వాడుకొని వ‌దిలేయ‌టంలో కాంగ్రెస్ త‌ర్వాతే ఎవ‌రైనా..!

అనంత‌పురం : కాంగ్రెస్ పార్టీ ఎవ‌రినైనా అవ‌స‌రం ఉన్నంత వ‌ర‌కు వాడుకొని, త‌ర్వాత ప‌క్క‌న పెట్టేస్తుంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. అనంత‌పురం జిల్లాలో రైతు భ‌రోసా యాత్ర సాగిస్తున్న వైఎస్ జ‌గ‌న్..రాహుల్ గాంధీ ప్ర‌క‌ట‌న మీద స్పందించారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చివ‌రి బొట్టు దాకా ఇందిరా గాంధీ కుటుంబం కోసం క‌ష్ట ప‌డ్డార‌ని గుర్తు చేశారు.వైఎస్సార్ బ‌తికి ఉన్నంత కాలం ఆయ‌న్ని గొప్ప‌వాడ‌ని కాంగ్రెస్ వాళ్లు పొగిడార‌ని వివ‌రించారు. కాంగ్రెస్ లో కొన‌సాగినంత కాలం వైఎస్ జ‌గ‌న్ ను కూడా మంచివాడ‌న్నార‌ని ఆయ‌న తెలిపారు. కానీ వైఎస్సార్ కోసం ప్రాణాలు వ‌దిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేస్తానంటే మాత్రం చెడ్డ‌వాడ‌న్నారని ఆయ‌న వివ‌రించారు. చంద్ర‌బాబుతో క‌లిసి కాంగ్రెస్ పార్టీ త‌న‌పై కేసులు పెట్టింద‌ని ఆయ‌న చెప్పారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు దండ వేయ‌టం, అవ‌స‌రం లేకుంటే బండ వేయ‌టం రాహుల్ కే చెల్లింద‌ని వివ‌రించారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభ‌జించి, ఇప్పుడు అన్యాయం జ‌రిగింద‌ని రాహుల్ మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.
పార్టీ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌లో ధ‌ర్నా, త‌ణుకు, మంగ‌ళ‌గిరి ల‌లో దీక్ష‌లు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండ‌ల కేంద్రాల్లో ధ‌ర్నాలు చేయ‌టం రాహుల్ కు గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు. రైతు, చేనేత కార్మికుల ఆత్మ‌హత్య‌ల గురించి దేశానికి తెలియ‌చేసేందుకు రైతు భ‌రోసా యాత్ర చేపట్టిన‌ట్లు జ‌గ‌న్ వివ‌రించారు. నాలుగు నెల‌ల రైతు భ‌రోసా యాత్ర‌లో ప‌ర్య‌టిస్తున్నాన‌ని చెప్పారు. అనంత‌పురం జిల్లాలోని బాధాక‌ర‌మైన పరిస్థితుల్ని దేశ‌మంతా తెలుసుకొనేట్లు చేశాన‌ని వివ‌రించారు. అది తెలుసుకొనే రాహుల్ గాంధీ అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌ని చెప్పారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు హామీల‌ను న‌మ్మి రైతులు, డ్వాక్రా మ‌హిళ‌లు రుణాలు క‌ట్ట‌క అప్పుల ఊబిలో కూరుకొని పోయార‌ని చెప్పారు. ఒక్క అనంత‌పురం జిల్లాలోనే 70 మంది రైతులు, 20మంది చేనేత కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకొన్నార‌ని వివ‌రించారు.
Back to Top