారా కొన్ని గ్రామాల రైతులు పంటలకు నీటిని వినియోగించుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 9 గ్రామాలలో రైతాంగానికి వ్యవసాయ పంటలకు సాగు నీటికి ఇబ్బందులు లేకుండా కుంటలు, చెరువులు జల కళలాడుతున్నాయి. దీంతో ఈ ప్రాంత రైతులు సాగు చేసిన వరి , వేరుశెనగ , కూరగాయల పంటలు సైతం బాగా పండుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైయస్‌ ముందు చూపుతోనే సస్యశామలం :
జలయజ్ఞంలో భాగంగా గాలివీడు మండలంలో వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.200కోట్లు పైచిలుక నిధులు విడుదల చేసి , కేవలం మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేశారు. రాయచోటి పట్టణ ప్రజలకు ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తుండడంతో, తమ నీటి కష్టాలు తగ్గాయని, దివంగత ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి పనులపై ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న చొరవ వల్లె పంటలు చేతికి అందుతున్నాయి : సుధాకర్‌నాయుడు( రైతు), గుండ్లచెరువు, గాలివీడు మండలం.
మహానేత రాజశేఖర్‌రెడ్డి చొరవతో ప్రాజెక్టు పూర్తి అయింది. దీంతో మా కష్టాలు తీరాయి. ప్రాజెక్టులో నీరు ఉండడంతో ఈ ప్రాంతంలోని బోర్లలలో నీటి మట్టం పెరిగింది. పంటలు ఎండిపోతున్న సమయంలో ప్రాజెక్టు కుడి , ఎడమ కాలువల ద్వారా నీటిని అందించడంతో ఎండిపోతున్న పంటలు చేతికి వచ్చాయి. సంవత్సరానికి మూడు పంటలు పండిస్తున్నాము. ఇదంతా వైయస్, గడికోట కుటుంబాల పుణ్యమే.

Back to Top