రేపు విశాఖలో వంచన దీక్ష

విభజించి పాలించు అనే విధానం బ్రిటిష్  పాలకులదైతే...వంచించి పదవి సాధించు అనేది చంద్రబాబు ఫండా. ఆ వంచన సాగిస్తూనే తన రాజకీయ చరిత్రను స్వయంగా రాసుకున్నాడు చంద్రబాబు. నమ్మి పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, పార్టీని కబ్జా చేసాడు. ఎన్టీఆర్ పై అసత్యాలు  ప్రచారం చేసి ప్రజల్ని వంచించాడు. 9 ఏళ్ల పాలనలో రాష్ట్రం లో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులను వంచించాడు. ప్రభుత్వద్యోగుల పై కక్షసాధింపు లు చేస్తూ అధికారులను వంచించాడు. అమెరికా అధ్యక్షులను పిలిచి, ప్రపంచ బాంకుని మెప్పించి, కోట్ల అప్పుల్లో ప్రజల్ని ముంచి రాష్ట్రాన్ని వంచించాడు.10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెడితే, మారిపోయానని మరోసారి మోసగించాడు. 
కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడి కళ్ళముందే వంచనకు పాల్పడ్డాడు. 
అవిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వంచన చేసింది చాలక, విభజన లేఖతో సీమాంధ్రులను దారుణంగా వంచించాడు... 
రుణ మాఫీ అన్నాడు..తాకట్టు బంగారం తెస్తా అన్నాడు. ఉద్యోగాలన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. అమరావతి అంతర్జాతీయ రాజధాని అన్నాడు... 15 ఏళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాడు...అది తేగలిగిందీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగింది నేనే అని అన్నాడు. ఆఖరుకు అందర్నీ వంచించాడు. హోదాను ప్యాకేజి కోసం తాకట్టు పెట్టాడు. ప్యాకేజి ఇచ్చిన వారికి హారతులు పట్టాడు. వద్దన్న ప్రతిపక్షానికి అభివృద్ధి నిరోధకులనే పేరు పెట్టాడు. 
ఇంత వంచన నీ తట్టుకుని నేడు ప్రత్యేక హోదా తెలుగు వారి హక్కు అని రాష్ట్రం అంతా ఏక తాటిపై నిలబడితే హోదా కోసం నేను పోరాటం చేస్తున్నా అంటూ మరో వంచనకు తెర తీస్తున్నాడు. 

ఏ తిరుపతి సభలో ఈ నయవంచనకు నాంది పడిందో, అక్కడే మరోసారి అదే వంచనకు రంగం సిద్ధం అవుతోంది...
చంద్రబాబు కుట్రలు భగ్నం చేసేందుకు, కేంద్రం హోదాపై తన మాటను నిలబెట్టుకునేలా చేసేందుకు దీక్షాబద్ధమైంది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్మోహన రెడ్డి గారి సారధ్యం లో బాబు మోసాలను ఎండగడుతూ తిరుపతి సభ జరిగే అదే రోజు విశాఖలో వంచన వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులన్నీ ఇందులో పాల్గొంటున్నాయ్. ఉదయం 7 గంటల నుండీ రాత్రి7 గంటల వరకూ అంటే 12 గంటల పాటు ఈ దీక్ష సాగనుంది...బాబు వంచన వైఖరికి ఇదో గుణపాఠం.

తాజా వీడియోలు

Back to Top