వచ్చాడయ్యా సామీ...




– వెన్నుతడుతూ, వెన్నంటి ఉంటూ సాగుతున్న జననేత
– బ్రహ్మరథం పడుతున్న అన్ని వర్గాల ప్రజలు 
– 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 
– 24న విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో పైలాన్‌ ఆవిష్కరణ


అణచివేత నుంచి అవేశం పుట్టింది
అసహనం నుంచి ఆలోచన పురుడు పోసుకుంది..
జనం ఆవేదన చూసి హృదయం జ్వలించింది...
అణచివేత, అసహనం, ఆవేదనల పర్యవసానంగా మొదలైన తిరుగుబాటు ప్రజల మద్దతుతో ఊరూరా దావానంలో పాకింది. ప్రతి గుండెలో పెల్లుబుకుతున్న బాధ.. కన్నీరై బుగ్గలపై దారలు కడుతుంటే.. 
అమ్మకు పెద్ద కొడుకుగా, అక్కకు, అన్నకు తమ్ముడిగా.., తమ్ముడికి అన్నగా, ప్రతి ఇంటి తరఫునా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక్కడిగా వచ్చాడు. వేధింపులు, కుట్రలను చీల్చుకుంటూ 10 నెలలుగా ఊరూరా సాగిన ప్రజా పాదయాత్రికుడి ప్రయాణం 3వేల కిలో మీటర్లకు చేరుకుంది. 

వైఎస్సార్‌ కడప జిల్లాలో తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్‌ పాదాల చెంత నుంచి మొదలైన వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర.. ప్రజలందరి మద్దతుతో కీలక మైలురాయిని అందుకుంది. 10 నెలల పాటు పదకొండు జిల్లాల్లో సాగిన అలుపెరుగని పోరాటం నిర్విరామంగా సాగుతోంది. అడుగడుగునా వచ్చి కలుస్తున్న అభిమానులు, ప్రభుత్వ బాధితులకు అండగా ఉంటానని ధైర్యం నింపుతూ సాగిన ప్రయాణం.. ఎండా, వానా, చలి, గాలి లెక్క చేయకుండా సాగుతున్న పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా జననేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన హారతులు పడుతున్నారు.  ప్రతి జిల్లాలోకి జగన్‌ ప్రవేశిస్తున్న సందర్భంగా.. జిల్లాలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానాలు పలుకుతున్నారు. ఎక్కడికెళ్లినా సీఎం.. సీఎం.. సీఎం.. అనే పిలుస్తున్న పిలుపులతో ఆయన జన ప్రకటిత సీఎం అయ్యాడు. 

పాదయాత్రలో దారులన్నీ గోదారిని తలపించేలా.. బహిరంగ సభ జరిగితే నేల ఈనిందా అనిపించేలా.. ఆయన ధర్నాకు పిలుపిస్తే సముద్రం ఉప్పొంగిందా అనిపించేలా.. వస్తున్న ప్రజా ప్రవాహాన్ని చూసి అధికార పక్షం వెన్నులో వణుకు పుట్టింది. బ్రిడ్జిల మీద పాదయాత్ర ఆపుదామని చూసిన వారు, అనుమతుల పేరుతో కుట్రలు చేయజూసి ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గక తప్పలేదు. అధికార పార్టీలోని ప్రముఖ నాయకులు, మంత్రుల నియోజకవర్గాలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్ర.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. అభిమాన నాయకుడిని కళ్లారా చూసేందుకు వచ్చేవారు కొందరైతే.. బాధను చెప్పుకుని మద్ధతు కోరేందుకు వచ్చేవారు ఇంకొందరు.. మాకోసం అవిశ్రాంతంగా పోరాడే మీరు చల్లగా ఉండాలని ఆశీర్వదించేవారు ఇంకొందరు. కారణమేదైనా జననేతకు వెన్నుదన్నుగా పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 
ఇప్పటి వరకు 267 రోజుల పాటు సాగిన పాదయాత్రలో 107 బహిరంగ సభల్లో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. మొత్తం 116 నియోజకవర్గాల్లో 193 మండలాల గుండా 1650 గ్రామాల్లో పాదయాత్ర సాగింది. ఈనెల 24న విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా అక్కడ భారీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top